Home హెల్త్ బెస్ట్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ లైఫ్ స్టయిల్ డిసీజెస్

బెస్ట్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ లైఫ్ స్టయిల్ డిసీజెస్

best doctors in hyderabad
Pic Credit: Pixabay

ర్బన్‌ లైఫ్‌స్టైల్‌తో రోజుకో కొత్త వ్యాధి మనల్ని చుట్టుముడుతోంది. మనం తీసుకుంటున్న ఆహారం, అసలు శారీరక శ్రమ లేని జీవితం కారణంగా హార్ట్‌ ఎటాక్‌, ఒబెసిటీ, హైపర్‌ టెన్షన్‌, టైప్ 2 డయాబెటిస్‌లాంటి జబ్బులు సర్వసాధారణమయ్యాయి. మన స్నేహితులు, బంధువుల నుంచి తరచుగా ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఫలానా వ్యాధికి బెస్ట్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్ ఎవరు అన్న ప్రశ్న తరచుగా వినిపిస్తుంది. 

లైఫ్ స్టయిల్ డిసీజెస్ అంటే..

పని చేసే చోట ఒత్తిడి కారణంగా ఆల్కహాల్, స్మోకింగ్‌లాంటి చెడు అలవాట్లకు కూడా బానిసలవుతున్నారు. వీటి వల్ల క్యాన్సర్‌, లివర్ సిరోసిస్‌లాంటి ప్రాణాంతక వ్యాధులు జీవితాన్ని కబలిస్తున్నాయి. లైఫ్‌స్టైల్‌ వ్యాధుల్లో ఇవి చాలా ప్రమాదకరం. వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. అయితే ఈ ప్రాణాంతక వ్యాధులను కూడా నయం చేసే అత్యుత్తమ డాక్టర్లు మన దగ్గర ఉన్నారు. ఒక్కో వ్యాధికి ఒక్కో స్పెషలిస్ట్‌ ఉంటారు. చాలా మందికి వాళ్ల సమాచారం అందుబాటులో ఉండటం లేదు.

గుండె జబ్బు వస్తే ఎవరి దగ్గరికి వెళ్లాలి.. డయాబెటిస్‌ను కంట్రోల్‌ చేసే డాక్టర్‌ ఎవరు.. ఒబెసిటీ, హైపర్‌టెన్షన్‌లకు మంచి వైద్యం ఎక్కడ దొరుకుంతుందన్న సమాచారం అందరికీ తెలియదు. ఈ నేపథ్యంలో అనుభవం, వాళ్ల దగ్గర చికిత్స తీసుకున్న పేషెంట్ల ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా బెస్ట్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్  వివరాలు డియర్‌ అర్బన్‌.కామ్‌ రీడర్ల కోసం..

గుండె జబ్బులు

హైబీపీ, స్మోకింగ్‌, ఆల్కహాల్‌, ఒత్తిడి కారణంగా ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు ఎక్కువయ్యాయి. 30,40 ఏళ్ల వయసున్న వాళ్లకు కూడా హార్ట్‌ ఎటాక్‌లు రావడం మనం చూస్తున్నాం. అయితే గుండె జబ్బులకు చికిత్స అందించే అత్యుత్తమ కార్డియాలజిస్టులు హైదరాబాద్‌లో చాలా మందే ఉన్నారు. బెస్ట్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ హార్ట్ డిసీజెస్ అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడ చూడొచ్చు

బెస్ట్‌ కార్డియాలజిస్టులు

డాక్టర్‌ బి. సోమరాజు, ఎంబీబీఎస్‌, ఎండీ, డీఎం (కేర్‌ హాస్పిటల్‌)

డాక్టర్‌ సోమరాజు 41 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ వన్‌లో ఉన్న కేర్‌ హాస్పిటల్‌ చైర్మన్‌ ఈయన. ఇక్కడే కార్డియాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. 1974లో గుంటూరు మెడికల్‌ కాలేజ్‌ నుంచి ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఆయన.. చండీగడ్‌లో పీజీ చేశారు. 1978లో ఉస్మానియా మెడికల్‌ కాలేజీ కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన.. తర్వాత 1984 నుంచి 1993 వరకు నిమ్స్‌లోనూ పని చేశారు.

బంజారాహిల్స్‌తోపాటు నాంపల్లి, గచ్చిబౌలిలో ఉన్న కేర్‌ ఆసుపత్రుల్లోనూ ఆయన అందుబాటులో ఉంటారు. నాంపల్లిలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటారు. ఇక సోమ, బుధ, శుక్రవారాల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు గచ్చిబౌలి ఆసుపత్రిలో ఆయనను కలవచ్చు.

సోమవారం, శుక్రవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రిలో ఉంటారు. ఇదే హాస్పిటల్‌లో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదు గంటల వరకు, గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు, ఆదివారం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంటారు.

ఈయన అపాయింట్‌మెంట్‌ ఫీజు రూ. 550. 040 7196 5389కి ఫోన్‌ చేసి అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చు. bsr@carehospitals.comకి మెయిల్‌ కూడా చేయొచ్చు.

డాక్టర్‌ సీహెచ్‌ ఉమేష్‌ చంద్ర, ఎంబీబీఎస్‌, ఎండీ-జనరల్‌ మెడిసిన్‌, డీఎం-కార్డియాలజీ

కార్డియాలజిస్టుల్లో అత్యంత అనుభవం ఉన్న డాక్టర్లలో ఉమేష్‌ చంద్ర కూడా ఒకరు. ఈయన 38 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి గవర్నర్లుగా చేసిన ఐదుగురికి ఈయన ఎంతో నమ్మకమైన ఫిజిషియన్‌ కావడం విశేషం. కుముద్‌ బెన్‌ జోషి, కృష్ణకాంత్‌, రంగరాజన్‌, సుర్జిత్‌ సింగ్‌ బర్నాలా, ఎన్డీ తివారీలకు ఈయన వ్యక్తిగత డాక్టర్‌గా సేవలందించారు.

ప్రస్తుతం వివిధ హాస్పిటల్స్‌లో సీనియర్‌ కార్డియాలజీ కన్సల్టెంట్‌గా ఉన్నారు. కేర్‌ హాస్పిటల్‌తోపాటు కామినేని, SEHA ఆసుపత్రులకు కన్సల్టెంట్‌గా ఉన్నారు. అయితే ప్రతి రోజు మాత్రం అబిడ్స్‌లోని ఉమా హార్ట్‌ కేర్‌ క్లీనిక్‌, జూబ్లీహిల్స్‌లోని వెల్‌కేర్‌ డయాగ్నస్టిక్స్‌లో డాక్టర్‌ ఉమేష్‌ చంద్రను కలవచ్చు. ఈయన ఫీజు రూ. 600. సోమవారం నుంచి శనివారం వరకు అబిడ్స్‌లోని ఉమా హార్ట్‌కేర్‌ క్లీనిక్‌లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఇక ఇవే రోజుల్లో ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు జూబ్లీహిల్స్‌లోని వెల్‌కేర్‌ డయాగ్నిస్టిక్స్‌లో ఉంటారు.

అపాయింట్‌మెంట్‌ కోసం 040 6782 2434,  040 2333 2333, 98497 92919 నంబర్లను సంప్రదించవచ్చు. ఆయనకు వ్యక్తిగతంగా మెయిల్‌ చేయాలనుకుంటే umeshdoc22@gmail.comకు చేయొచ్చు.

డాక్టర్‌ రవికుమార్‌ ఆలూరి, ఎంబీబీఎస్‌, ఎండీ-ఇంటర్నల్‌ మెడిసిన్‌, డీఎం-కార్డియాలజీ

డాక్టర్‌గా మొత్తం 21 ఏళ్ల అనుభవం రవికుమార్‌ సొంతం. కార్డియాలజిస్ట్‌లగా 18 ఏళ్ల నుంచి సేవలందిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న సీనియర్‌ ట్రాన్స్‌రేసియల్‌ ఇంటర్‌వెన్షనల్‌ కార్డియాలజిస్టుల్లో ఒకరు. గతంలో నిమ్స్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, గ్లోబల్‌ హాస్పిటల్స్‌లో ప్రొఫెసర్‌గా చేశారు. ఆంధ్రా మెడికల్‌ కాలేజీ నుంచి ఎంబీబీఎస్‌, నిమ్స్‌ నుంచి కార్డియాలజీలో డీఎం పట్టా అందుకున్నారు. ప్రస్తుతం కొండాపూర్‌లోని కిమ్స్‌ హాస్పిటల్‌లో చీఫ్‌ ఇంటర్‌వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌గా, హెచ్‌వోడీగా పని చేస్తున్నారు. కార్డియాక్‌ కేర్‌, కరొనరీ ఇంటర్‌వెన్షన్స్‌లో అత్యంత అనుభవం ఉన్న డాక్టర్‌.

జూబ్లీహిల్స్‌లోని శ్రేయా కార్డియాలజీ క్లీనిక్‌లో ఆదివారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటారు. మిగతా రోజుల్లో ఉదయం 9 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4  గంటల వరకు కొండాపూర్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటారు. ఈయన ఫీజు రూ. 750. కిమ్స్‌లో అపాయింట్‌మెంట్‌ కోసం 040 6782 2370 నంబర్‌కు కాల్‌ చేయొచ్చు.

డాక్టర్‌ అనిల్‌ క్రిష్ణ గుండాలా, ఎంబీబీఎస్‌, డీఎన్‌బీ-జనరల్‌ మెడిసిన్‌, డీఎం-కార్డియాలజీ

ఎమర్జెన్సీ, అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లకు విజయవంతంగా చికిత్స అందించ గల ప్రత్యేకత డాక్టర్‌ అనిల్‌ క్రిష్ణ గుండాల సొంతం. ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టర్‌ ఆఫ్‌ మెడిసిన్‌-కార్డియాలజీలో గోల్డ్‌ మెడలిస్ట్‌ (ఆగస్ట్‌ 2007-ఆగస్ట్‌ 2010). నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్‌ క్రిష్ణ.. ఓ సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చారు. డాక్టర్‌గా మొత్తం 17 ఏళ్ల అనుభవం ఉంది. కార్డియాలజిస్ట్‌గా 9 ఏళ్ల నుంచి సేవలందిస్తున్నారు. అయితే అతి తక్కువ సమయంలోనే సిటీలోని టాప్ కార్డియాలజిస్ట్‌గా ఆయన పేరు సంపాదించారు.

ఈయన హైటెక్‌ సిటీలోని మెడికవర్‌ హాస్పిటల్‌లో సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఈయన ఫీజు రూ.600. అపాయింట్‌మెంట్‌ కోసం 073311 48853 నంబర్‌కుగానీ లేదా maxcurehospitals.com వెబ్‌సైట్‌కిగానీ వెళ్లొచ్చు.

డాక్టర్‌ శ్యామ్‌సుందర్‌ రెడ్డి పారుపాటి, ఎంబీబీఎస్‌, ఎండీ జనరల్‌ మెడిసిన్‌, డీఎం-కార్డియాలజీ

కార్డియాలజిస్ట్‌గా 9 ఏళ్ల అనుభవం ఈయన సొంతం. శ్యామ్‌సుందర్‌ రెడ్డి ప్రధానంగా రేడియల్‌ ఏంజియోప్లాస్టీ, పెరిఫెరల్‌ ఇంటర్‌వెన్షన్స్‌, పీడియాట్రిక్‌ ఇంటర్‌వెన్షన్స్‌లో ఎక్స్‌పర్ట్‌. 2002లో కాకతీయ మెడికల్‌ కాలేజ్‌ నుంచి ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. 2010లో త్రివేండ్రంలోని శ్రీ చిత్ర తిరునల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో కార్డియాలజీలో డీఎం పట్టా అందుకున్నారు. గతంలో లక్డీకాపూల్‌లోని గ్లోబల్‌ హాస్పిటల్స్‌లో పని చేశారు. ప్రస్తుతం కొండాపూర్‌లోని కిమ్స్‌తోపాటు టోలీచౌకీలోని హెల్త్‌ఇన్‌ క్లీనిక్‌లో సేవలందిస్తున్నారు. రీసెర్చ్‌, టీచింగ్‌ ఫీల్డ్‌లలోనూ శ్యామ్‌సుందర్‌కు ఆసక్తి ఉంది. తన సబ్జెక్ట్‌పై ఎన్నో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లలో ప్రసంగించారు. పుస్తకాలు కూడా రాశారు. ఫిజియాలజీ అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో జీఎన్‌ మాథుర్‌ ప్రైజ్‌తోపాటు గోల్డ్‌మెడల్‌ కూడా సొంతం చేసుకున్నారు.

టోలీచౌకీలోని హెల్త్‌ఇన్‌ క్లీనిక్‌లో సోమ, గురు, శనివారాల్లో రాత్రి 7.30 గంటల నుంచి 9.30 వరకు అందుబాటులో ఉంటారు. +91 40678 22616 నంబర్‌కు ఫోన్‌ చేసి అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చు. ఫీజు రూ. 500. ఇక కొండాపూర్‌లోని కిమ్స్‌ హాస్పిటల్‌లో సోమ, బుధ, శనివారాల్లో ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటారు. ఇక్కడ అపాయింట్‌మెంట్‌ కావాలంటే 040 6782 2370 నంబర్‌కు ఫోన్‌ చేయాలి. ఫీజు రూ. 600.

వీళ్లే కాకుండా బంజారాహిల్స్‌ స్టార్‌ హాస్పిటల్‌లో సేవలందించే డాక్టర్‌ రమేష్‌ గూడపాటి (అపాయింట్‌మెంట్‌ కోసం 040 4520 6002, ఫీజు రూ. 450), సికింద్రాబాద్‌ యశోదాలో పనిచేసే డాక్టర్‌ ఎంఎస్‌ ఆదిత్య (అపాయింట్‌మెంట్‌ కోసం 040 4917 0224, ఫీజు రూ. 750) కూడా సిటీలోని బెస్ట్‌ కార్డియాలజిస్టులే.

డయాబెటిస్‌ (మధుమేహం లేదా షుగర్‌)

ఇక లైఫ్‌స్టైల్‌ వ్యాధుల్లో ఈ మధ్య ప్రాణాంతకంగా మారుతున్న వ్యాధి డయాబెటిస్‌. గతంలో పెద్ద వయసు వాళ్లకే వచ్చేది. ఈ మధ్య ఒబెసిటీ కారణంగా చిన్న పిల్లలు కూడా టైప్‌ 2 డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనికి మంచి ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు డాక్టర్‌ను సంప్రదిస్తే మంచిది. డయాబెటిస్‌కు మంచి ట్రీట్‌మెంట్‌ అందించే డాక్టర్లు కూడా హైదరాబాద్‌లో చాలా మందే ఉన్నారు. బెస్ట్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ డయాబెటిస్ అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడ చూడొచ్చు.

బెస్ట్‌ డయాబెటాలజిస్టులు

డాక్టర్‌ గ్రిద్దలూరు వీర చాణుక్య, ఎంబీబీఎస్‌, డీఎం-ఎండోక్రైనాలజీ

ఈ వృత్తిలో మొత్తంగా 16 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి డాక్టర్‌ గ్రిద్దలూరు వీర చాణుక్య. 12 ఏళ్లుగా ఎండోక్రినాలజిస్ట్‌, డయాబెటాలజిస్ట్‌గా సేవలందిస్తున్నారు. లక్డీకాపూల్‌లోని గ్లోబల్‌ హాస్పిటల్‌తోపాటు కేపీహెచ్‌బీలో ఉన్న తన సొంత క్లీనిక్‌లోనూ ఈయన అందుబాటులో ఉంటారు. సిటీలోని బెస్ట్‌ డయాబెటాలజిస్ట్‌లలో ఒకరు.

కేపీహెచ్‌బీలో డాక్టర్‌ చాణుక్యాస్‌ ఎండోక్రినాలజీ అండ్‌ డయాబెటిస్‌ సెంటర్‌ పేరుతో క్లీనిక్‌ ఉంది. ఇక్కడ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం ఆరు నుంచి 8 వరకు, సాయంత్రం ఆరు నుంచి 8 వరకు అందుబాటులో ఉంటారు. ఆదివారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటారు. ఇక్కడ అపాయింట్‌మెంట్ కోసం 040 4520 6002 నంబర్‌కు ఫోన్‌ చేయాలి. ఫీజు రూ. 400.

ఇక లక్టీకాపూల్‌లోని గ్లోబల్‌ హాస్పిటల్‌లో సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటారు. ఇక్కడ ఫీజు రూ. 800.

డాక్టర్‌ సోమ్‌నాథ్‌ గుప్తా, ఎంబీబీఎస్‌, డీఎన్‌బీ-ఇంటర్నల్‌ మెడిసిన్‌, ఎండీ-జనరల్‌ మెడిసిన్‌

వైద్య వృత్తిలో మొత్తంగా 11 ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్‌ సోమ్‌నాథ్‌ గుప్తా. అన్నామలై యూనివర్సిటీ నుంచి డయాబెటాలజీలో మాస్టర్స్‌ పూర్తి చేశారు. ఇంటర్నెల్‌ మెడిసిన్‌, క్రిటికల్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌లో చాలా అనుభవం ఉంది. హైదరాబాద్‌లోని బెస్ట్‌ డయాబెటాలజిస్టుల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన జనరల్‌ ఫిజిషియన్‌, డయాబెటాలజిస్ట్‌, ఇంటెన్సివిస్ట్‌గా పని చేస్తున్నారు.

హైటెక్‌ సిటీలోని పేస్‌ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటారు. జనరల్‌ ఫిజిషియన్‌ అయినా.. డయాబెటిస్ విషయంలో చాలా మంది పేషెంట్లు డాక్టర్‌ సోమ్‌నాథ్‌ పేరును రికమెండ్‌ చేశారు. డయాబెటిస్‌తోపాటు హైపర్‌టెన్షన్‌, కిడ్నీ సంబంధిత వ్యాధులు, శ్వాస సంబంధిత వ్యాధులకు కూడా ఈయన చికిత్స అందిస్తారు. పేస్‌ హాస్పిటల్‌లో సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం పది గంటల నుంచి రాత్రి 8.20 నిమిషాల వరకు అందుబాటులో ఉంటారు. ఈయన అపాయింట్‌మెంట్‌ కోసం 040 4521 0519 నంబర్‌కు ఫోన్‌ చేయండి. ఫీజు రూ.500.

డాక్టర్‌ జి. కిరణ్‌, ఎంబీబీఎస్‌, ఎండీ (ఫిజిషియన్‌)

డాక్టర్‌ కిరణ్స్‌ డయాబెటిక్స్‌ క్లీనిక్‌ పేరుతో సోమాజీగూడలో ఈయన సొంతంగా క్లీనిక్‌ నడుపుతున్నారు. పేషెంట్లకు వాళ్ల లైఫ్‌స్టైల్‌ ఆధారంగా డయాబెటిస్‌కు చికిత్స అందించడం ఈయన ప్రత్యేకత. డయాబెటిస్‌తోపాటు హైపర్‌టెన్షన్‌, కొలెస్ట్రాల్‌, హైపోథైరాయిడ్‌లకు కూడా చికిత్స చేస్తారు. ప్రాణాంతక డయాబెటిస్‌ వ్యాధిని గుర్తించడం, దాని నుంచి బయటపడటం ఎలా అన్న అంశంపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వైద్య వృత్తిలో 13 ఏళ్ల అనుభవం ఉంది.

సోమాజీగూడలోని కిరణ్స్‌ డయాబెటిక్స్‌ క్లీనిక్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ముందుగా కాల్‌ చేస్తే ఏ సమయానికి రావాలో చెప్తారు. 040 6782 2631కు ఫోన్‌ చేసి అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చు.

డాక్టర్‌ ఎం.చంద్రశేఖర్‌, ఎంబీబీఎస్‌

హైదరాబాద్‌లోని చింతల్‌లో ఉన్న అలవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో డాక్టర్‌ చంద్రశేఖర్‌ సేవలందిస్తున్నారు. 11 ఏళ్లుగా జనరల్‌ ఫిజిషియన్‌గా పని చేస్తున్నారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో ఉన్న గీతా నర్సింగ్‌ హోమ్‌లోనూ ఉంటారు. రీసెర్చ్‌ సొసైటీ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డయాబెటిస్‌ ఇన్‌ ఇండియాలో సభ్యుడిగా ఉన్నారు. డయాబెటిస్‌తోపాటు హైపర్‌టెన్షన్‌, థైరాయిడ్‌లకు కూడా చికిత్స అందిస్తారు. 2015లో బోస్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ నుంచి డయాబెటాలజీలో పీజీ చేశారు.

చింతల్‌లోని అలవీ హాస్పిటల్‌లో సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం నుంచి పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటారు. ఆదివారం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు చికిత్స అందిస్తారు. 91601 21257 నంబర్‌కు ఫోన్‌ చేసి అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చు.

థైరాయిడ్‌

ఈ మధ్య అర్బన్‌ లైఫ్‌స్టైల్‌తో వస్తున్న మరో ప్రధాన ఆరోగ్య సమస్య థైరాయిడ్‌. మనిషి గొంతు భాగంలో ఉండే ఈ గ్రంథి జీవక్రియకు అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్య సమస్యలు వస్తాయి. బరువు పెరగడం లేదా తగ్గడం, అలసట, మలబద్ధకం, మహిళల్లో అధిక రుతుస్రావం, డిప్రెషన్‌లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ థైరాయిడ్‌కు అత్యాధునిక చికిత్స అందించే డాక్టర్లు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నారు. పైన డయాబెటిస్‌కు చికిత్స అందించే ఎండోక్రినాలజిస్ట్‌ గ్రిద్దలూరు వీర చాణుక్య ఈ థైరాయిడ్‌ సమస్యకు కూడా బెస్ట్‌ డాక్టర్‌ అని చెప్పొచ్చు. బెస్ట్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ థైరాయిడ్ అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడ చూడొచ్చు.

బెస్ట్‌ ఎండోక్రినాలజిస్టులు

డాక్టర్‌ శ్యామ్ కలవలపల్లి, ఎంబీబీఎస్‌, ఎంఆర్‌సీపీ (యూకే), ఎఫ్‌ఆర్‌సీపీ-ఎండోక్రినాలజీ
మొత్తంగా వైద్య వృత్తిలో 25 ఏళ్లు. ఎండోక్రినాలజిస్ట్‌గా, డయాబెటాలజిస్ట్‌గా 18 ఏళ్ల అనుభవం డాక్టర్‌ శ్యామ్‌ కలవలపల్లికి ఉంది. హైదరాబాద్‌లోని బెస్ట్‌ ఎండోక్రినాలజిస్టులలో ఈయన ఒకరు. లండన్‌లోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలైన ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌, ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌, మాంచెస్ట్‌ యూనివర్సిటీల్లో చదివారు. కొన్నాళ్లు అక్కడే పనిచేసిన తర్వాత హైదరాబాద్‌ వచ్చేశారు. కిమ్స్‌, సన్‌షైన్‌ ఇండియా హాస్పిటల్స్‌లో పని చేశారు.

ఎండోక్రినాలజీ విభాగాలైన థైరాయిడ్‌, పీసీఓఎస్‌, హార్మోన్ల సమస్యలకు చికిత్స అందిస్తారు. ఐడియా క్లీనిక్స్‌ పేరుతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. మాదాపూర్‌, కొండాపూర్‌, కేపీహెచ్‌బీ, దిల్‌సుఖ్‌నగర్‌లలో ఈ క్లీనిక్స్‌ ఉన్నాయి.

మాదాపూర్‌లో సోమ, బుధ, శనివారాల్లో సాయంత్రం ఐదు నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఉంటారు.

ఇక కేపీహెచ్‌బీ ఐడియా క్లీనిక్స్‌లో సోమ, బుధ, శుక్ర, ఆదివారాలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మంగళవారం ఉదయం ఇదే వేళల్లో, సాయంత్రం ఆరు నుంచి 8.30 గంటల వరకు ఉంటారు. ఇక్కడే శనివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటారు.

కొండాపూర్‌లో శుక్రవారం సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 వరకు చికిత్స చేస్తారు.

దిల్‌సుఖ్‌ నగర్‌లో మంగళవారం మధ్యాహ్నం 3.30 నుంచి 4.30 వరకు ఉంటారు. ఈయన ఫీజు రూ.700. 040 6782 2790, 040 4520 6171 నంబర్లకు ఫోన్‌ చేసి అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చు.

డాక్టర్‌ జి. కల్యాణ్‌ చక్రవర్తి, ఎంబీబీఎస్‌, సీసీటీ-ఎండోక్రినాలజీ, ఎంఆర్‌సీపీ (యూకే)

హార్మోన్లకు సంబంధించిన వ్యాధులకు చికిత్స అందించడంలో డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి స్పెషలిస్ట్‌. హైదరాబాద్‌లోని సిటిజన్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఈయన అందుబాటులో ఉంటారు. ఎండోక్రినాలజీకి సంబంధించి యూకేలోని రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజిషియన్‌లోనూ ఆయనకు సభ్యత్వం ఉంది.

లింగంపల్లిలోని సిటిజన్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, 2.30 నుంచి 4 గంటల వరకు అందుబాటులో ఉంటారు. శనివారం మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం 4 గంటల వరకు చికిత్స చేస్తారు.

కేపీహెచ్‌బీలోని ఐడియా క్లీనిక్స్‌లోనూ డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి అందుబాటులో ఉంటారు. ఇక్కడ సోమ, బుధ, శుక్ర, శని వారాల్లో సాయంత్రం ఐదున్నర గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటారు.

ఈయన ఫీజు రూ. 650. అపాయింట్‌మెంట్‌ కోసం 92463 52725 నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు.

డాక్టర్‌ రవికుమార్‌ ముప్పిడి, ఎంబీబీఎస్‌, ఎండీ-జనరల్‌ మెడిసిన్‌, డీఎం-ఎండోక్రినాలజీ

ఎండోక్రినాలజిస్ట్‌గా డాక్టర్‌ రవికుమార్‌కు పదేళ్ల అనుభవం ఉంది. కూకట్‌పల్లిలో అడ్వాన్స్‌డ్‌ ఎండోక్రైన్‌ అండ్‌ డయాబెటిస్‌ హాస్పిటల్‌, రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్‌ కాలేజ్‌లో ఎండోక్రినాలజీలో డీఎం చేశారు. తర్వాత వెల్లూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేశారు.

థైరాయిడ్‌తోపాటు ఒబెసిటీ, పీసీఓఎస్‌, హైపర్‌టెన్షన్‌లాంటి ఆరోగ్య సమస్యలకు కూడా చికిత్స అందిస్తారు. కేపీహెచ్‌బీ ఫేస్‌ వన్‌లోని రోడ్‌ నంబర్‌ వన్‌లో ఉన్న అడ్వాన్స్‌డ్‌ ఎండోక్రైన్‌ అండ్‌ డయాబెటిస్‌ హాస్పిటల్‌లో ఉంటారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 వరకు అందుబాటులో ఉంటారు. ఈయన ఫీజు రూ.650. అపాయింట్‌మెంట్‌ కోసం 040 40101539 నంబర్‌కు కాల్ చేయొచ్చు.

హైపర్‌టెన్షన్‌

అర్బన్‌ లైఫ్‌స్టైల్‌తో ప్రతి ఒక్కరికీ సర్వ సాధారణంగా వచ్చే సమస్య హైబీపీ. దీనినే మెడికల్‌ టెర్మినాలజీలో హైపర్‌టెన్షన్‌ అంటారు. శరీరంలో రక్తప్రసరణం రేటు 140/90కి మించి ఉంటే దానిని హైపర్‌టెన్షన్‌గా చెబుతారు. సాధారణంగా హైబీపీ ఉన్న వాళ్లకు కూడా ఆ లక్షణాలు పెద్దగా బయటకు కనిపించవు.

కొంత మందికి మాత్రం తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ముక్కు నుంచి రక్తం కారడంలాంటివి ఉంటాయి. హైబీపీ సాధారణంగా గుండె జబ్బులకు కూడా దారితీస్తుంది. ఆహారంలో ఎక్కువగా ఉప్పు తీసుకోవడం, అధికంగా మద్యం సేవించడం, ఒత్తిడి, స్మోకింగ్‌లతోపాటు వారసత్వంగా కూడా ఈ హైపర్‌టెన్షన్‌ సమస్య తలెత్తుతుంది.

హైదరాబాద్‌లోని బెస్ట్ కార్డియాలజిస్టులందరూ హైపర్‌టెన్షన్‌కు కూడా చికిత్స అందిస్తారు. వీళ్లతోపాటు డాక్టర్‌ బాలాజీ (మెడికవర్‌ హాస్పిటల్‌, హైటెక్‌ సిటీ), డాక్టర్‌ రాజా భౌమిక్‌ (ఓక్రిడ్జ్‌ హాస్పిటల్‌, మాదాపూర్‌), డాక్టర్‌ షేక్‌ స్వాలేహీ భక్ష్‌ (తుంబే హాస్పిటల్‌, మలక్‌పేట్‌)లు కూడా హైపర్‌టెన్షన్‌కు మెరుగైన చికిత్స అందిస్తారు. 

Exit mobile version