Home న్యూస్ మాస్క్‌ వాడకంపై డబ్ల్యూహెచ్‌వో ఏం చెబుతోంది?

మాస్క్‌ వాడకంపై డబ్ల్యూహెచ్‌వో ఏం చెబుతోంది?

mask usage
Image by Juraj Varga from Pixabay

రోనా వైరస్‌ డిసీజ్‌ లేదా కోవిడ్‌–19 ప్రబలుతున్న తరుణంలో మాస్క్‌ల కొరత వేధిస్తోంది. అవసరం లేని వాళ్లు కూడా మాస్క్ వాడుతుండడంతో రూ. 30లకు లభించే మాస్క్‌లను రూ. 300లకు అమ్ముతున్నారు. అసలు మాస్క్‌ల వాడకంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటోంది? మాస్క్‌ను ఎవరు వాడాలి? ఎందుకు వాడాలి?ఎలా వాడాలి? ఇలాంటి అంశాలపై డబ్ల్యూహెచ్‌వో స్పష్టమైన సూచనలు జారీచేసింది. అనవసరంగా మాస్క్‌లు కొనడం వల్ల అవి అవసరమైన వారికి లభించక.. వైరస్‌ వ్యాప్తి చెందడంలో భాగస్వాములు కావొద్దన్న లక్ష్యంతో డియర్‌ అర్బన్‌ డాట్‌ కామ్‌ ఈ కథనం అందిస్తోంది.

మాస్క్‌ ఎప్పుడు అవసరం

ఆరోగ్యవంతులు మాస్క్‌ వాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే కోవిడ్‌–19 సోకినట్టు అనుమానం ఉన్న వారితో డీల్‌ చేసినప్పుడు మాత్రమే మాస్క్‌ వాడాలని డబ్ల్యూహెచ్వో చెబుతోంది. అందువల్ల మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాస్క్‌లు వాడాల్సిన అవసరం లేదు.

కేవలం కోవిడ్‌–19 సోకిన వారితో గది పంచుకున్నప్పుడు, వైరస్‌ సోకినట్టు అనుమానం ఉన్న వ్యక్తులతో సంభాషించేటప్పుడు లేదా వారికి సమీపంలో ఉన్నప్పుడు మాత్రమే మాస్క్‌ వాడాలి.

ఒకవేళ మీకు దగ్గు ఉంటే గానీ, తుమ్ములు వస్తుంటే గానీ మాస్క్‌ వాడాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది.

ఆల్కహాల్‌ ఆధారిత హాండ్‌ రబ్‌ గానీ, సబ్బు, నీరు గానీ వినియోగించి తరచుగా చేతులు శుభ్రపరుచుకుంటూ మాత్రమే ఈ మాస్క్‌ వినియోగించాలని సూచిస్తోంది. అంటే చేతులు శుభ్రపరుచుకోవడం, మాస్క్‌ వాడడం రెండూ చేస్తేనే దీని ద్వారా ఫలితం ఉంటుంది.

మాస్క్‌ ఎలా వాడాలి?

మాస్క్‌ పెట్టుకునే ముందు మీ చేతులను శుభ్రం చేసుకోవాలి. ఇందుకోసం ఆల్కహాల్‌ ఆధారిత హ్యాండ్‌ రబ్‌ గానీ, సబ్బు నీటితో కడుక్కోవడం గానీ చేయాలి.
handwash before use mask
నోటిని, ముక్కును కవర్‌ చేస్తూ మాస్క్‌ ధరించాలి. ముఖానికి మాస్క్‌కు మధ్య గ్యాప్‌ లేకుండా చూసుకోవాలి.
using masks
మాస్క్‌ ధరించినప్పుడు దానిని టచ్‌ చేయకపోవడం మేలు. టచ్‌ చేయాల్సి వస్తే మీ చేతులు తిరిగి శుభ్రం చేసుకుని మాత్రమే టచ్‌ చేయాలి.

మాస్క్ ఎప్పుడు పడేయాలి? ఎలా పడేయాలి

మాస్క్‌ ధరించినప్పుడు అది తడిగా అయిన పక్షంలో, లేదా తడిగా అయినట్టు అనిపించిన పక్షంలో దానిని వినియోగించకుండా మూత ఉన్న చెత్తబుట్టలో పడేయాలి.

సింగిల్‌ యూజ్‌ మాస్క్‌లను మరలా వాడరాదు.

మాస్క్‌ తొలగించినప్పుడు ముందు నుంచి టచ్‌ చేయరాదు. వెనకనుంచి తొలగించాలి. ముందు నుంచి టచ్‌ చేసినట్టయితే తిరిగి చేతులు ఆల్కహాల్‌ ఆధారిత హ్యాండ్‌ రబ్‌తో గానీ, సబ్బు నీటితోగానీ శుభ్రపరచుకోవాలి.

కరోనా వైరస్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు

కరోనా వైరస్ గురించి కొన్ని ప్రచారాలు నిజం కాదని డబ్ల్యూహెచ్వో చెబుతోంది. అవేంటంటే చల్లని వాతావరణం, మంచు కురవడం వంటివి కరోనా వ్యాప్తిని అరికట్టలేవని చెబుతోంది.

అలాగే వేడి నీటి స్నానం కూడా కరోనా నుంచి రక్షించదని స్పష్టం చేస్తోంది. అలాగే చైనాలో తయారైన వస్తువులను కొనడం వల్ల కరోనా వ్యాప్తి చెందదని కూడా స్పష్టం చేసింది.

కరోనా వైరస్ నేల ఉపరితలం మీద, వస్తువుల మీద కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు కూడా ఉంటుందని(ఉపరితలాన్ని బట్టి), అయితే విభిన్న ఉష్ణోగ్రతల మధ్య కరోనా వైరస్ అలాగే ఉండిపోయే అవకాశం లేదని చెబుతోంది. అందువల్ల ఫ్లోర్ శుభ్రం చేసుకోవడం కూడా మంచిదని సూచిస్తోంది.

అలాగే దోమకాటు వల్ల కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందదని చెబుతోంది.

కరోనా వైరస్ చికిత్స ఏంటి?

corona

వెల్లుల్లి యాంటీ బయోటిక్ గా పనిచేస్తుందని, అయితే ఇది కరోనా వైరస్ డిసీజ్ ను తగ్గిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కూడా డబ్ల్యూహెచ్ వో చెబుతోంది. ఇప్పటివరకు కరోనా వైరస్ కు ఎలాంటి మందులు లేవని, అయితే లక్షణాల ఆధారంగా పేషెంట్ కు వైద్య సాయం ఉంటుందని చెబుతోంది.

ఇవీ చదవండి

Exit mobile version