రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ప్రవేశపెట్టింది. ఏడాది కాల వ్యవధితో కూడిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్లలో సోనీ లివ్, జీ5 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. అలాగే 5జీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ అందుబాటులో ఉంటుంది.
రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ల పూర్తి వివరాలు ఇవే
ఒకటో ప్లాన్ ధర : రూ. 3,662
సౌకర్యాలు: సోనీలివ్, జీ5 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ లభిస్తుంది.
రోజువారీగా 2.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లు
రిలయన్స్ జియో రెండో ప్లాన్: రూ. 3,226
దీనిలో సోనిలివ్ ఓటీటీ, అపరిమిత కాలింగ్, రోజుకు 4 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌ల సౌలభ్యం ఉంటుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి వాటికి యాక్సెస్ ఉంటుంది. ఇందులో జీ5 ఉచితంగా లభించదు.
రిలయన్స్ జియో మూడో ప్లాన్ : రూ. 3,225
దీనిలో జీ5 ఓటీటీ ఉచితం. రోజూ 4 జీబీ డేటా ఉచితం. 100 ఎస్.ఎం.ఎస్.లు లభిస్తాయి. ఇందులో సోనీ లివ్ ఉచితంగా లభించదు.
ఇలా ఓటీటీ ప్లాన్లు కాకుండా రూ. 2,999తో మరొక ప్లాన్ కూడా ఇప్పటికే అమలులో ఉంది. దీనిలో కూడా రోజువారీగా 2 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది.