కొందరు తక్కువ బరువు ఉన్నామని అదేపనిగా బాధపడుతుంటారు. ముఖ్యంగా టీనేజీ పిల్లలు, యువత ఈ పరిస్థితి ఎదుర్కొంటారు. ఎత్తుకు తగ్గిన బరువు లేమని బాధపడుతుంటారు. ప్రస్తుత జీవనశైలిలో మారుతున్న ఆహారపు అలవాట్ల రీత్యా అధిక బరువు ఒక సమస్య అయిపోయింది. ఈ బరువు పెరగడం కారణంగా అనేక సమస్యలకు, ఆందోళనకు గురికావడం తీవ్ర మనస్థాపానికి దారితీస్తుంది.
అయితే కొద్దిమందిలో బరువు పెరగడం ఎంత పెద్ద సమస్య అవుతుందో కొద్దిమందికి బరువు లేకపోవడం కూడా అంతే సమస్యగా అనిపిస్తుంది. అంటే శరీర బరువు ఆరోగ్యంగా ఉండాల్సినదానికంటే తక్కువ ఉండడం వల్ల ఎదురయ్యే సమస్య ఇది. ఎన్ని తిన్నా సన్నగానే ఉన్నామే అని నిరాశ పడడం కొందరి నోటి వెంట వింటూ ఉంటాం.
కొద్దిమంది తినకపోయిన బరువు పెరుగుతారు. కాని కొందరు ఎంత బలమైన ఆహారం తీసుకున్న బరువు పెరగరు. అయితే బరువు పెరిగిన వారికి తగ్గించడం చాలా కష్టతరమైన పని. కాని సన్నగా ఉన్నవారు బరువు పెరగడం చాలా సులువు. అందుకు సరైన ప్రణాళికతో సరైన ఆహారపు అలవాట్లును అలవరుచుకుని పాటించడం అవసరం. మరి సరైన బరువును పెంచే చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు పెరిగేందుకు చిట్కాలు
- బరువు పెరగాలంటే ఆరోగ్యకరమైన కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ఉత్తమం. బంగాళాదుంపలు, వరి అన్నం, నెయ్యి వంటి వాటిలో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిలో తగినంత పోషకాలు కూడా ఉంటాయి. అందువల్ల ఆరోగ్యకరంగా బరువు పెరగొచ్చు.
- మాంసాహారులైతే తినే ఆహారంలో ఎక్కువగా చేపలు, మాంసం, చికెన్, గుడ్లు వంటివి తీసుకోవడం వల్ల అధిక ప్రోటీన్ లభిస్తుంది. తద్వారా కండరాలు బలోపేతమై ఆరోగ్యమైన బరువు పెరగుదలకు దోహదపడుతుంది.
- మీరు డైట్ లిస్ట్‌లో మీ ఆహార పదార్థాలను త్వరగా మార్పు చేసుకోవచ్చు. సరైన ఆహారం తీసుకోవడం, శరీర పుష్టి కోసం కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల ఖచ్చితంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
- ప్రాసెస్ చేసిన చక్కెరకు బదులు కిస్మిస్, అంజీరా వంటివి తినడం కూడా ఆరోగ్యకరంగా బరువు పెంచే మార్గాలలో ఒకటి. రోజూ క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం పరిమితంగా తీసుకోవడం వల్ల తప్పకుండా బరువు పెరుగుతారు. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలును చేకూరుతుంది.
- అరటి పండు బరువును పెంచడంలో కీలకంగా పనిచేస్తుంది. రోజూ ఒక గ్లాసు బనానా షేక్‌లో తేనె కలిపి తాగడం వల్ల సులువుగా బరువును పెంచవచ్చు.
- మామిడిపండ్లలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఎలాంటి కొవ్వు కానీ, సోడియం కానీ ఇందులో ఉండవు. మామిడిపండ్లలో ప్రక్టోజ్ ఉండడం వల్ల అది కొవ్వును పెరిగేలా చేస్తుంది. వేసవిలో ప్రతీరోజూ ఒక గ్లాసు మామిడి పండ్ల రసం లేదా మామిడి పండ్లు తీసుకుంటే నెలరోజుల్లో బరువు పెరిగే అవకాశం మెండుగా ఉంటుంది.
- ప్రతీరోజూ రాత్రి పడుకునే ముందు కిస్‌మిస్‌లను తిన్న తర్వాత గ్లాసు నీటిని తాగాలి. ఇది శరీరంలో జీవక్రియను పెంచి బరువు పెరిగేలా చేస్తుంది.
- బరువును పెంచే పానీయాలలో ఎక్కువ అరటి పండుతో చేసిన రసాలను సేవించడం వల్ల బరువును ఈజీగా పెంచుకోవచ్చు. వీటిలో ఓట్స్, తేనె వంటివి కలుపుకుని నిర్ధిష్ట సమయాలలో తింటూ ఉండాలి.
- బాదం, నట్స్, డ్రైఫ్రూట్స్ తినడం వల్ల పోషక విలువలు చేరి ఆరోగ్యకరమైన బరువును పెంచడానికి దోహదపడుతుంది.
- మీ బ్రేక్‌ఫాస్ట్‌లో తగినన్ని తృణధాన్యాలు, సలాడ్లు, ఉండేలా చూసుకోవడం వల్ల అధిక పోషకాలు అంది క్యాలరీలు సమృద్దిగా డైట్‌లో చేరుతాయి. సులువుగా బరువు పెరగవచ్చు.
– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్