Gold price: దేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పసిడికి చాలా డిమాండ్ ఉండడంతో ధరలు విపరీతంగా పెరిగి రోజురోజుకు రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వడ్డీ రేట్లను తగ్గిస్తుందని వస్తున్న వార్తలతో మదుపరులు బంగారం కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ప్రస్తుతం తాజా గణాంకాల ప్రకారం పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా హైదరాబాద్‌లో రూ. 70 వేల మార్క్‌ను చేరింది. 24 క్యారట్ల బంగారం ధర 70,470గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,750గా ఉంది.
ఇక వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 82,000 చేరింది. దేశంలోనే కాక తెలుగు రాష్టాలలో వెండి ధరలు కూడా చుక్కలు చూపించే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో వెండి ధరలు 81, 000 మార్క్ దాటింది. చెన్నైలో వెండి ధర రూ. 84,000గా ఉంది. అలాగే బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 79,000గా ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 64,744 కాగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 70,682గా ఉంది.
- చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,450 కాగా, 24 క్యారెట్ల పసిడి రూ.71,400గా ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,600 కాగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 70,470 పలుకుతోంది.
- బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో బంగారం ధరలు ఒకేరకంగా ఉన్నాయి. ఈ రెండు మెట్రో నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 64,600 కాగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.70,470కి చేరింది.
- గురుగ్రామ్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 64,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,620 గా ఉంది.
- లక్నోలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,620గా ఉంది.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్