Home ఫుడ్ palak chutney: పాలకూర చట్నీ.. పావుగంటలో రెడీ

palak chutney: పాలకూర చట్నీ.. పావుగంటలో రెడీ

palakura chutney

palak chutney: పాలకూర చట్నీ చూడగానే నోరూరిస్తుంది. పైగా హెల్తీ ఫుడ్ ఆరగిస్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది. రోజూ పల్లీల చట్నీ తిని విసుగువస్తే ఈ పాలకూర చట్నీ ట్రై చేసి చూడండి. పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. పాల కూర చట్నీ చేసేందుకు పెద్దగా సమయం కూడా పట్టదు. పావు గంటలో రెడీ చేసుకోవచ్చు.

palak chutney ingredients: పాలకూర చట్నీకి కావలసిన పదార్థాలుః

పాలకూర    – 250 గ్రాములు
పచ్చిమిర్చి  – 8
పల్లీలు       – 4 టీ స్పూన్లు
చింతపండు  – కొద్దిగా
వెల్లుల్లి       – 6 రెమ్మలు
ఆవాలు     – అర చెంచా
జీలకర్ర      – అర చెంచా
మినప పప్పు   – అర చెంచా
శనగపప్పు   – అర చెంచా
ఎండుమిర్చి  – 2
ఉప్పు         – రుచికి సరిపడా
నూనె        – 4 టీ స్పూన్లు

palak chutney recipe making: పాలకూర చట్నీ తయారీ విధానంః

  1. ముందుగా పాలకూరను చిన్నగా కట్‌ చేసి, నీటితో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.

2. స్టవ్‌ ఆన్‌ చేసి కడాయి పెట్టి, పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి.

3. తరువాత కడాయిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.

4. తరువాత అందులోనే శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరను, కొద్దిగా చింతపండు వేసి, ఐదు నిమిషాలు ఉడికిన తరవాత స్టవ్‌ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి.

5. ఇప్పుడు మిక్సీజార్‌లోకి ఈ మిశ్రమాన్ని తీసుకొని, అందులో వెల్లుల్లి రెబ్బలు, ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి.

6. ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శెనగ పప్పు, ఎండు మిర్చి వేసి వేగాక స్టవ్‌ ఆపేసి, మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.

అంతే ఎంతో రుచికరమైన పాలకూర చట్నీ రెడీ..

పాలకూరలో ఉండే పోషక విలువలు ఇవే.. (ప్రతి 100 గ్రాములకు)

పోషకంవిలువ
కాలరీలు23
సోడియం79 మి.గ్రా.
పోటాషియం558 మి.గ్రా.
టోటల్ కార్బోహైడ్రేట్స్3.6 గ్రా.
డయిటరీ ఫైబర్2.2 గ్రా.
చక్కెర0.4 గ్రా.
ప్రోటీన్2.9 గ్రా.
విటమిన్ ఏ500 మి.గ్రా.
ఫోలేట్220 మి.గ్రా
Exit mobile version