Home న్యూస్ మాస్క్‌ లేదని 441 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మాస్క్‌ లేదని 441 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

mask
Photo by Polina Tankilevitch from Pexels

ముఖానికి మాస్క్‌ ధరించలేదని, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం లేదని మణిపూర్‌ రాష్ట్రంలో అక్కడి పోలీసులు 441 మందిని అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం లేదని నిర్బంధించారు. సుమారు 467 వాహనాలను కూడా సీజ్‌ చేశారు.

వీరందరినీ బుధవారం కోర్టుల్లో ప్రవేశపెట్టగా మొత్తంగా రూ. 71,300 జరిమానా చెల్లించారని అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎల్‌.కైలున్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు తలలుపట్టుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,86,579 కేసులు నమోదయ్యాయి. 8,102 మంది మృతి చెందారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,37,448 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 1,41,029 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 9,996 కేసులు నమోదయ్యాయి. 357 మంది మృతి చెందారు.

దేశంలో కరోనా రికవరీ రేటు 52 శాతానికి చేరింది. ఇప్పటివరకు 52,13,140 కరోనా టెస్టులు చేశారు. గడిచిన 24 గంటల్లోనే 1,51,808 టెస్టులు నిర్వహించారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 94,041 కేసులు నమోదవగా.. 3,438 మంది మృతిచెందారు. అక్కడ ఆసుపత్రుల్లో బెడ్లు దొరకక పేషెంట్లు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

ఎమర్జెన్సీ వార్డుల్లో సైతం పేషెంట్లు కిక్కిరిసి కనిపిస్తున్నారు. తమిళనాడులో ఇప్పటివరకు 36,841 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 326 మంది మృతి చెందారు.

ఢిల్లీలో ఇప్పటికే 32,810 కేసులు నమోదవగా.. 984 మంది మృతి చెందారు. ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్‌ అమలు చేసే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడి ఆసుపత్రుల్లో కేవలం ఢిల్లీ వాసులకే చికిత్స అందిస్తామని కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రకటించగా.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దానిని వ్యతిరేకించారు. చివరకు కేజ్రీవాల్‌ కూడా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నిర్ణయాన్ని అంగీకరించారు.

గుజరాత్‌ లో ఇప్పటివరకు 21,521 కేసులు నమోదుకాగా.. 1,347 మంది మృతిచెందారు. ఇక్కడ కూడా మరణాలు రేటు ఎక్కువగా ఉంది.

దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాలు వరుసగా ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలో 94,041, తమిళనాడులో 36,841, ఢిల్లీలో 32,810, గుజరాత్ లో 21,521 కేసులు, యూపీలో 11,610, రాజస్తాన్ లో 11,600, మధ్యప్రదేశ్ లో 10,049 కేసులు నమోదయ్యాయి.

అత్యధిక మరణాలు మహారాష్ట్రలో 3,438, గుజరాత్ లో 1,347, ఢిల్లీలో 984 మరణాలు సంభవించాయి.

Exit mobile version