రోజూ వంటల్లో అల్లం కచ్చితంగా కలిపి వండాలి. అల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అల్లం తినడం వల్ల E.coli, RSV వంటి భయంకర బ్యాక్టిరియాలతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది.
అల్లం తినడం వల్ల నోటిలోని బ్యాక్టిరియా నశిస్తుంది.
పొట్ట గడబిడగా ఉన్నప్పుడు చిన్న అల్లం ముక్క నమిలితే పరిస్థితి చక్కబడుతుంది.
రుమటాయిడ్ ఆర్ధరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు ఉన్న వారు రోజూ అల్లం కచ్చితంగా తినాలి.
మహిళలు అల్లం తినడం వల్ల నెలసరి సమయంలో వచ్చే పొట్ట నొప్పి తగ్గుతుంది.
గర్భిణులు రోజూ అల్లంతో వండిన వంటుల తింటే మార్నింగ్ సిక్నెస్ తగ్గుతుంది.
దెబ్బతిన్న శరీర కణాలను కాపాడే శక్తి అల్లానికి ఉంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ.
అయితే అల్లం అధికంగా తినకూడదు. మితంగా తింటేనే ఆరోగ్యం. లేకుంటే శరీరానికి వేడి చేస్తుంది.