Home లైఫ్‌స్టైల్ Jupiter Retrograde: గురు వక్ర గమనం.. ఈ 3 రాశులకు ధన యోగం

Jupiter Retrograde: గురు వక్ర గమనం.. ఈ 3 రాశులకు ధన యోగం

jupiter
గురు వక్రగమనం వల్ల 3 రాశులకు ప్రయోజనం (pixabay)

Jupiter Retrograde: గురు గ్రహం ప్రస్తుతం సెప్టెంబరు 4 నుంచి తిరోగమనంలో ఉంది. డిసెంబరు 31న తిరిగి ప్రత్యక్ష మార్గంలో పయనిస్తుంది. గురుడి వక్రగమనం కారణంగా పలు రాశులకు ధనం, సంపద ప్రాప్తిస్తాయి. ఏయే రాశులకు ప్రయోజనం కలుగుతుందో ఇక్కడ చూడండి.

మేష రాశి

మేష రాశిలో గురు వక్రగమనం కారణంగా మేష రాశి జాతకులు గురు వక్రగమనం సమయంలో సానుకూల ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కెరీర్ బాగుంటుంది. వ్యాపారులు లాభాలు చూస్తారు. గురు తిరోగమనం సమాజంలో మీకు గౌరవ మర్యాదుల తెచ్చిపెడుతుంది.

సింహ రాశి

గురు వక్రగమనం సింహ రాశి జాతకులకు మంచి ఫలితాలను ఇస్తుంది. తిరోగమన బృహస్పతి సమయంలో మీ పెట్టుబడులపై లాభాలు చూస్తారు. విజయాన్ని ముద్దాడుతారు. తండ్రి సహకారం సంపూర్ణంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

మీన రాశి

గురు వక్రగమన సమయంలో మీన రాశి జాతకులు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. డిసెంబరు 31 వరకు మీ జీవితంలో సానుకూల ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం చక్కగా ఉంటుంది. లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసి విజయం సాధిస్తారు.

Exit mobile version