సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్ 7 ఎఫ్‌ఈ, గెలాక్సీ టాబ్ ఎ 7 ను ఇండియాలో విడుదల చేసింది. ఈ రెండు డివైజెస్ శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ పోర్ట్‌ఫోలియోకు తోడయ్యాయి.
గెలాక్సీ టాప్ ఎస్ 7 ప్లస్‌లో ఆకట్టుకున్న ఎస్–పెన్ సహా అనేక ఫీచర్లు కొత్త టాబ్ ఎస్ 7 ఎఫ్‌ఈలో ఉన్నాయి. వర్క్, స్టడీస్, ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్ అవసరాలను తీర్చడమే కాకుండా, ఆకట్టుకునే డిజైన్‌తో శామ్‌సంగ్ ఎస్ 7 ఎఫ్‌ఈ అందుబాటులోకి వచ్చింది.
‘రిమోట్ వర్కింగ్, వర్చువల్ లెర్నింగ్ కొత్త అలవాటుగా మారడంతో సామ్‌సంగ్ టాబ్ ఎస్ 7 ఎఫ్‌ఇ – టాబ్ ఎ 7 లైట్ అనే రెండు కొత్త లాండ్‌మార్క్ టాబ్లెట్లను అభివృద్ధి చేయడానికి సృజనాత్మకంగా, సాంకేతికంగా ముందుకు వచ్చాము. ఈ ఉత్తేజకరమైన కొత్త ట్యాబ్‌లు మీకు మరింత ఉత్పాదకతతో, మరింత సృజనాత్మకమైనవిగా, బహుళ పనులు చేసేందుకు సహాయపడతాయి..’అని సామ్‌సంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ డైరెక్టర్ మాధుర్ చతుర్వేది చెబుతున్నారు.
గెలాక్సీ టాబ్ ఎస్ 7 ఎఫ్‌ఈ
గెలాక్సీ టాబ్ ఎస్ 7 ఎఫ్‌ఈలో పెద్ద 12.4–అంగుళాల డిస్‌ప్లే, 16:10 కారక నిష్పత్తి పిక్చర్‌కు సపోర్ట్ చేస్తుంది. స్పష్టమైన పిక్చర్, ట్రూ లైఫ్ విజువల్స్ కోసం 244 పిక్సెల్స్ (పిపిఐ) రిజల్యూషన్ కలిగి ఉంది.
ఏకేజీ స్పీకర్ల ద్వారా డాల్బీ అట్మోస్ సౌండ్ క్వాలిటీతో కలిసి, ఈ డివైజ్ మీకు ఇష్టమైన కంటెంట్‌ను చూసేటప్పుడు లీనమయ్యేలా సినిమా అనుభవాన్ని అందిస్తుంది.
10090 ఎంఏహెచ్ సామర్థ్యంతో గెలాక్సీ టాబ్ 7 ఎఫ్‌ఈ మెగా బ్యాటరీతో వస్తుంది. తద్వారా మీరు వర్క్ అవర్స్ పూర్తయినా సరే లేదా ఆన్ లైన్ క్లాసులు పూర్తయినా సరే.. తర్వాత కూడా మీకు ఇష్టమైన కంటెంట్ చూస్తూ ఉంటారు.
గెలాక్సీ టాబ్ ఎస్ 7 ఎఫ్‌ఇ 45 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 90 నిమిషాల్లో భారీ బ్యాటరీని రీఛార్జ్ చేస్తుంది. అయితే టాబ్ 7 ఎఫ్‌ఈ 15వాట్ ఛార్జర్ ఇన్‌బాక్స్‌తో వస్తుంది, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్‌ను శామ్‌సంగ్.కామ్‌లో లేదా రిటైల్ అవుట్‌లెట్లలో విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
గెలాక్సీ టాబ్ ఎస్ 7 ఎఫ్‌ఈ శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750 జి ప్రాసెసర్‌తో వస్తుంది, ఇది మెరుగైన పనితీరును అందించడంలో సహాయపడుతుంది. మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని సులభతరం చేస్తుంది.
గెలాక్సీ టాబ్ 7 ఎఫ్‌ఈ స్పోర్ట్స్ 8 ఎంపీ రేర్ కెమెరా మరియు 5ఎంపీ ఫ్రంట్ ల్యాండ్‌స్కేప్ మోడ్ కెమెరా వీడియో కాల్ కోసం ఆప్టిమైజ్ చేశారు.
క్రియేటివ్ అన్‌లాక్
గెలాక్సీ టాబ్ 7 ఎఫ్‌ఈ బాక్స్ ఎస్ పెన్‌తో వస్తుంది. ఇది వర్క్, స్టడీస్, గేమింగ్ మధ్య సజావుగా మారడానికి సహాయపడే ‘మేజిక్ మంత్రదండం’. దీనికి ఛార్జ్ చేయవలసిన అవసరం లేదు. నిజమైన పెన్ పేపర్ అనుభవాన్ని ఇస్తుంది. 30ఎంఎస్ కంటే తక్కువ లేటెన్సీ కలిగి ఉంటుంది.
మీలోని కళాకారుడిని నిద్రలేపడానికి క్లిప్ స్టూడియో, కాన్వా వంటి అనేక ప్రీమియం సాఫ్ట్‌వేర్ సభ్యత్వాలు ఈ డివైజ్‌లో తీసుకోవచ్చు.
సామ్‌సంగ్ నోట్స్‌తో మీరు మీ స్క్రీన్‌పై చేతితో రాసిన రాతలను సులభంగా టెక్ట్స్‌గా మార్చొచ్చు. మీ నోట్స్‌ను ఆటోమేటిక్ ట్యాగ్‌లతో క్రమబద్ధీకరించవచ్చు. మీకు అవసరమైన కచ్చితమైన నోట్స్‌ను తక్షణం కనుగొనడానికి ఇంటెలిజెంట్ సెర్చ్‌ను ఉపయోగించవచ్చు.
పర్సనల్ కంప్యూటర్ సామర్థ్యంతో
సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్ 7 ఎఫ్‌ఈ పర్సనల్ కంప్యూటర్‌లాæ శక్తివంతమైనది. శామ్‌సంగ్ డెక్స్, బుక్ కవర్ కీబోర్డ్‌తో, మీరు మీ టాబ్లెట్‌ను ల్యాప్‌టాప్ లాగా ఉపయోగించవచ్చు,
మల్టీ–యాక్టివ్ విండోతో, మీరు ఒకేసారి మూడు యాప్‌లను తెరవవచ్చు. అంటే మీరు వెబ్‌ను బ్రౌజ్ చేయవచ్చు, నోట్స్ తీసుకోవచ్చు, వీడియోను ఒకే స్క్రీన్‌లో ప్రసారం చేయవచ్చు.
గెలాక్సీ టాబ్ ఎస్7 ఎఫ్‌ఈ ధర, లభ్యత
గెలాక్సీ టాబ్ ఎస్7 ఎఫ్‌ఈ «నాలుగు రంగుల్లో లభిస్తుంది. మిస్టిక్ బ్లాక్, మిస్టిక్ సిల్వర్, మిస్టిక్ గ్రీన్, మిస్టిక్ పింక్ రంగుల్లో లభిస్తుంది. గెలాక్సీ టాబ్ ఎస్ 7 ఎఫ్‌ఈ ధర 4 జీబీ + 64 జీబీ వేరియంట్‌కు 46,999 రూపాయలు. 6 జీబీ + 128 జీబీ వేరియంట్‌కు రూ .50,999.
గెలాక్సీ టాబ్ ఎస్ 7 ఎఫ్‌ఈతో సామ్‌సంగ్ ఇంట్రడక్షన్ ఆఫర్లను కూడా ఇస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 4000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కీబోర్డ్ కవర్‌లో రూ. 10000 రూపాయల తగ్గింపు లభిస్తుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎ 7 లైట్
గెలాక్సీ టాబ్ ఎ 7 లైట్ యువ వినియోగదారుల వినోద అవసరాలను తీర్చడానికి రూపొందించింది. కాంపాక్ట్, ఆన్–ది–గో టాబ్లెట్ కోసం చూస్తున్నవారికి, గెలాక్సీ టాబ్ ఎ 7 లైట్ సరైన ఎంపిక.
8.7 అంగుళాల స్క్రీన్‌తో సొగసైన, మన్నికైన మెటల్ కవర్‌లో, కాంపాక్ట్ గెలాక్సీ టాబ్ ఎ7 లైట్ అల్ట్రా–పోర్టబుల్. ఇది పట్టుకోవడానికి తేలికగా ఉంటుంది, 8 మిమీ మందంతో ఉంటుంది. స్పోర్ట్స్ 8 ఎంపీ వెనుక కెమెరా, మరియు 2 ఎంపీ ముందు కెమెరా కలిగి ఉంటుంది.
ఎంటర్‌టైన్‌మెంట్.. ఎంటర్‌టైన్‌మెంట్
గెలాక్సీ టాబ్ ఎ 7 లైట్ డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్‌తో చక్కటి మూవీ అనుభూతిని ఇస్తుంది. శక్తివంతమైన డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది.
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో పాటు 1 టీబీ వరకు విస్తరించగలిగిన స్టోరేజీ సామర్థ్యం అందుబాటులో ఉంటుంది. 1.8 జీహెచ్‌జడ్ ఆక్టా–కోర్ మీడియాటెక్ హెలియో పీ22టీ (ఎంటీ8768టీ) ప్రాసెసర్ సున్నితమైన, వేగవంతమైన గేమింగ్ పనితీరును అందిస్తుంది. 5100 ఎంఏహెచ్ సామర్థ్యంతో 15 వాట్ అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.
పిల్లలను నియంత్రించవచ్చు..
గెలాక్సీ టాబ్ ఎ7 లైట్ డిఫెన్స్–గ్రేడ్ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్ నాక్స్ ద్వారా రక్షణ కలిగి ఉంటుంది. డేటా, లావాదేవీలన్నింటినీ సురక్షితంగా ఉంచుతుంది. సామ్‌సంగ్ కిడ్స్ ఆప్షన్ సహాయంతో పిల్లల రోజువారీ స్క్రీనింగ్ టైమ్‌ను నియంత్రించవచ్చు. కొన్ని యాప్స్‌కు మాత్రమే యాక్సెస్ ఇవ్వొచ్చు.
ధర, లభ్యత
గెలాక్సీ టాబ్ ఎ 7 లైట్ గ్రే మరియు సిల్వర్ యొక్క రెండు స్టైలిష్ రంగులలో లభిస్తుంది.
గెలాక్సీ టాబ్ ఎ 7 లైట్ 3 జీబీ + 32 జీబీలో లభిస్తుంది. ఎల్‌టిఈ మోడల్ ధర రూ.14,999 వైఫై మోడల్ ధర రూ. 11999.
గెలాక్సీ టాబ్ ఎ 7 లైట్ 6 నెలల వరకు ఖర్చులేని ఈఎంఐ ద్వారా పొందవచ్చు, అంటే మీరు ఇప్పుడు గెలాక్సీ టాబ్ ఎ7 లైట్‌ను నెలకు రూ. 2,499 చెల్లించి కొనుగోలు చేయవచ్చు.
గెలాక్సీ టాబ్ ఎస్ 7 ఎఫ్‌ఈ, గెలాక్సీ టాబ్ ఎ 7 లైట్ డివైజ్‌లను సామ్‌సంగ్.కామ్, సామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌లో, ప్రముఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ భాగస్వాముల వద్ద జూన్ 23 నుంచి కొనుగోలు చేయవచ్చు.