Home న్యూస్ ప్రియాంక మకాం ఇక పూర్తిగా అక్కడికేనా?

ప్రియాంక మకాం ఇక పూర్తిగా అక్కడికేనా?

priyanka gandhi

ఢిల్లీలో ప్రియాంకా గాంధీకి నివాస కేటాయింపును రద్దు చేస్తూ కేంద్రం నోటీసులిచ్చాక ఇప్పుడు ఇక ఆమె ఉత్తర ప్రదేశ్ కు పూర్తిగా మకాం మార్చాలని పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ప్రియాంక లక్నోకు మకాం మార్చాలని ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకుల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి. 

2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారానికి దూరమైంది. అనూహ్యంగా నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ పగ్గాలు చేపట్టింది. 2019లోనూ అదే రిపీట్ అయ్యింది. యాభై ఏళ్లకు పైగా ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ చాలా చోట్ల ఉనికి లేకుండా పోయింది. 

అధ్యక్ష స్థానంలో ఉన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తేలేక రాజీనామా చేశారు. తిరిగి సోనియా గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. పార్టీకి విజయం తెచ్చి పెట్టే నేతగా శ్రేణలు ప్రియాంకా గాంధీ పై ఆశలు పెట్టుకునేవి. కానీ పార్లమెంటు ఎన్నికల్లో గానీ ప్రియాంక ప్రచారం ఫలితం ఇవ్వలేదు. కానీ అనేక అంశాలపై ఆమె స్పందిస్తున్న తీరు మాత్రం శ్రేణల్లో ఇంకా ఆశలు రేపుతూనే ఉంది. కాంగ్రెస్ లో భావి నేతగా ఆ శ్రేణులు నమ్ముతున్నాయి.

ఇప్పుడు యూపీ శ్రేణుల కోరిక మేరకు లక్నోకు మకాం మార్చి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కాస్తయినా కాంగ్రెస్ మెరుగుపడితే ఆమెకు పార్టీలో మరింత క్రేజ్ పెరుగుతుంది.

Exit mobile version