Latest

Barc Recruitment 2023: బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) పలు జాబ్స్ భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీచేసింది. టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్, స్టైపెండరీ ట్రైనీ సహా దాదాపు 4,374 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తోంది. బార్క్ రిక్రూట్మెంట్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు బార్క్ అధికారిక వెబ్‌సైట్‌లో సమర్పించాల్సి ఉంటుంది. 

బార్క్ రిక్రూట్మెంట్ 2023: ఎంపిక ప్రక్రియ ఇలా

బార్క్ రిక్రూట్మెంట్ 2023లో అభ్యర్థులు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష తదితర ప్రక్రియలను దాటుకుంటూ రావాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఏప్రిల్ 24, 2023 నుంచి ఆన్‌లైన్‌లొో సమర్పించవచ్చు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 22 మే 2023. 

బార్క్ రిక్రూట్‌మెంట్ 2023: ఖాళీల వివరాలు

పోస్టు పేరుఖాళీలు
టెక్నికల్ ఆఫీసర్181
సైంటిఫిక్ అసిస్టెంట్07
టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్24
స్టైపెండరీ ట్రైనీ క్యాటగిరీ-11216
స్టైపెండరీ ట్రైనీ క్యాటగిరీ-22946
మొత్తం4374

బార్క్ రిక్రూట్మెంట్ 2023 అర్హతలు

[table id=3 /]

బార్క్ రిక్రూట్మెంట్ 2023: దరఖాస్తు ప్రక్రియ ఇలా

బార్క్ రిక్రూట్మెంట్ 2023 దరఖాస్తులను ఆన్‌‌లైన్‌లో సమర్పించాలి. తొలుత బార్క్ అధికారిక వెబ్ సైట్ Bhabha Atomic Research Centre | Barc Online Exam | BARC | barconlineexam.com సందర్శించాలి. సైంటిఫిక్, టెక్నికల్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్ లైన్ దరఖాస్తు ఫారం నింపి, అడిగిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి. ఆన్ లైన్ విధానంలో పరీక్ష రుసుము చెల్లించాలి.


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Trending

Exit mobile version