Home ట్రావెల్ 25వ తేదీ నుంచి విమాన సర్వీసులు

25వ తేదీ నుంచి విమాన సర్వీసులు

air-travel

మే 25 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం ఈమేరకు ఒక ప్రకటన చేశారు. ఇప్పటివరకు రైళ్లు, బస్సులు పాక్షికంగా నడుస్తుండగా.. ఇక విమాన సర్వీసులు కూడా ప్రారంభం కానుండడంతో దేశంలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నట్టు కానుంది.

’మే 25 సోమవారం నుంచి దేశంలో ఓ క్రమ పద్ధతిలో ఫ్లైట్ సర్వీసులు నడవనున్నాయి. అన్ని ఎయిర్ పోర్టులు, ఎయిర్ లైన్స్ సంస్థలకు ఈమేరకు సమాచారం ఇచ్చాం. ప్రయాణికుల రవాణాకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొటోకాల్ జారీచేయనున్నాం..‘ అని హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఇకపై ప్రయాణికులకు వెబ్ చెక్ ఇన్ తప్పనిసరి కానుంది. బోర్డింగ్ కార్డు ప్రింటవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బోర్డింగ్ కార్డుపై సీఐఎస్ఎఫ్ స్టాంపింగ్ ఉండదు. ఇక ఎయిర్ పోర్టుకు మూడు గంటలకు ముందే చేరుకోవాలి.

రాబోయే ఆరు నెలల పాటు ఈ నియమావళి వర్తించనున్నట్టు తెలుస్తోంది. పౌర విమానయాన శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Exit mobile version