హైదరాబాద్‌లో ఏ ప్రాంతంలో ఫ్లాట్ కొంటే బెటర్? భవిష్యత్తులో వృద్ధి ఎటువైపు ఉంటుంది? ఎక్కడ కొంటే విలువ పెరుగుతుంది? వంటి విషయాల గురించి ఆలోచిస్తున్నట్టయితే ఈ స్టోరీ మీ కోసమే. గత దశాబ్దంలో భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన మహానగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో నిలిచింది. ఐటీ, ఫార్మా, మౌలిక సదుపాయాల రంగాలలో ప్రభుత్వం చేస్తున్న భారీ పెట్టుబడులు, స్థిరమైన రాజకీయ వాతావరణం, సుస్థిరమైన భూసేకరణ విధానాలు దీనికి ప్రధాన కారణాలు. ఈ వృద్ధి రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. గృహ కొనుగోలుదారులకు, పెట్టుబడిదారులకు హైదరాబాద్ ఒక సురక్షితమైన, లాభదాయకమైన గమ్యస్థానంగా మారింది.
ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్: కొత్త దిశగా పయనం
- ఐటీ హబ్ నుండి మల్టీ-సెంటర్ గ్రోత్: ఒకప్పుడు కేవలం గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ఐటీ కారిడార్‌లకు మాత్రమే పరిమితమైన రియల్ ఎస్టేట్ వృద్ధి ఇప్పుడు నగరం నలువైపులా విస్తరిస్తోంది. వరంగల్ హైవే వైపున పోచారం, నార్త్ హైదరాబాద్ వైపున కొంపల్లి, ఈస్ట్ వైపున ఉప్పల్, ఎల్బీ నగర్, వెస్ట్ వైపున గండిపేట, కోకాపేట వంటి ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ వికేంద్రీకరణ వలన నగరంలో ట్రాఫిక్ సమస్య కొంత తగ్గుముఖం పట్టడంతో పాటు, వివిధ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.
- అద్దె మార్కెట్‌లో పెరుగుదల: కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్-ఫ్రమ్-ఆఫీస్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడంతో అద్దె గృహాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. పశ్చిమ హైదరాబాద్‌లో అద్దెలు 15-20% మేర పెరిగాయి. దీనికి తోడు, గేటెడ్ కమ్యూనిటీలు, సురక్షితమైన వాతావరణం కోరుకునే కుటుంబాలు అధిక అద్దెలు చెల్లించడానికి వెనుకాడటం లేదు.
- లగ్జరీ ప్రాజెక్టుల ప్రాబల్యం: నగరంలో అధిక ఆదాయ వర్గాల పెరుగుదల, ఎన్ఆర్ఐల పెట్టుబడుల వలన లగ్జరీ అపార్ట్‌మెంట్స్, గేటెడ్ విల్లాస్ మార్కెట్ ఊపందుకుంది. ఈ ప్రాజెక్టుల్లో అత్యాధునిక సౌకర్యాలు (స్విమ్మింగ్ పూల్, జిమ్, క్లబ్‌హౌస్, గెస్ట్ సూట్స్) అందుబాటులో ఉండటం వాటిని ఆకర్షణీయంగా మార్చుతోంది.
ప్రాంతాల వారీగా విశ్లేషణ: ఎక్కడ ఎంత?
1. కోకాపేట – నియోపొలిస్ – గండిపేట (ORR సమీపంలో)
- వృద్ధి కారణాలు: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు అత్యంత దగ్గరగా ఉండటం, కోకాపేట ఎస్‌ఈజెడ్ (SEZ) ప్రాజెక్టులు, శంషాబాద్ విమానాశ్రయానికి సులభమైన ప్రయాణ మార్గం. ఇక్కడ రోడ్లు చాలా విశాలంగా, ట్రాఫిక్ రహితంగా ఉంటాయి.
- సగటు ధరలు: చదరపు అడుగు ధర (SFT) ₹9,500 – ₹15,000+. లగ్జరీ ప్రాజెక్టుల్లో ఇది ₹18,000 వరకు చేరవచ్చు.
- ఫ్లాట్ల ధరలు:
- 2BHK (1200-1500 SFT): ₹1.15 కోట్లు – ₹1.8 కోట్లు
- 3BHK (1800-2500 SFT): ₹1.7 కోట్లు – ₹3.5 కోట్లు
- ముఖ్య ప్రాజెక్టులు: రాజపుష్ప, అపర్ణ, ఫీనిక్స్ గోల్డ్, మై హోమ్, సత్వా, ఏఎస్‌బీఎల్, ప్రెస్టీజ్, గోద్రెజ్ ప్రాపర్టీస్
- అద్దెలు (సగటు): 2BHK – ₹28,000 – ₹45,000; 3BHK – ₹45,000 – ₹80,000+
- మౌలిక సదుపాయాలు:
- రవాణా: ORR, గచ్చిబౌలి-కోకాపేట ఎలివేటెడ్ కారిడార్.
- విద్యాసంస్థలు: ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ (ISH), కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్.
- ఆసుపత్రులు: సన్‌షైన్ హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్స్ (గచ్చిబౌలి), అపోలో హాస్పిటల్స్ (జూబ్లీ హిల్స్), ఏఐజీ
2. నార్సింగి – పుప్పాలగూడ
- వృద్ధి కారణాలు: ORRకు అత్యంత సమీపంలో ఉండటం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కి దగ్గరగా అద్దెకు దొరికే ఇళ్లకు డిమాండ్ పెరగడం. మధ్యస్థాయి నుండి ఉన్నత స్థాయి ప్రాజెక్టులు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి.
- సగటు ధరలు: SFT ధర ₹7,000 – ₹10,000.
- ఫ్లాట్ల ధరలు:
- 2BHK (1100-1400 SFT): ₹80 లక్షలు – ₹1.2 కోట్లు
- 3BHK (1500-2000 SFT): ₹1.2 కోట్లు – ₹1.8 కోట్లు
- ముఖ్య ప్రాజెక్టులు: మై హోమ్ అవతార్, వన్-సిటీ, వెర్టెక్స్, ఎస్‌ఆర్‌ఎస్ ప్రాజెక్ట్స్
- అద్దెలు (సగటు): 2BHK – ₹20,000 – ₹30,000; 3BHK – ₹25,000 – ₹40,000.
- మౌలిక సదుపాయాలు:
- రవాణా: ORR కనెక్టివిటీ, గచ్చిబౌలికి సులభమైన యాక్సెస్.
- విద్యాసంస్థలు: శ్రీ నిధి ఇంటర్నేషనల్ స్కూల్, డీపీఎస్, గీతాంజలి, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్.
- ఆసుపత్రులు: నార్సింగిలోనే కొత్తగా ఏర్పాటవుతున్న క్లినిక్‌లు, కేర్ హాస్పిటల్స్, కిమ్స్ హాస్పిటల్స్ (గచ్చిబౌలికి దగ్గర).
3. కొంపల్లి – మేడ్చల్ – గుండ్లపోచంపల్లి (నార్త్ హైదరాబాద్)
- వృద్ధి కారణాలు: పొల్యూషన్-ఫ్రీ వాతావరణం, నిజామాబాద్ హైవే, కరీంనగర్ హైవేలకు దగ్గరగా ఉండడం, ORRకి దగ్గరగా ఉండటం. ఐటీ పార్కుఅందుబాటులోకి రానుండడం, బోయిన్‌పల్లి నుంచి మేడ్చల్ ఓఆర్ఆర్ వరకూ ఫ్లైఓవర్లు రావడం వంటి అంశాల కారణంగా డిమాండ్ పెరుగుతోంది.
- సగటు ధరలు: SFT ధర ₹5,000 – ₹7,200.
- ఫ్లాట్ల ధరలు:
- 2BHK (1000-1200 SFT): ₹55 లక్షలు – ₹80 లక్షలు
- 3BHK (1400-1800 SFT): ₹75 లక్షలు – ₹1.2 కోట్లు
- ముఖ్య ప్రాజెక్టులు: అపర్ణ, సుబిషి, మైరాన్
- అద్దెలు (సగటు): 2BHK – ₹12,000 – ₹20,000; 3BHK – ₹18,000 – ₹30,000.
- మౌలిక సదుపాయాలు:
- రవాణా: మంచి రోడ్డు కనెక్టివిటీ, ఎంఎంటీఎస్, ఆల్వాల్, బొల్లారం రైల్వే ష్టేషన్లు
- విద్యాసంస్థలు: సెయింట్ ఆండ్రూస్, సెయింట్ ఆన్స్, పలు ఇంటర్నేషనల్ స్కూల్స్.
- ఆసుపత్రులు: సురక్ష హాస్పిటల్స్, కార్తిక్ హాస్పిటల్స్, రష్ హాస్పిటల్, పారామిత
భవిష్యత్తు అంచనా: లాభాల పరుగు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇంకా తన గరిష్ట స్థాయికి చేరలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే 5-10 సంవత్సరాలలో ధరలు స్థిరంగా, లాభదాయకంగా పెరిగే అవకాశం ఉంది. మెట్రో విస్తరణ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ, ప్రభుత్వ పెట్టుబడులు ఈ వృద్ధికి మరింత దోహదం చేస్తాయి. మీరు సొంత ఇల్లు కొనాలని లేదా ఒక మంచి పెట్టుబడి చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇదే సరైన సమయం.





