వడదెబ్బ నుంచి కాపాడే ఆహారాలు ఇవే

వేసవి కాలంలో వడదెబ్బ కొట్టే అవకాశం ఉంది. అందుకే ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

కీరాదోసతో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది

క్యారట్లలో ఉండే విటమిన్ కె, పొటాషియం వడ దెబ్బ నుంచి రక్షిస్తాయి

బ్రకోలిలో 90 శాతం నీరే ఉంటుంది.ఫైబర్, ఐరన్, విటమిన్ సి, కె, పొటాషియం వడదెబ్బ నుంచి రక్షణ ఇస్తాయి

నారింజ పండ్లలో విటమిన్ సీ తో పాటు నీరు ఎక్కువగా ఉంటుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది

పుచ్చకాయలో 92 శాతం నీరే ఉంటుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాదు

కొబ్బరి నీళ్లలో ఉండే ఖనిజ లవణాలు వడ దెబ్బ నుంచి రక్షణ ఇస్తాయి

మజ్జిగతో శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవచ్చు. వడదెబ్బ నుంచి ఉపశమనం పొందవచ్చు

పండ్ల రసాలతో వడదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది