Home లైఫ్‌స్టైల్ Dry Hair Remedies: పొడి జుట్టుకు 5 పరిష్కార మార్గాలు.. ఇలా చేస్తే మీ జుట్టు...

Dry Hair Remedies: పొడి జుట్టుకు 5 పరిష్కార మార్గాలు.. ఇలా చేస్తే మీ జుట్టు సిల్కీ అవుతుంది

dry hair
పొడి జుట్టుకు పరిష్కార మార్గాలు (pixabay)

Dry Hair Remedies: పొడి జుట్టుతో ఒకటా రెండా ఎన్నో సమస్యలుంటాయి. జుట్టు చిట్లిపోవడం దగ్గర్నుంచి.. జుట్టు రాలిపోవడం పొడిజుట్టులో భాగమే. అయితే పొడిజుట్టు సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పొడిజుట్టే మీకు సమస్యగా మారిందా? దానివల్ల మీ జుట్టు చిట్లి విరిగిపోతుందా? మీ మాట వినకుండా మీ అందానికి భంగం కలిగిస్తుందా? అయితే మీరు దానికి సరైన పోషణ అందిచాల్సిన సమయం ఆసన్నమైంది. పొడి జుట్టు శారీరక తత్వం వల్ల రావొచ్చు. లేదా కాలుష్యం వల్ల కూడా మీ జుట్టు పొడిబారిపోతూ ఉండొచ్చు. అయితే కొన్ని పద్ధతుల ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. కేవలం వీటితోనే పొడి జుట్టు దూరం చేసుకోవచ్చా అంటే పొరపాటే. మనం తీసుకునే ఆహారం, హైడ్రేట్గా ఉండడం కూడా చేయాలి. ఇంతకీ పొడి జుట్టును దూరం చేసే పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కూడా వాటిని ఫాలో అయ్యి మెరిసే, మెత్తని, చిక్కులు లేని జుట్టును పొందండి.

హెయిర్ మాస్క్

హెయిర్ మాస్క్‌లు మీ జుట్టుకు ఇంటెన్సివ్ కండిషనింగ్ ట్రీట్‌మెంట్ని అందిస్తాయి. అందుకే పొడి జుట్టు ఉన్నవారు హెయిర్ మాస్క్లకు తగిన ప్రాధన్యతనివ్వాలి. ఇంట్లో తయారు చేసుకునే మాస్కులు మీకు సెట్ అవ్వకపోతే కొన్ని ప్రొఫెషనల్ హెయిర్ మాస్క్లు ట్రై చేయవచ్చు. ఇది మీ జుట్టుకు హైడ్రేషన్ అందిస్తుంది. అంతేకాకుండా జుట్టును సున్నితంగా, మెరిసేలా చేస్తుంది. ఏ మాస్కుకైనా 15-30 నిమిషాల కచ్చితంగా ఉంచుకుని.. ఆ త్వరాత క్లీన్ చేయండి. అలా ఉంచినప్పుడే ఆ ప్రొడెక్ట్ మీ జుట్టులోకి వెళ్లి హైడ్రేషన్ అందిస్తుంది. 

షాంపూ

పొడి జుట్టు సమస్య ఉన్నవారు సరైన షాంపూని ఎంచుకోవడం చాలా ముఖ్యం. అల్ట్రా స్మూతింగ్ షాంపూలు డ్రై హెయిర్ ఉన్నవారికి మెరుగైన ఎంపిక. ముఖ్యంగా పారాబెన్‌లు లేని ఈ షాంపూలు మీ జుట్టును పొడిబారడం నుంచి రక్షిస్తాయి. అంతేకాకుండా తేమను లాక్ చేసి.. జుట్టును సున్నితంగా మారుస్తాయి. తద్వారా మీ జుట్టు సిల్కీగా, షైనీగా మారుతుంది. కాబట్టి క్రమం తప్పకుండా హైడ్రేటింగ్ షాంపూని వినియోగించండి.

కండీషనర్

కండీషనర్ అనేది జుట్టుకు మీరు కచ్చితంగా ఇవ్వాల్సిన ఓ ప్రొడెక్ట్. చాలామంది ఈ ప్రక్రియను స్కిప్ చేసేస్తారు కానీ.. పొడి జుట్టు ఉన్నవారు కచ్చితంగా చేయాల్సిన చర్య ఇది. ఎందుకంటే మీ డ్రై హెయిర్కి ఇది ఓ గేమ్ ఛేంజర్ అనే చెప్పవచ్చు. న్యూటి ఎన్రిచ్ హెయిర్ కండీషనర్స్ మీ జుట్టు ఎక్కువ సేపు హైడ్రేటెడ్గా ఉండేలా చేస్తాయి. కాబట్టి తడిజుట్టుపై కండీషన్ ఉంచి 10 నిముషాల లోపు వాష్ చేసేయండి. చల్లని నీటితో శుభ్రం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. 

సీరం

హెయిర్ సీరమ్‌లు మీ జుట్టుకు తక్షణమే హైడ్రేషన్ అందిస్తాయి. అంతేకాకుండా మెరుపును అందిస్తాయి. వాటిని తడిగా లేదా పొడిగా ఉన్న జుట్టుకు అప్లై చేయవచ్చు. ఇది చిక్కులను తగ్గించి.. జుట్టు స్మూత్గా ఉండేలా చేస్తుంది. సిల్కీ స్మూత్ ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ కావాలనుకునేవారు కచ్చితంగా సీరం వినియోగించాలి. ఇది మీ జుట్టు చిట్లిపోయే ప్రమాదం నుంచి రక్షిస్తుంది. 

నూనె

జుట్టుకు పోషణ అందించడంలో నూనె పాత్ర చాలా ముఖ్యమైనది. జుట్టు పెరగాలన్నా.. దానికి సరైన పోషణ అందాలన్నా.. డ్రై హెయిర్ నుంచి విడుదల కావాలనుకున్న మీరు కచ్చితంగా నూనెను వినియోగించాలి. ఇది మీ జుట్టులోపలికి వెళ్లి.. లోపలి నుంచి జుట్టుకి కండిషనింగ్ అందిస్తుంది. ఇది మిమ్మల్ని డ్రై స్కాల్ప్ నుంచి మిమ్మల్ని దూరం చేస్తుంది. వారంలో కచ్చితంగా రెండుసార్లు ఆయిల్ అప్లై చేసి.. మసాజ్ చేస్తూ ఉంటే హెయిర్కి మంచి పోషణ అందుతుంది. కాబట్టి పొడిబారిన జుట్టుతో పోరాడటం మానేసి ఈ స్టెప్స్ ఫాలో అయిపోయి.. డ్రై హెయిర్కి బాయ్ చెప్పేసేయండి.

Exit mobile version