వెబ్ సిరీస్, ఓటీటీ .. సినిమా, టీవీలకు ఇవి ప్రత్యామ్నాయంగా మారిపోయాయి. ఒకప్పుడు కొత్త సినిమా అంటే థియేటర్‌కు వెళ్లి చూడాల్సిందే. లేదంటే ఎప్పుడో ఏడాదికి టీవీలో వచ్చే వరకు ఆగాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరం లేదు.
ఓవర్ ద టాప్ (ఓటీటీ) స్ట్రీమింగ్ సర్వీసులతో మీకు నచ్చిన సినిమా, నచ్చిన సమయంలో చూడొచ్చు. కొత్త సినిమాలు కూడా నెల, రెండు నెలల్లోనే వీటిలో వచ్చేస్తున్నాయి. కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. పైగా ఈ మధ్య రిలయెన్స్ జియో తన ఫైబర్ నెట్‌వర్క్‌ను లాంచ్ చేస్తున్న సమయంలో మరో సంచలన ప్రకటన కూడా చేసింది. వచ్చే ఏడాది నుంచి సినిమా రిలీజైన రోజే ఇంట్లో చూసే అవకాశం కల్పిస్తామని ప్రకటించింది.
ఇక ఫ్లిప్‌కార్ట్, జొమాటోలాంటి మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఏమాత్రం సంబంధం లేని సంస్థలు కూడా ఓటీటీ సర్వీసుల్లోకి అడుగు పెడుతున్నాయి. వెబ్ సిరీస్ అందిస్తున్నాయి. దీనినిబట్టే ఓటీటీ సర్వీసులకు రానున్న రోజుల్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వీటిలో సినిమాలకే కాదు.. వెబ్ సిరీస్‌కు కూడా మంచి క్రేజ్ ఉంటోంది. సినిమాల స్థాయిలో కొత్త కొత్త స్టోరీలు, భారీ బడ్జెట్‌తో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.
మీ దగ్గర స్టోరీ ఉందా?
సగటున పది, పదిహేను ఎపిసోడ్స్, సీజన్లతో ఈ వెబ్ సిరీస్ ఆడియెన్స్‌కు కొత్త థ్రిల్‌ను పంచుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌లో కొత్త స్టోరీలు, ఐడియాల కోసం ఓటీటీ చానెల్స్.. యంగ్ టాలెంట్ కోసం వెతుకుతున్నాయి.
మీ దగ్గర ఓ మంచి స్టోరీ ఉంటే.. దానిని ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కించవచ్చు అని మీరు అనుకుంటే.. వెంటనే ఈ ఓటీటీ చానెల్స్ దగ్గరికి వెళ్లొచ్చు. ప్రస్తుతం ఇండియాలో టాప్ ఓటీటీ సర్వీసులైన అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లాంటివి కొత్త స్టోరీల కోసం ఎదురు చూస్తున్నాయి.
ఇలాంటి స్టోరీలను ఇచ్చే వాళ్లను వెతకడానికి వివిధ టాలెంట్ హంటింగ్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. మరి ఇలాంటి అద్భుతమైన ఆఫర్లు ఇస్తున్న ఆ కంపెనీలు.. వాటి వివరాలు డియర్ అర్బన్.కామ్ అందిస్తున్న ఈ స్టోరీలో చూడండి.
అమెజాన్ స్టూడియోస్
మన దగ్గర బాగా పాపులర్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోకి కంటెంట్ అందించేది ఈ అమెజాన్ స్టూడియోసే. అమెజాన్ అనుబంధ సంస్థ ఇది. టెలివిజన్ సిరీస్‌తోపాటు సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సంస్థ ఇప్పుడు కొత్త ఐడియాలు, స్టోరీల కోసం వెతుకుతోంది.
దీని కోసం ప్రత్యేకంగా ట్రైఫోర్స్ క్రియేటివ్ అనే ప్రొడక్షన్ హౌజ్‌తో ఒప్పందం కుదర్చుకుంది. యాక్టర్స్, రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కావాలనుకున్న వాళ్లకు ఈ ప్రొడక్షన్ హౌజ్ అవకాశాలు కల్పిస్తోంది. ఇండియాతోపాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో వెబ్ సిరీస్ కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది.
ముఖ్యంగా కామెడీ, యాక్షన్, థ్రిల్లర్, డ్రామా, సైంటిఫిక్ ఫిక్షన్ కేటగిరీల్లో మీ దగ్గర మంచి స్క్రిప్ట్ ఉంటే.. ఈ అమెజాన్ స్టూడియోస్‌ను కాంటాక్ట్ అవచ్చు. మరిన్ని వివరాల కోసం https://thetcn.com/, https://studios.amazon.com/ వెబ్‌సైట్స్‌లోకి వెళ్లండి.
స్టార్ ఇండియా
స్టార్ గ్రూప్ ఎంత పెద్దదో తెలుసు కదా. అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఇది చాలా ఫేమస్. ఇప్పుడా గ్రూప్ కూడా వెబ్ సిరీస్ కోసం వెతుకుతోంది. తన అధికారిక వెబ్‌సైట్‌లో పిచ్ యువర్ ఐడియాస్ పేరుతో ప్రత్యేకంగా ఓ కేటగిరీని ప్రారంభించింది.
తెలుగులో స్టార్ మాతోపాటు హిందీలో స్టార్ ప్లస్, ఏషియానెట్, స్టార్ భారత్‌లాంటి చానెల్స్.. హాట్‌స్టార్‌లాంటి ఓటీటీ సర్వీసుకు కూడా స్టోరీలను ఆహ్వానిస్తోంది.
మీ దగ్గర ఫిక్షన్ లేదా నాన్ ఫిక్షన్ లేదా కామెడీ సిరీస్‌కు సంబంధించి ఎలాంటి స్క్రిప్ట్ ఉన్నా.. ఈ స్టార్ ఇండియా వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఐడియాను షేర్ చేసుకోవచ్చు. అది వాళ్లకు నచ్చితే స్టార్‌తో పని చేసే అవకాశం మీకు దక్కుతుంది. https://www.startv.com/pitch-
ప్రతి ఏటా 15 మంది రైటర్స్‌ను స్టార్ ఇండియా తీసుకుంటోంది. అందులో రెండు ఉత్తమమైన ఐడియాలను ఓ షోగా డెవలప్ చేస్తున్నారు. ఇదే స్టార్ రైటర్స్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసింది. టెలివిజన్ రైటింగ్‌లో ఇది ఏడు నెలల కోర్సు. ఈ కోర్సుకు సెలక్ట్ అయిన వాళ్లకు నెలకు రూ. 70 వేల స్టైపెండ్ ఇస్తారు. ఆ తర్వాత రెండేళ్లపాటు స్టార్‌తో పని చేస్తామని ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. https://starwritersprogram.
వాట్‌ప్యాడ్‌తో నెట్‌ఫ్లిక్స్
వరల్డ్ ఫేమస్ ఓటీటీ సర్వీస్ అయిన నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్‌ఫిక్షన్ వెబ్‌సైట్ అయిన వాట్‌ప్యాడ్ (Wattpad)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో 8 కోట్లకుపైగా రైటర్స్, రీడర్స్ ఉన్నారు. మీ దగ్గర ఓ మంచి స్టోరీ ఉంటే ఇందులో పోస్ట్ చేయొచ్చు.
ఇందులో చాలా వరకు ఓ స్టోరీని కొత్తగా ఎలా ప్రజెంట్ చేయాలి.. తమకు నచ్చిన షోకు సంబంధించిన క్లైమాక్స్ మరో రకంగా ఎలా ఉంటే బాగుంటుంది అన్నవి పోస్ట్ చేస్తుంటారు. ఎన్నో కొత్త కొత్త ఐడియాలు, స్టోరీస్‌కు ఈ వాట్‌ప్యాడ్ మంచి వేదిక. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
వీటిలో అమెచ్యూర్ రైటర్స్ రాసిన స్టోరీలు ఏవైనా నచ్చితే వాటిని నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్ సిరీస్‌గా రూపొందించాలన్నది ఆ సంస్థ ప్లాన్. నిజానికి ఈ Wattpadకు నెట్‌ఫ్లిక్స్‌తోపాటు హులు, సోనీలాంటి పెద్ద పెద్ద కంపెనీలతో కూడా ఒప్పందాలు ఉన్నాయి.
మీ దగ్గర ఏవైనా మంచి స్టోరీలు ఉంటే https://www.wattpad.com/ లోకి వెళ్లి వాటిని షేర్ చేసుకోండి. మీ ఫ్యాన్ బేస్ పెరుగుతున్న కొద్దీ టాప్ కంపెనీలు వాటిని వాడుకునే అవకాశాలు మెరుగవుతాయి.
వీటికితోడు కలర్స్, సీఎన్‌ఎన్ న్యూస్ 18లాంటి ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్ చానెల్స్‌కు చెందిన వూట్ కూడా ఓటీటీ సర్వీసులు అందిస్తోంది. అటు జీ నెట్‌వర్క్‌కు చెందిన జీ5 కూడా చాలా రోజుల కిందటే ఓటీటీ స్ట్రీమింగ్‌లోకి అడుగుపెట్టింది. ఇవి కూడా ఒరిజినల్ వెబ్ సిరీస్ లు రూపొందిస్తున్నాయి.
ఇండియాలోని దాదాపు పది ప్రాంతీయ భాషల్లో ఈ సిరీస్‌లను తెరకెక్కిస్తుండటం విశేషం. అందులో తెలుగు కూడా ఉంది. వెబ్ సిరీస్‌కు తగిన స్టోరీ మీ దగ్గర ఉంది అనుకుంటే.. ఈ ఓటీటీ సర్వీసులనూ సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి