Home లైఫ్‌స్టైల్ పెట్‌ డాగ్స్‌కూ ఓ బేకరీ.. బర్త్‌ డే స్పెషల్‌ కేక్స్‌ కూడా

పెట్‌ డాగ్స్‌కూ ఓ బేకరీ.. బర్త్‌ డే స్పెషల్‌ కేక్స్‌ కూడా

pet dogs

పెట్‌ డాగ్స్‌ బేకరీలూ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్‌ ఇవ్వచ్చొండోయ్‌.. ఇప్పటివరకు పెట్‌ డాగ్స్, పెట్‌ యానిమల్స్‌ ఫుడ్‌ స్టోర్స్, యాక్సెసరీ స్టోర్స్‌ మార్కెట్లోనూ, ఆన్‌లైన్‌లోనూ చూశాం. ముంబైలో ఓ మహిళ ఔత్సాహిక పారిశ్రామిక వేత్త ఏకంగా పెట్‌ డాగ్స్‌ బేకరీ తెరిచేశారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్లు స్వీకరిస్తారు. డెలివరీ ఇస్తారు.

బార్కర్స్‌ డజన్‌ .. బర్త్‌ డే కేక్స్‌ స్పెషల్‌

చాలా మంది సెలబ్రిటీస్‌కు పెట్‌ డాగ్స్, పెట్‌ క్యాట్స్‌ అంటే వల్లమాలిన ప్రేమ. ఇన్‌స్టాగ్రామ్‌లో సెలబ్రిటీస్‌ తాము షేర్‌ చేసుకునే ఫోటోల్లో వారి పెంపుడు జంతువులతో ప్రేమను వ్యక్తపరుస్తూ ఉండే ఫోటోలే ఎక్కువగా ఉంటాయి. సెలబ్రిటీస్‌ మాత్రమే కాదు.. చాలా మంది పెంపుడు జంతువుల ప్రేమికులు వారి వారి పెట్‌ డాగ్స్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ కూడా చేస్తుంటారు. మరి వాటి కోసం ప్రత్యేకంగా కేక్స్‌ కూడా తయారు చేస్తోంది. ఈ బార్కర్స్‌ డజన్‌ ఆన్‌లైన్‌ పెట్‌ డాగ్స్‌ బేకరీ.

ఈ ఆన్‌లైన్‌ బేకరీ జెర్కీస్, చ్యూస్, బిస్కట్స్‌ కేటగిరీలో రకరకాల ఆహార పదార్థాలు అందుబాటులోకి తెచ్చింది. జెర్కీస్‌ అంటే మాంసం వరుగులు. అంటే ఎండబెట్టిన మాంసం. ఇందులో లివర్‌ జెర్కీ, చికెన్‌ జెర్కీ, స్మోక్‌డ్‌ చికెన్‌ స్ట్రిప్స్‌ లాంటివి ఉంటాయి. అలాగే చ్యూస్‌ (చిన్న ఎముకలతో కూడిన నాన్‌ వెజ్‌ పీసెస్‌) కేటగిరీలో కోడి కాళ్ల పంజాలు, చికెన్‌ వింగ్స్, క్వాయిల్‌ హెడ్స్‌ వంటివి ఉన్నాయి. అలాగే రకరకాల బిస్కెట్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

బర్త్‌ డే స్పెషల్‌ కేక్స్‌ కూడా బార్కర్స్‌ డజన్‌ అందిస్తోంది. ప్రస్తుతానికైతే ముంబైలో మాత్రమే డెలివరీ ఉంది. 2017లో ప్రారంభమైన ఈ సంస్థలో అందరూ మహిళలే కావడమే మరో విశేషం. పెట్‌ డాగ్స్‌ కోసం హ్యూమన్‌ గ్రేడ్‌ ఫుడ్‌ అందించడమే ఈ సంస్థ స్పెషాలిటీ.

మీకూ ఇలాంటి ఆలోచన వస్తే ఓ ఆన్ లైన్ స్టోర్ ప్రారంభించేయండి మరి మీ సిటీలో.

Exit mobile version