Maldives Package From Hyderabad: మాల్దీవ్స్ టూర్.. చాలా వరకు ఇండియన్ సెలబ్రిటీలకు ఇది హాట్ డెస్టినేషన్. హనీమూన్‌కు ప్లాన్ చేసే వాళ్లకు హిందూ మహాసముద్రంలోని ఈ చిన్న దీవుల సమూహానికి రొమాంటిక్ డెస్టినేషన్ గా పేరుంది. అందమైన బీచ్‌లు, ఐలాండ్స్, చారిత్రక కట్టడాలు, నీటిలోనే రిసార్ట్స్ మాల్దీవ్స్‌ను ప్రపంచంలోని బెస్ట్ హాలీ డే స్పాట్‌గా మార్చేశాయి. మరి ప్రకృతి అందాలకు నెలవైన, ఈ అందమైన దేశానికి ఎలా వెళ్లాలి? అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి? అందుబాటులో ఉన్న బెస్ట్ ప్యాకేజ్‌లు ఏమున్నాయో డియర్ అర్బన్.కామ్ అందిస్తున్న ఈ స్టోరీలో తెలుసుకోండి.
Maldives Package: మాల్దీవ్స్ టూర్ Maldives trip ఎలా వెళ్లాలి?
Maldives Package From Hyderabad: హైదరాబాద్ నుంచి మాల్దీవ్స్ రాజధాని మాలెకు ప్రతి రోజూ చాలా విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిరిండియా, శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్, మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు ఉంటాయి. జర్నీకి కనీసం 8 నుంచి 9 గంటల సమయం పడుతుంది. ఎయిర్‌లైన్స్‌ను బట్టి రూ. 7 వేల నుంచి కూడా టికెట్లు అందుబాటులో ఉండటం విశేషం.
ఇక మాల్దీవ్స్‌కు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కూడా ఉంది. అంటే ముందుగానే ఆ దేశ వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు. మాలెలో అడుగుపెట్టిన తర్వాత టూరిస్ట్ వీసా తీసుకోవచ్చు. గరిష్ఠంగా 30 రోజుల వరకూ ఈ వీసా గడువు ఉంటుంది. ఈ వీసా ఫ్రీగానే ఇస్తారు. maldives honeymoon package కూడా చాాలా ట్రావెల్ కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి.
మాల్దీవ్స్ టూర్ Maldives trip వెళ్లేముందు తెలుసుకోవాల్సిన అంశాలు
మాల్దీవ్స్ టూర్ వెళ్లే ముందు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. అక్కడ ఏం చూడాలి.. ఎలా ఉండాలి.. ఎంత ఖర్చవుతుంది అన్న విషయాలు తెలుసుకుంటే మంచిది.
– మాల్దీవుల యాత్ర ప్లాన్ చేస్తే అక్కడి కరెన్సీ గురించి కూడా తెలుసుకోవడం మంచిది. మాల్దీవ్స్ కరెన్సీ maldives currency పేరు మాల్దీవియన్ రుఫియా Maldivian rufiyaa. ప్రస్తుతం మాల్దీవ్స్ కరెన్సీ maldives currency to inr ప్రకారం ఒక మాల్దీవియన్ రూఫియాకు 5.19 రూపాయలు (ఇండియన్ కరెన్సీ)
– మాల్దీవ్స్ 1190 దీవుల కలయిక. హిందూ మహాసముద్రంలో ఉండే ఈ దీవులు.. చాలా వరకూ ఎలాంటి జనసంచారం లేకుండా ఖాళీగానే ఉంటాయి. కేవలం 200 దీవుల్లో మాత్రమే ప్రజలు నివాసం ఉంటారు.
– కొన్ని దీవుల్లోకి టూరిస్టులకు అనుమతి ఉండదు. ఇది కూడా ముందుగానే తెలుసుకుంటే మంచిది. అసలు మనుషులు ఎవరూ ఉండని కొన్ని దీవులను వ్యవసాయం, పరిశ్రమల ఏర్పాటు కోసం వాడుతున్నారు. మరికొన్ని దీవులను రిసార్టుల కోసం వినియోగిస్తున్నారు.
– మాల్దీవ్స్‌లో చాలా వరకు దీవులు అగ్నిపర్వతాల పేలుడు వల్ల ఏర్పడినవే. కొన్ని దీవులు మనుషులు చేసినవి కూడా ఉన్నాయి. టన్నుల కొద్దీ ఇసుక, కాంక్రీట్ సాయంతో ఈ కృత్రిమ దీవులను తయారు చేశారు. మాలె ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరగా ఉండే హుహుల్‌మాలె కూడా ఇలాంటిదే. దీనిని 2004లో నిర్మించారు. ఇప్పుడదో పెద్ద టౌన్‌లాగా మారిపోయింది.
– మాల్దీవ్స్‌కు టూర్ ప్లాన్ చేస్తే వెంటనే వెళ్లండి. ఎందుకంటే.. ఆ దీవులు మరీ ఎక్కువ కాలం ఉండేలా కనిపించడం లేదు. వాతావరణంలో మార్పుల కారణంగా సముద్ర మట్టాలు పెరిగిపోతుండటంతో ఇప్పటికే చాలా వరకు దీవులు కనిపించకుండా పోయాయి. 2004లో వచ్చిన సునామీలాంటి ప్రకృతి విపత్తులు మాల్దీవులకు మరింత ప్రమాదకరంగా మారాయి. పైగా అక్కడ మంచి నీళ్ల కొరత కూడా చాలా ఉంది. ఇది అక్కడి మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది.
– బయోలుమినిసెంట్ బీచ్‌లకు మాల్దీవ్స్ చాలా ఫేమస్. ఈ బీచుల్లో రాత్రి పూట సముద్రంలో కనిపించే వెలుగులకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు నేలపైకి దిగి వచ్చాయా అన్నట్లుగా ఉంటుంది. ఏడాదంతా ఈ అద్భుతం కనిపించే ప్లేస్‌లు మాల్దీవ్స్‌లో ఉన్నాయి. బా అటోల్‌లోని డుసిట్ థాని మాల్దీవ్స్ కూడా అలాంటిదే.
– మాల్దీవ్స్ వంద శాతం ముస్లిం జనాభా కలిగిన దేశం. అందువల్ల ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాల గురించి ముందుగానే తెలుసుకోవాలి. ఆల్కహాల్, హెచ్చరిక లేని పొగాకు ఉత్పత్తుల్లాంటి వాటిని అనుమతించరు. మాల్దీవ్స్‌లోని పట్టణాలు, నగరాల్లో అసలు ఆల్కహాల్ ఉండదు.
– అయితే రిసార్ట్ దీవుల్లో ఉండే టూరిస్టులకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఇక్కడ ఆల్కహాల్ అందుబాటులో ఉంటుంది. వేసుకొనే బట్టల విషయంలోనూ స్వేచ్ఛ ఉంటుంది.
– మాల్దీవ్స్‌కి వెళ్లడానికి సరైన సమయం.. నవంబర్ నుంచి ఏప్రిల్. మే నుంచి అక్టోబర్ వరకు ఇక్కడ వర్షాకాలం ఉంటుంది.
– ఇక్కడ నీళ్లపై నిర్మించిన విల్లాలు అద్భుతంగా ఉంటాయి. కానీ చాలా కాస్ట్‌లీ.
– మాల్దీవ్స్‌లో శుక్రవారం, శనివారాలను వీకెండ్స్‌గా భావిస్తారు.
– ఇక్కడి అధికార భాష దివేహి. దీనినే మాల్దీవియన్ అని కూడా అంటారు. అరబిక్, హిందీ, ఇంగ్లిష్ కూడా మాట్లాడతారు.
మాల్దీవ్స్‌లో చూడాల్సిన ప్రదేశాలు maldives sightseeing
మాల్దీవుల్లో పట్టణాలు, నగరాలతోపాటు ప్రైవేట్ రిసార్ట్ దీవులు కూడా ఉంటాయి. ముస్లిం దేశం కావడంతో సహజంగానే కాస్త ఆంక్షలు ఎక్కువగా ఉంటాయి. పట్టణాలు, నగరాల్లో ఉన్న సమయంలో అక్కడి రూల్స్‌ను కచ్చితంగా పాటించాల్సిందే. కాస్త స్వేచ్ఛగా ఉండాలనుకుంటే మాత్రం ఈ రిసార్ట్ దీవులకు వెళ్లాలి. మరి అక్కడ చూడదగిన ప్రదేశాలేంటో ఓసారి చూద్దాం..
బీచ్‌లు
ఐలాండ్ అంటేనే ఎక్కడ చూసినా బీచ్‌లు కనిపిస్తాయి. అందులోనూ మాల్దీవ్స్ బీచ్‌లు వరల్డ్ ఫేమస్. ముఖ్యంగా హనీమూన్ కపుల్‌కు కావాల్సిన ప్రైవసీ ఇక్కడి బీచుల్లో దొరుకుతుంది. అక్కడి ప్రభుత్వం బీచ్‌లపై ప్రత్యేకంగా దృష్టిసారించి అభివృద్ధి చేస్తోంది.
హుల్‌హుమాలె బీచ్:
వెలానా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చాలా దగ్గర్లో ఉండే బీచ్ ఇది. రోడ్డు మార్గం ద్వారా అరగంటలో ఇక్కడికి చేరుకోవచ్చు. దీంతో ఎక్కువ మంది టూరిస్టులు ఈ బీచ్‌కు వస్తుంటారు. ఇక్కడ బికినీలు వేసుకోవడానికి అనుమతి లేదు. ఆల్కహాల్ కూడా దొరకదు. హనీమూన్ కపుల్ సేఫ్ ప్లేస్‌గా చెప్పొచ్చు.
బికినీ బీచ్:
స్కూబా డైవింగ్ చేయాలనుకునే వాళ్లు ఈ బీచ్‌కు వెళ్లొచ్చు. రస్‌దూ పేరుతో ఇక్కడ ఓ డైవ్ సెంటర్ ఉంది. డీప్ సీ డైవింగ్‌లాంటి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇష్టపడే వాళ్లకు ఈ బీచ్ పర్ఫెక్ట్ డెస్టినేషన్. అసలు స్విమ్మింగ్ రాని వాళ్లతో కూడా సేఫ్‌గా డైవింగ్ చేయించగలిగే అనుభవం కలిగిన ట్రైనర్లు ఇక్కడ ఉన్నారు. రాజధాని మాలె నుంచి బోట్‌లో ఈ బీచ్‌కు వెళ్లొచ్చు.
ఫుల్‌హదూ ఐలాండ్ బీచ్:
బా అటోల్‌లోని ఓ చిన్న దీవి ఇది. ప్రైవసీ కావాలని కోరుకునే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్. హాయిగా స్విమ్మింగ్, డైవింగ్ చేసుకోవచ్చు. మాలె నుంచి స్పీడ్‌బోట్‌లో రెండు గంటలు ప్రయాణిస్తే ఈ ఫుల్‌హదూ బీచ్‌కు చేరుకోవచ్చు.
లిలీ బీచ్:
మాలె నుంచి సీ ప్లేన్‌లో ఈ బీచ్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. మాల్దీవ్స్‌లోనే అత్యంత ఖరీదైన రిసార్ట్స్ ఇక్కడ ఉంటాయి. కాస్త కాస్ట్‌లీయే అయినా.. అందుకు తగిన లగ్జరీ కూడా ఉంటుంది. ఫోర్ సీజన్స్ బీచ్ కూడా అలాంటిదే. ఖర్చుకు వెనుకాడని వాళ్లు మాత్రమే ఈ బీచ్‌ల వైపు చూడాలి.
బందోస్ మాల్దీవ్స్ :
కాస్త తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్లు ఈ బీచ్‌కు వెళ్లొచ్చు. కాకపోతే ఎయిర్‌పోర్ట్ నుంచి చాలా దూరం. హుల్‌హుమాలె నుంచి 8 గంటల పాటు బోటులో వెళ్లాల్సి ఉంటుంది.
బయోలుమినిసెంట్ బీచ్:
ఆకాశంలోని నక్షత్రాలు నేలపైకి దిగి వచ్చినట్లు ఇక్కడి బీచ్ రాత్రి వేళ తళాతళా మెరిసిపోతూ ఉంటుంది. మాల్దీవ్స్ టూర్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన బీచ్. ఎయిర్‌పోర్ట్ నుంచి కాస్త దూరమే అయినా.. ఇదొక లైఫ్‌టైమ్ ఎక్స్‌పీరియన్స్‌గా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హుల్‌హుమాలె నుంచి 12 గంటల బోటు ప్రయాణం చేస్తే ఈ బీచ్‌కు చేరుకోవచ్చు.
మాల్దీవ్స్‌లోని ఐలాండ్స్
ఇంతకుముందు చెప్పినట్లే మాల్దీవ్స్ 1190 దీవుల సమూహం. వీటిలో చాలా వరకూ మనుషులు ఉండని దీవులే అయినా.. కొన్ని మాత్రం కచ్చితంగా చూసి తీరాల్సినవి ఉన్నాయి. అసలు మాల్దీవ్స్ అంటేనే ఐలాండ్స్, రిసార్ట్స్. వీటిలో ముందుగానే ఒక ఐలాండ్‌ను సెలక్ట్ చేసుకొని వెళ్తే హాలిడేను ఎంజాయ్ చేయొచ్చు.
అలీమతా ఐలాండ్:
ప్రకృతి ప్రేమికులకు ఇదో స్వర్గమని చెప్పాలి. మాల్దీవ్స్‌లో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశమిది. ఇక్కడ ఉండే అలీమతా రిసార్ట్స్ మాల్దీవ్స్‌లోని బెస్ట్ రిసార్ట్స్‌లో ఒకటి. ఇక్కడ ఫోన్లు, టీవీలు ఉండవు. దీంతో బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రకృతి ఒడిలో హాయిగా విహరించే అవకాశం దక్కుతుంది.
బియాదూ ఐలాండ్:
హాలీవుడ్ సెలబ్రిటీల ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్ ఇది. ఇక్కడి కొకొవా రిసార్ట్‌కు తరచూ ఎవరో ఒక సెలబ్రిటీ వస్తూనే ఉంటారు. కాస్త లగ్జరీగా ఉండాలని అనుకుంటే ఈ రిసార్ట్‌కు వెళ్లొచ్చు. మాల్దీవ్స్‌లో తక్కువ బడ్జెట్‌తో మంచి అనుభూతిని పంచే ఐలాండ్స్‌లో ఈ బియాదూ కూడా ఒకటి.
ఆరా ఐలాండ్:
హనీమూన్ కోసం వెళ్లే కపుల్ ఈ ఐలాండ్‌కు కచ్చితంగా వెళ్లాలి. వాళ్లకు కావాల్సిన ప్రైవసీ ఇక్కడ దొరుకుతుంది. అతి తక్కువ జనాభా ఉన్న దీవుల్లో ఇదీ ఒకటి. ఇక్కడ కేవలం వంద మంది మాత్రమే ఉంటారు.
హుల్‌హుమాలె ఐలాండ్
ఇదొక ఆర్టిఫిషియల్ ఐలాండ్. మనిషి కృత్రిమంగా నిర్మించిన ఈ దీవి ఇప్పుడు ఓ పెద్ద పట్టణంగా మారిపోయింది. రాజధాని మాలెకు దగ్గర్లో ఉంటుంది. ఇక్కడ ఓ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. దాని పేరు వెలానా. హుల్‌హుమాలె వాటర్ స్పోర్ట్స్‌కు ఫేమస్. ఇక్కడి బీచ్‌తోపాటు సీహౌజ్, సెంట్రల్ పార్క్ కూడా చూడదగిన ప్రదేశాలే.
సరస్సులు కూడా అందాలకు నెలవు
బీచ్‌లు, ఐలాండ్సే కాకుండా.. సహజసిద్ధంగా ఏర్పడిన సరస్సులు, చారిత్రక ప్రదేశాలు, రీఫ్స్, సునామీ మాన్యుమెంట్, నేషనల్ మ్యూజియంలాంటివి కూడా మాల్దీవ్స్‌లో చూడదగిన ప్రదేశాలే.
– సరస్సుల విషయానికి వస్తే.. మాల్దీవ్స్‌లోనే అతిపెద్ద మంచి నీటి సరస్సు అయిన బందారా కిలికి కచ్చితంగా వెళ్లాల్సిందే. ప్రకృతి అందాలకు నెలవు ఈ బందారా కిలి. ఇక దీనికి దగ్గర్లోనే అత్యంత అరుదైన పక్షులకు నెలవైన దడిమాగి కిలి సరస్సు కూడా ఉంటుంది.
– స్కూబా డైవింగ్ చేయాలనుకునే వాళ్లు ఇక్కడి మాంటా పాయింట్‌కు వెళ్లొచ్చు. ముందుగానే శిక్షణ ఇచ్చి డైవింగ్‌కు తీసుకెళ్తారు. ఇక్కడ స్కూబా డైవింగ్ చేయాలని అనుకుంటే ఒక్కో వ్యక్తికి కనీసం వంద డాలర్లు ఖర్చవుతుంది. సముద్రం లోపలి అందాలను చూసే అవకాశం రావడం నిజంగా ఓ లైఫ్‌టైమ్ ఎక్స్‌పీరియన్సే.
– మాలెలోని గ్రాండ్ ఫ్రైడే మసీదు, హుల్‌హుమాలె మసీదు, సునామీ మాన్యుమెంట్, మాల్దీవ్స్ అధ్యక్షుడు ఉండే ములీ ఆగె, నేషనల్ మ్యూజియంలాంటి చారిత్రక కట్టడాలను కూడా చూడొచ్చు.
మాల్దీవ్స్ ప్యాకేజ్ maldives package ఎంచుకోవడం ఎలా?
maldives package from hyderabad మాల్దీవ్స్‌కు తక్కువ బడ్జెట్‌లో hyderabad నుంచి లేదా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాల నుంచి వెళ్లి రావాలంటే సొంతంగా కంటే ట్రావెల్ ఏజెన్సీలు అందించే ప్యాకేజ్‌లు maldives package తీసుకుంటేనే ఉత్తమం. మేక్ మై ట్రిప్, యాత్రా, థామస్‌కుక్ వంటి ఏజెన్సీలు టూరిస్టుల కోసం వివిధ ప్యాకేజీలు ఇస్తున్నాయి. maldives honeymoon package పేరుతో కూడా ప్రముఖ కంపెనీలన్ని ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తున్నాయి.
- Maldives trip cost: ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ మేక్ మై ట్రిప్ మాల్దీవ్స్ టూర్ కోసం మొత్తం 23 ప్యాకేజీలు అందిస్తోంది. ఇందులో ఒక వ్యక్తికి కనీసం రూ. 30 వేల నుంచి గరిష్ఠంగా రూ. లక్షా 63 వేల వరకూ అందుబాటులో ఉన్నాయి. ముంబై, కొచ్చిన్‌లాంటి నగరాల నుంచి మాల్దీవ్స్‌కు క్రూజ్ షిప్‌లో వెళ్లాలనుకునే వాళ్లకు కూడా ప్రత్యేక ప్యాకేజీలు మేక్ మై ట్రిప్ అందిస్తోంది.
మీరు ఎంపిక చేసుకునే రిసార్ట్స్, బీచెస్, ఐలాండ్స్‌ను బట్టి కావాల్సిన ప్యాకేజ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు, ఈ ప్యాకేజీల పూర్తి సమాచారం కోసం https://www.makemytrip.com లోకి వెళ్లండి.
– ఇక యాత్రా.కామ్ అయితే కనిష్ఠంగా రూ. 14,490 నుంచి మాల్దీవ్స్ టూర్ ప్యాకేజీలను అందిస్తుండటం విశేషం. ఇది ఫోర్ డేస్, త్రీ నైట్స్ ప్యాకేజ్. ఇందులో భాగంగా అకామడేషన్, మాలె సిటీ టూర్ ఉంటుంది. తొలి రెండు రోజులు సైట్ సీయింగ్ maldives sightseeing places టూరిస్టుల ఇష్టం.
ప్యాకేజ్‌లో maldives package భాగంగా ప్రతి రోజూ బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ ఇస్తారు. ఇక ఇందులోనే గరిష్ఠంగా రూ. 2 లక్షల 26 వేల ప్యాకేజీ కూడా ఉంది. ఈ ప్యాకేజీల పూర్తి వివరాల కోసం https://www.yatra.com/ లోకి వెళ్లండి.
– థామస్‌కుక్ ట్రావెల్ ఏజెన్సీ మాల్దీవ్స్ టూర్ కోసం మొత్తం ఏడు ప్యాకేజీలను అందిస్తోంది. రూ. 32 వేల నుంచి రూ. 84 వేల వరకు ఉన్నాయి. అయితే ఇందులో విమాన చార్జీలు ఉండవు. అకామడేషన్, మీల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. https://www.thomascook.in/ లోకి వెళ్తే ఈ ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.
ఇవీ చదవండి