Home పేరెంటింగ్ మేథావులుగా పుడతారా? తయారవుతారా?

మేథావులుగా పుడతారా? తయారవుతారా?

genius gym
mega icons series

హాట్ స్టార్ లోని మెగా ఐకాన్స్ సిరీస్ 2018లోనే విడుదలైందట. కానీ ఇన్నాళ్లూ నా కంట పడలేదు, కంటపడలేదనడం కంటే నేనే పట్టించుకోలేదనుకుంటా. నిన్నేదో బ్రౌజ్ చేస్తుంటే తగిలింది, సరే ఏముందో చూద్దామంటూ మొదలుపెట్టా.

ఆశ్చర్యం… నా సబ్జెక్ట్, నాకెంతో ఇష్టమైన సబ్జెక్ట్.. జీనియస్! జీనియస్ లు పుడతారా? తయారవుతారా? అనే అంశంపై రెండు సీజన్లు, 10 ఎపిసోడ్లు ప్రముఖ నటుడు మాధవన్ నెరేషన్ తో సాగాయి. ఈ నేచర్ వర్సెస్ నర్చర్ అనే కాంట్రావర్సీ సైకాలజీలో మొదట్నుంచీ ఉన్నదే. ఇప్పుడు దాని చుట్టూనే ఈ ఎపిసోడ్లు చిత్రీకరించారు.

మీ చుట్టూ ఉన్న పిల్లల్లో ఎంతమంది మేధావులున్నారో మీరెప్పుడైనా ఊహించారా? అనే ప్రశ్నతో తొలి ఎపిసోడ్ మొదలవుతుంది. అందరిలో ఒకే మెదడు ఉంది, మరెందుకిన్ని తేడాలు? అంటూ చర్చ మొదలుపెడతాడు మాధవన్.

అత్యంత వేగంగా 7000 పరుగులు సాధించిన క్రికెట్ కెప్టెన్. ఛేజింగ్ మ్యాచ్ లలో అత్యంత ఎక్కువ వన్ డే సెంచరీలు చేసిన క్రికెటర్. టెస్ట్, వన్డే, ట్వంటీ ట్వంటీ లో 50 సగటు ఉన్న ఏకైక క్రికెటర్. 2.50 కోట్ల ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ ఉన్న సోషల్ మీడియా సెలబ్రిటీ. మొండితనం, ఆవేశం, దూకుడు.. కలగలిసిన భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీపై తొలి ఎపిసోడ్.

 
మూలాలు బాల్యంలోనే
 
విరాట్ క్రికెట్ జీనియస్ గా పుట్టాడా? తయారయ్యాడా? అనే ప్రశ్నకు… “ఏ జీనియస్ కూడా తొలిసారే జీనియస్ గా కనిపించడు. కాలక్రమంలో పలు సంఘటనలు అతన్ని జీనియస్ గా నిరూపిస్తాయి. జీనియస్ లు ఇలాగే తయారవుతారు” అని చెప్తాడు డాక్టర్ సంతోష్ కె. చతుర్వేది అనే బిహేవియరల్ సైంటిస్ట్.
 
ఏ జీనియస్ కైనా మూలాలు బాల్యంలో ఉంటాయి. విరాట్ మూడేళ్ల వయసులో తండ్రి వేసిన ప్లాస్టిక్ బంతిని కొట్టేందుకు ఆసక్తి చూపాడు. కొడుకు ఆసక్తిని తండ్రి గుర్తించి ప్రోత్సహించాడు. అలా ప్రతీ జీనియస్ జీవితంలోనూ ఎవరో ఒక వ్యక్తి అలాంటి పాత్ర పోషిస్తారు. పిల్లలు తమకేం కావాలో ఎంపిక చేసుకోకముందే పెద్దలే ఎంపిక చేసి వారికి అందిస్తారు. ఆ అందించే అంశం పిల్లలకు నచ్చినదైతే వాళ్లు అందులో రాణిస్తారు, నచ్చనిదైతే దానిపై మనసు నిలపలేక మామూలు వ్యక్తులుగా మిగిలిపోతారు. అందుకే పిల్లల ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించడం మొదట తల్లిదండ్రులు, ఆ తర్వాత టీచర్ల బాధ్యతంటాను. ఎందుకంటే…
 
“తొలిరోజుల్లో ప్రోత్సాహం పిల్లవాడి మెదడులో ఒక అభ్యసన రూపంగా మారుతుంది. అప్పటినుంచి అతను బంతి కొట్టిన ప్రతిసారీ అది మెదడులో డోపమైన్ అనే హార్మోన్ ఎక్కువగా స్రవిస్తుంది. అది ఆనందానికి కారకమైన హార్మోన్. దాంతో చేసే పనిలో ఆనందం లభిస్తుంది, ఇంట్రస్ట్ పెరుగుతుంది. దాంతో ఆ పనిని మళ్లీ మళ్లీ చేస్తాడు. చివరకు దానిలో మాస్టర్ అవుతాడు” బ్రెయిన్ బిహేవియర్ అనలిస్ట్ డాక్టర్ అలోక్ మిశ్రా. సక్సెస్ లో, జీనియస్ కావడంలో హ్యాపీనెస్ పాత్ర తెలుసుకాబట్టే జీనియస్ జిమ్ లో హ్యాపీనెస్ పై ఓ మాడ్యూల్ ఉంది. అలాగే పిల్లల విజయంలో తల్లిదండ్రుల ప్రభావం తెలుసు కనుకే జీనియస్ జిమ్ లో చేరే పిల్లల తల్లిదండ్రులకు “జీనియస్ పేరెంటింగ్ కోచింగ్” తప్పనిసరి చేశాం.
 
బెస్ట్ టీచర్స్
 
టీవీ, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ పిల్లలను పాడు చేస్తున్నాయని చాలామంది తల్లిదండ్రులు ఆరోపిస్తుంటారు. కానీ 30 ఏళ్లుగా సైకాలజీ విద్యార్థిగా, 20 ఏళ్లుగా సైకాలజిస్టుగా ఉన్న అనుభవంతో నేను చెప్పేదేంటంటే.. టీవీ, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ పిల్లలను నాశనం చేయవు. వాటినెలా ఉపయోగించాలో నేర్పించకపోతే నష్టపోతారు.
 
వాటినెలా ఉపయోగించాలో, ఎందుకు ఉపయోగించాలో నేర్పిస్తే అవి గొప్ప టీచర్లుగా ఉపయోగపడతాయి. ఇదే మాట మెగా ఐకాన్స్ లో కూడా చెప్తారు. బాల్యంలో కొహ్లీకి లభించిన గొప్ప టీచర్లలో టీవీ కూడా ఒకటంటారు.
 
విరాట్ బాల్యంలో తండ్రీ కొడుకులు కలిసి గొప్ప గొప్ప క్రికెటర్ల ఆటను చూసేవారు. అలా గొప్ప గొప్ప క్రికెటర్ల ఆటను ఇమిటేట్ చేస్తూ విరాట్ నేర్చుకున్నాడు. 1998 ఏప్రిల్ లో సచిన్ షార్జాలో సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. దాన్ని టీవీలో చూసిన కొహ్లీపై చెరగని ముద్ర వేసింది. “సచిన్ అంటే నాకు ఒక భావోద్వేగం. షార్జాలో సచిన్ ఇన్నింగ్స్ క్రికెట్ పట్ల నా దృక్పధాన్ని పూర్తిగా మార్చివేసేసింది” అంటాడు కొహ్లీ.
 
నిజానికి మనమందరం కూడా చిన్నప్పటినుంచీ అనుకరిస్తూనే నేర్చుకుంటాం. అది మాటలు, హావభావాలకే పరిమితమైతే దాన్ని మిమిక్రీ, ఇమిటేషన్ అంటాం. వారి ఆలోచన, ఆచరణను అనుకరిస్తే, అనుసరిస్తే దాన్ని”మోడలింగ్” అంటారు. ఇదెలా జరుగుతుందంటే…”మెదడులో మిర్రర్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి. అవి ఎదుటివారి నైపుణ్యాలను ఒడిసి పట్టుకుంటూ ఉంటాయి. ఒక ఎదిగే పిల్లవాడు టీవీలో గొప్ప మాస్టర్ ప్లే చూసినప్పుడు ఆ నైపుణ్యాలను కూడా నేర్చుకుంటాడు. ఒక్కోసారి ఆ మాస్టర్స్ కంటే ఎక్కువే నేర్చుకుంటారు” అని చెప్తారు ఎవల్యూషనరీ అండ్ డెవలప్మెంటల్ బయాలజిస్ట్ -ఎల్ ఎస్ శశిధర.
 
ఇమాజినేషన్ ఈజ్ ఇంపార్టెంట్
 
విరాట్ లక్ష్యం ఒక్కటే క్రికెట్ లో అగ్రస్థానం. ఆ స్థానాన్ని నిరంతరం విజువలైజ్ చేసేవాడు. అంతటితో ఆగకుండా సంవత్సరాల తరబడి రోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి స్టేడియంకు వెళ్లేవాడు. ఎప్పుడూ సీనియర్లతోనే క్రికెట్ ఆడేవాడు. చిన్న పిల్లలను ఔట్ చేస్తే కిక్కేముంటుంది అనేవాడు. “ఇండియా ఓడినప్పుడల్లా, నేను ఆ మ్యాచ్ లో ఉంటే ఆ మ్యాచ్ గెలిచేవాడ్ని కదా అనిపించేది” అంటాడు కొహ్లీ. అంటే చిన్నప్పటినుంచే తనను తాను ఇండియన్ క్రికెట్ టీమ్ సభ్యుడిగా విజువలైజేషన్ చేసుకుంటున్నాడన్నమాట.
 
“Imagination is important than knowledge. Because, knowledge has limitations, but imaginations can encircle the universe” అంటాడు ప్రఖ్యాత జీనియస్ ఆల్బర్ట్ ఐన్ స్టీన్. కానీ ఆ ఇమాజినేషన్ కు, విజువలైజేషన్ కు చోటేలేదు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. ఇలాంటి క్రియేటివ్ టెక్నిక్స్ అన్నీ జీనియస్ జిమ్ లో నేర్పిస్తాం.
 
కోచింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్
 
ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా దాన్ని సరైన దారిలో పెట్టే కోచ్ ఒకరు కావాలి. ఈ సంగతి విరాట్ తండ్రి ప్రేమ్ కొహ్లీ గుర్తించారు. 1998 మే 13న తొమ్మిదో ఏట ఢిల్లీలో రాజ్ కుమార్ శర్మ క్రికెట్ కోచింగ్ అకాడమీలో చేర్పించాడు. ఫస్ట్ మ్యాచ్ లో విరాట్ బ్యాటింగ్ చేయలేదు, అలాగని బౌలింగూ చేయలేదు. మరేం చేశాడంటారా? ఫీల్డింగ్. బౌండరీ లైన్ నుంచి నేరుగా వికెట్లను కొట్టేశాడు. అతని ఫీల్డింగ్ సామర్థ్యం చూసి కోచ్ ఆశ్చర్యపోయాడు. విరాట్ లోని టాలెంట్ కు పదును పెట్టాడు.
 
విరాట్ 2006లో కర్ణాటకతో జరిగిన రంజీ మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే అతని తండ్రి చనిపోయాడు. తెల్లవారు జామున మూడు గంటలకు విరాట్ చేతుల్లోనే. ముందురోజు 40 నాటౌట్ గా ఉన్నాడు కనుక మర్నాడు అతనే మ్యాచ్ ప్రారంభించాలి. కానీ తండ్రి చనిపోయాడు. ఏం చేయాలి? కోచ్ కు ఫోన్ చేశాడు. “నీ కష్టం నాకు తెలుసు. నీ తండ్రి స్థానంలో చెప్తున్నాను.. నీకో అవకాశం వచ్చింది, వెళ్లి ఆడటమే మంచిది. అయితే తుది నిర్ణయం నీదే” అని చెప్పాడు.
 
మ్యాచ్ లో ఔటయ్యాక విరాట్ కోచ్ కు ఫోన్ చేసి ఏడ్చాడు. “ఏడవకు, నీకు నేనున్నాను, తండ్రిలా నేను చూసుకుంటాను” అని కోచ్ ఓదార్చాడు. అప్పుడు విరాట్ “కోచ్ సర్, అంపైర్ నన్ను తప్పుగా ఔట్ చేశాడు. బాల్ నా బ్యాట్ కు తగిలాకే ప్యాడ్ కు తగిలింది. అయినా అంపైర్ ఔట్ ఇచ్చాడు” అని చెప్పాడు. అంతగా ప్రేమించాడతడు క్రికెట్ ను. తండ్రి మరణ దు:ఖాన్ని కూడా దిగమింగేంతగా ప్రేమించాడు.
 
అలా చేయడం అబ్ నార్మల్, ఇన్సెన్సిటివ్ అని కొందరికి అనిపించవచ్చు. కానీ “తల్లి లేదా తండ్రి చనిపోయినప్పుడు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. పూర్తి నిరాశ ఆవహిస్తుంది. దానికి విరుగుడుగా అధిక వ్యాయామం చేయమంటారు. తద్వారా కార్టిసాల్ ఎఫెక్ట్ ను తగ్గించవచ్చు. విరాట్ చేసిందదే. క్రికెట్ ఆటతో తన ఒత్తిడిని అధిగమించాడు” అని వివరిస్తారు ప్రముఖ Cognitive Scientist Lera Boroditsky.
 
చిన్న వయసులోనే చక్కని టెక్నిక్స్ సాధన చేస్తే పెద్దయ్యే కొద్దీ వాటిని ప్రయోగించే సామర్థ్యం పెరుగుతుంటారు. అందుకు కోచింగ్ ఉపయోగపడుతుందని చెప్తారు.
 
దారి తప్పిన టీనేజర్
 
2008 లో విరాట్ కెప్టెన్సీలో అండర్-19 ప్రపంచ కప్ గెలిచింది. తొలిసారి ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. అయితే రోజూ పార్టీలతో దారి తప్పాడు. కోచ్ మాటలను కూడా విరాట్ లెక్కచేయలేదు. అతని ప్రవర్తన తీవ్ర విమర్శలకు గురైంది. అప్పుడే అతను స్వీయ విధ్వంసమా? బ్యాట్ తో విధ్వంసమా? అనే పరీక్షలో బ్యాట్ వైపుకే మొగ్గాలని నిర్ణయం తీసుకున్నాడు.
 
తన ప్రవర్తనను, ప్రాక్టీస్ ను మార్చుకున్నాడు. 2011 నాటికి తన ప్రవర్తనతో ప్రశంసలు అందుకున్నాడు. ఇలాంటి పరిస్థితి చాలామంది టీనేజర్లకు ఎదురవుతుంది. తాత్కాలిక సుఖం వైపు మొగ్గు చూపిన వారు కనుమరుగవుతారు. విజన్ పై గురి ఉన్నవాడు విజయం సాధిస్తాడు. అందుకే ఎమోషనల్ మాస్టరీ “జీనియస్ జిమ్” కోచింగ్ లో ఒక ప్రధాన విభాగం.
 
జీనియస్ స్టేట్
 
“క్రికెటర్ గా ఫీల్డ్ లో నేను చేసే ప్రతీ పనికీ నా ఇన్ స్టింక్ట్ కారణం. కొన్నిసార్లు ఎదురుగా ఏ బౌలర్ ఉన్నారో కూడా చూడను, బాల్ ను మాత్రమే చూస్తాను. ఒక విషయంపై ముందు మనం మన మనసును ఒప్పించగలిగితే మిగతాదంతా సులువే అని తెలుసుకున్నాను. అందుకే విజువలైజేషన్ చేసేవాణ్ని. బంతి వేగం, గమనాన్ని బౌలర్ మెదడులోకి వెళ్లి అంచనా వేసేవాణ్ని” అని చెప్తాడు విరాట్. “ఈ అంత:ప్రేరణ ఒక వ్యక్తి చదువు, పెంపకంపై ఆధారపడి ఉంటుంది. అది మన అనుభవాల నుంచి వస్తుంది. మన సామర్థ్యాలపై మనకు విశ్వాసం పెరిగేలా చేస్తుంది. ఛాలెంజ్ ముందున్నప్పుడు విరాట్ మెదడులోని ఫ్రంటల్ లోబ్ బాగా యాక్టివ్ గా ఉంటుంది. లింబిక్ వ్యవస్థ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. మెదడులోని న్యూరాన్లన్నీ అత్యుత్తమ స్థాయిలో ఉత్తేజం పొందుతాయి, పరిసరాలన్నీ మరచి విజయం గురించి మాత్రమే ఆలోచిస్తాయి” అంటారు Lera Boroditsky.
 
అందుకే పిల్లలకు సరైన ఇంటి వాతావరణం అందిస్తే వారిలోనే నేచురల్ టాలెంట్స్ బయటకు వస్తాయంటాను నేను. అలాంటి వాతావరణం కల్పించేందుకే “జీనియస్ పేరెంటింగ్ కోచింగ్.”

లక్ష్యం అందుకోవడానికి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడే విరాట్ లోని అత్యుత్తమ ఆట బయటకు వస్తుంది. ఎందుకంటే, అతని ముందున్న ఛాలెంజ్ అతన్ని “ఫ్లో స్టేట్” లోనికి తీసుకెళ్తుంది. దాన్నే నేను “జీనియస్ స్టేట్” అంటాను.

అంటే ఒక వ్యక్తి తనలోని సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే స్థితి. ఈ స్థితిని ఎవరైనా అందుకోవచ్చు… కావాల్సిందల్లా సరైన కోచింగ్, నిలకడైన ప్రాక్టీస్ మాత్రమే.

“Every child is a born potential genius. But, parenting, education, and society degenius them.”

ఈ సమస్యకు పరిష్కారం “జీనియస్ జిమ్” లో ఉంది. మీ పిల్లల్లోని నేచురల్ టాలెంట్స్ ను గుర్తించి ప్రోత్సహించేలా మూడు నెలల పాటు “జీనియస్ పేరెంటింగ్ కోచింగ్” ఉంటుంది. అరిస్టాటిల్ నుంచి ఐన్ స్టీన్ వరకూ ప్రఖ్యాత మేధావుల ఆలోచనా సరళిని పిల్లలకు నేర్పించేలా ఆరు నెలలపాటు “జీనియస్ జిమ్ కోచింగ్” ఉంటుంది.

జీనియస్ జిమ్ గురించి మరిన్ని వివరాలు కావాలనుకునేవాళ్లు ఫేస్బుక్ లో జీనియస్ జిమ్ పేజీని లైక్ చేయండి, జీనియస్ జిమ్ గ్రూప్ లో చేరండి, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లో చేరి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందుకోండి. మరిన్ని వివరాలు కావాలనుకునేవారు 8019000066 కు వాట్సప్ చేయండి.

Exit mobile version