Home లైఫ్‌స్టైల్ Weight Loss Tea: టీ తాగుతూ కూడా బ‌రువు త‌గ్గొచ్చనే విష‌యం మీకు తెలుసా!

Weight Loss Tea: టీ తాగుతూ కూడా బ‌రువు త‌గ్గొచ్చనే విష‌యం మీకు తెలుసా!

a cup of lemon tea
టీ తాగుతూ బరువు తగ్గండిలా "a cup of lemon tea" by argyadiptya is licensed under CC BY 2.0

Weight Loss Tea: టీ తాగుతూ కూడా మీ బ‌రువును సుల‌భంగా తగ్గించుకోవ‌చ్చు. అదెలాగా అనుకుంటున్నారా? అయితే ఇక్కడ తెలిపిన వివిధ ర‌కాల టీల గురించి చ‌దివి ప్ర‌య‌త్నించి చూడండి. కొన్ని ర‌కాల టీల‌ను తాగడం వల్ల కణాలు దెబ్బతినకుండా కాపాడడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం మరియు బరువు నిర్వహణ వంటి వివిధ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రోజూ ఉద‌యాన్నే వేడి వేడి టీ నోట్లొ ప‌డందే రోజును ప్రారంభించని వారు అరుదే. కొంద‌రు టీ తాగ‌డం ఎంత ఇష్టం ఉన్నా అది తాగ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతామని ఆ ఇష్టాన్ని వ‌దిలేస్తారు. కానీ కొన్ని టీలు ఆరోగ్యానికి చాలా బాగా ప‌నిచేస్తాయి. బరువును అదుపులో ఉంచ‌డంలో మంచి ఫ‌లితాల‌ను ఇస్తాయి. అవేంటో తెలుసుకుందాం. 

1. గ్రీన్ టీ (Green Tea)

ఈ గ్రీన్ టీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. ఇవి జీవక్రియను పెంచడంలో,  కొవ్వును క‌రిగించ‌డంలో అద్భుత ఫ‌లితాల‌ను ఇస్తాయి. ఇందులోని ఫ్లేవ‌నాయిడ్స్ బ‌రువును త‌గ్గించేందుకు దోహదపడుతాయి. ఉద‌యం రెండు నుంచి మూడు క‌ప్పుల గ్రీన్ టీ తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాన్ని చూడ‌వచ్చు.

2. బ్లాక్ టీ (Black Tea)

బ్లాక్ టీ  కూడా బరువును త‌గ్గించే టీల‌లో ఒక‌టి. బ్లాక్ టీలో అధికంగా ఆక్సిడైజ్ చేయబడిన  ర‌సాయ‌నం ఉంటుంది. ఇది శ‌రీరంలో జీవ‌క్రియ‌ను పెంచి శ‌క్తి స్థాయిల‌ను మెరుగుప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. ఈ బ్లాక్ టీ అనేది ఆక‌లిని అణ‌చివేస్తుంది. యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన ఈ టీ ఫ్లేవోన్ల అధిక సాంద్రత కారణంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మూడు నెలల పాటు ప్రతిరోజూ మూడు కప్పుల బ్లాక్ టీ తాగ‌డం వ‌ల‌న‌ బరువు తగ్గడం సాధ్యపడుతుంది. నడుము చుట్టుకొలతను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

3. వాము టీ (ajwain tea):

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు రోజూ ఉద‌యాన్నే ఖాళీ క‌డుపుతో ఈ వాము టీ  తాగితే మంచి ఫ‌లితాన్ని చూడ‌వ‌చ్చు. కొలెస్ట్రాల్‌ను తగ్గించ‌డంలో ఇది చాలా వేగ‌వంతంగా ప‌నిచేస్తుంది. వాములో ఉండే కార్మినేటివ్  పొట్ట ఉబ్బ‌రాన్ని తగ్గించ‌డంలో ప్ర‌భావవంత‌మైన‌ది.

4. లెమన్ టీ (Lemon Tea)

లెమన్ టీ ఒక గొప్ప మార్నింగ్ స్టార్టర్. ఇది శరీరం నుండి మలినాలను బయటకు పంపుతుంది. జీవక్రియను పెంచుతుంది. మీరు మీ లెమన్ టీలో అల్లం, తేనెను జోడించవచ్చు. రుచికి రుచితో పాటు బ‌రువును, కొవ్వును తగ్గించే పానీయంగా మారుతుంది.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version