Home న్యూస్ 21 రోజుల పాటు దేశం లాక్‌ డౌన్‌: ప్రధాని సంచలన నిర్ణయం

21 రోజుల పాటు దేశం లాక్‌ డౌన్‌: ప్రధాని సంచలన నిర్ణయం

lock down

రోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు దేశాన్ని సంపూర్ణంగా 21 రోజులపాటు లాక్‌ డౌన్‌ చేస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం వెల్లడించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు. మంగళవారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఏ ఒక్కరూ 21 రోజులపాటు బయటకు రావొద్దని కోరారు.

అత్యవసర సర్వీసులు మినహా అన్నీ లాక్‌ డౌన్‌ అని ప్రకటించారు. చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ప్రధాన మంత్రి సందేశం ఆయన మాటల్లోనే.. ‘ప్రపంచంలో కరోనా పాజిటివ్‌ కేసులు మొదటి లక్ష కేసులకు 67 రోజులు పడితే .. రెండో లక్ష కేసులకు 11 రోజులు పట్టింది. మూడో లక్ష కేసులకు 4 రోజులు పట్టింది. మీరు అంచనా వేయొచ్చు.. ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో.. ఇలా వ్యాప్తి చెందితే ఇక ఆపడం కష్టం. చైనా, అమెరికా, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, ఇరాన్‌ తదితర దేశాల్లో కరోనా వ్యాప్తి చెందుతూ పరిస్థితి చేజారిపోయింది.

ఇటలీ అభివృద్ధి చెందిన దేశం. వైద్యరంగంలో చాలా ముందంజలో ఉంది. కానీ కరోనా ప్రభావాన్ని ఆపలేకపోయింది. మరి దీనికి ఉపాయం ఏంటి? కరోనాను ఎదుర్కోవడంలో ఆయా దేశాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే బయటకు వెళ్లకుండా ఉండడమే దీనికి మందు. ప్రభుత్వం చెప్పిన ఆదేశాలు విని కొన్ని దేశాల ప్రజలు బయటకు వెళ్లలేదు. దాంతో అక్కడ ఆగిపోయింది.

మనం కూడా అలాగే చేయాలి. అదొక్కటే ప్రత్యామ్నాయం. ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దు. ఏదైనా జరగనివ్వండి. ఇంట్లోనే ఉండండి. సోషల్‌ డిస్టెన్స్‌.. ప్రధాన మంత్రి నుంచి మొదలు.. గ్రామాల్లో నివసిస్తున్న వారి వరకు… ఈ లక్ష్మణ రేఖ దాటొద్దు. ఇంట్లో ఉన్న వారు కూడా ఒకరికొకరు దూరంగా ఉండాలి.

మన సంకల్పాన్ని మరింత ధృఢ పరచాల్సిన తరుణం ఇది.

ధైర్యంగా ఉండాల్సిన తరుణం ఇది.
దేశం లాక్‌ డౌన్‌ ఉన్నంత కాలం మనం మన సంకల్పాన్ని గట్టిగా నిలబెట్టాలి.

వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, పాథాలజీ సిబ్బంది గురించి ఆలోచించండి.
మహమ్మారి నుంచి ఒక్కొక్క జీవిని కాపాడేందుకు రాత్రింబవళ్లూ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. ఆంబులెన్స్‌ డ్రైవర్లు, వార్డు బాయిలు, పారిశుద్ధ్య కార్మికులు ఈ కష్ట సమయంలో ఇతరుల కోసం సేవల చేస్తున్నారు. వారి కోసం ప్రార్థించండి.

24 గంటల పాటు పనిచేస్తున్న మీడియా వారి గురించి కూడా ఆలోచించండి.
పోలీసులు వారి కుటుంబాన్ని వదిలి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించేందుకు రోడ్లపై ఉన్నారు. వారితో కొందరు ఘర్షణకు దిగడం సరికాదు. కేంద్రం, రాష్ట్రాలు చాలా వేగంగా పనిచేస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర పౌర సంఘాలు పేదలకు మద్దతుగా నిలబడుతున్నాయి. ఇంకా వారికి సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.

మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం నిరంతరం పనిచేస్తూనే ఉంది.

రూ. 15 వేల కోట్ల మేర వెచ్చించి ఆరోగ్య సదుపాయాలు సిద్ధం చేస్తోంది. కిట్లు, పరికరాలు, వెంటిలేటర్లు, బెడ్లు సిద్ధం చేస్తోంది.

రాష్ట్రాలు కూడా ఆరోగ్య సేవలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి..”

మాస్కులపై డబ్ల్యూహెచ్‌వో ఏం చెబుతోంది

Exit mobile version