Home ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ రివ్యూ : కృష్ణా అండ్‌ హిజ్‌ లీల

మూవీ రివ్యూ : కృష్ణా అండ్‌ హిజ్‌ లీల

krishna and hi leela
[yasr_overall_rating null size=”medium”]

మూవీ : కృష్ణా అండ్‌ హిజ్‌ లీల
రేటింగ్‌ : 3/5
నటీనటులు : సిద్దు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాథ్, శీరత్‌కపూర్, శాలినీ వడ్నికట్టి
మ్యూజిక్‌ : శ్రీచరణ్‌ పాకాల
నిర్మాతలు : సురేష్‌ ప్రొడక్షన్స్, వయా కామ్‌ మోషన్‌ పిక్చర్స్, సంజయ్‌ రెడ్డి
డైరెక్టర్‌ : రవికాంత్‌ పేరేపు
విడుదల : జూన్‌ 25, 2020 , ఓటీటీ రిలీజ్‌
ఓటీటీ : నెట్‌ ఫ్లిక్స్
నిడివి : 2 గంటల 5 నిమిషాలు

ఏజ్‌ రిస్ట్రిక్షన్‌ : 18 ప్లస్‌

కృష్ణా అండ్‌ హిజ్‌ లీల మూవీ రివ్యూ

టీటీలో నేరుగా రిలీజైన తాజా తెలుగు సినిమా కృష్ణా అండ్‌ హిజ్‌ లీల. రాణా దగ్గుబాటి సమర్పణలో నెట్‌ఫ్లిక్స్‌లో ఎలాంటి హడావిడి లేకుండా రిలీజ్‌ అయ్యింది. క్షణం సినిమాకు దర్శకత్వం వహించిన రవికాంత్‌ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

స్టోరీ :

కృష్ణ (సిద్ధూ జొన్నలగడ్డ) థర్డ్‌ ఇయర్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి. ఫైనల్‌ ఇయర్‌ అమ్మాయి సత్య (శ్రద్ధా శ్రీనాథ్‌)తో ప్రేమ, ఏడాదిలోనే బ్రేకప్‌. ఈ బ్రేకప్‌కు బలమైన కారణాలేమీ ఉండవు. సత్య బెంగళూరు వెళ్లిపోతుంది. కొద్ది రోజులకే రాధ (శాలినీ)తో ప్రేమలో పడతాడు. ఇందుకూ బలమైన కారణమేదీ లేదు.

కొద్దిరోజులకే తనకూ బెంగళూరులో జాబ్‌ వస్తే అక్కడికెళ్లి చెల్లెలి ఫ్లాట్‌లో ఉంటాడు. అదే ఫ్లాట్‌లో చెల్లెలి స్నేహితురాలు రుక్సర్‌ (శీరత్‌కపూర్‌) తనకూ స్నేహితురాలిగా మారుతుంది. జాబ్‌ మానేసి రుక్సర్‌ రెస్టోబార్‌లో సిద్ధూ పాట పాడుతుండగా అక్కడ సత్య తిరిగి కలుస్తుంది. సత్య దగ్గరవడంతో రాధ దూరమవుతుంది. రాధ దూరమైందని సత్యకు మరింత దగ్గరవుతాడు. చివరకు కృష్ణ ఎవరిని ఎంచుకుంటాడు? అన్నదే ఈ కథ.

కృష్ణా అండ్‌ హిజ్‌ లీల ఎలా ఉంది?

సిద్ధూ ప్రేమకు గానీ, బ్రేకప్‌కు గానీ ఒక బలమైన కారణమేదీ ఉండదు. టీనేజ్, ఆ తదుపరి దశల్లో ఉండే సందిగ్ధత, సమస్య ఒక చోట ఉంటే ఉపశమనం ఇంకోచోట పొందడం సమాజంలో ఇటీవలి కాలంలో నడుస్తున్న ట్రెండే. లవ్, బ్రేకప్‌ జీవితంలో జరిగే కొన్ని ఈవెంట్లలాగా మారిపోయాయి. ఇద్దరమ్మాయిలతో ప్రేమలో పడి కొట్టుమిట్టాడే పాత్రలో సిద్దూ బాగానే నటించాడు.

ఇద్దరి ప్రేమ కావాలని పరితపించేందుకు తగిన కారణమేదీ సినిమాలో కనిపించదు. నిజానికి నిజ జీవితంలో కూడా ఇప్పటి లవ్, బ్రేకప్‌లలో ఇదే జరుగుతున్నందున కాస్త కన్విన్సింగ్‌గానే ఉంటుంది. అయితే కేవలం తన సందిగ్ధమైన, గందరగోళమైన మనస్తత్వమే కారణమని దర్శకుడు చెప్పే ప్రయత్నం చేసినా.. దానికీ బలమైన కారణాలేవీ చూపించలేకపోతాడు. అయితే కన్విన్సింగ్‌గా క్లైమాక్స్‌ తీసుకొచ్చి ఫీల్‌ గుడ్‌ ముగింపు ఇచ్చాడు.

పెర్‌ఫార్మెన్స్‌

రాధ పాత్ర పోషించిన శాలినీ ఈ సినిమాలో చక్కగా నటించింది. విభిన్న సన్నివేశాల్లో తన హావభావాలతో ఆకట్టుకుంది. శ్రద్ధా శ్రీనాథ్‌ తన పాత్ర మేరకు ఫరవాలేదనిపించింది. శీరత్‌కపూర్‌ కామన్‌ ఫ్రెండ్‌లా చక్కగా ఒదిగిపోయింది. వైవా హర్ష హీరోస్నేహితుడి పాత్రలో చక్కగా నటించాడు. సిద్ధూ తండ్రి పాత్రలో సంపత్‌ నటించినా.. పెద్దగా అభినయానికి స్కోప్‌ ఉన్న పాత్ర కాదు.

చివరి అరగంట చివరికేమవుతుందన్న ఊహల్ని పెంచడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. పాటలంటూ ప్రత్యేకంగా ఏవీ లేకపోయినా బ్యాక్‌ గ్రౌండ్‌లో వచ్చే మ్యూజిక్‌ బాగుంది. రొమాంటిక్‌ కామెడీ తరహాలో ఉండే ఈ లవ్ స్టోరీ ఎక్కడా బోర్‌ కొట్టించదు. 

ఇవీ చదవండి:

Exit mobile version