టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కార్లు షోరూముల్లోకి వచ్చేశాయి. వీటి ధర రూ. 8.10 లక్షలుగా ఉంది. మొత్తం ఆరు రంగుల్లో 11 వేరియంట్లలో ఈ కార్లు లభ్యమవుతాయి. ఈ కారు సెప్టెంబరు 15న లాంఛ్ అవగా, ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఎంట్రీ లెవెల్ కారు ధర (ఎక్స్-షోరూమ్) 8.10 లక్షలుగా ఉండగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 13,49,990గా ఉంది.
నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 2023 వెర్షన్ ఫీచర్లు
ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, పదహారు అంగుళాల స్టీల్ వీల్స్, 6 ఎయిర్ బ్యాగులు, టూ స్పోక్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ పవర్ విండోస్, మల్టీ డ్రైవ్ మోడ్ దీని ప్రత్యేకతలు. టాటా నెక్సన్ స్మార్ట్ వేరియంట్ (బేస్) లో 1.2 లీటర్, నాలుగు సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో లభ్యమవుతుంది. 118 బీహెచ్‌ఈ, 170 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. 7 స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ వెర్షన్ కొనసాగుతుంది. 360 డిగ్రీ కోణంలో కెమెరా ఉంటుంది.
టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ హైదరాబాద్ ఎక్స్‌షోరూమ్ ధరలు ఇవే
మోడల్ | వెర్షన్ | ధర |
---|---|---|
నెక్సాన్ స్మార్ట్ | పెట్రోల్ మాన్యువల్ | 8,09,990 |
నెక్సాన్ స్మార్ట్ ప్లస్ | పెట్రోల్ మాన్యువల్ | 9,09,990 |
నెక్సాన్ ప్యూర్ | పెట్రోల్ మాన్యువల్ | 9,69,990 |
నెక్సాన్ స్మార్ట్ ప్లస్ ఎస్ | పెట్రోల్ మాన్యువల్ | 9,69,990 |
నెక్సాన్ ప్యూర్ ఎస్ | పెట్రోల్ మాన్యువల్ | 10,19,990 |
నెక్సాన్ క్రియేటివ్ | పెట్రోల్ మాన్యువల్ | 10,99,990 |
నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ | పెట్రోల్ మాన్యువల్ | 11,69,990 |
నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ ఎస్ | పెట్రోల్ మాన్యువల్ | 12,19,990 |
నెక్సాన్ ఫియర్ లెస్ | పెట్రోల్ మాన్యువల్ | 12,49,990 |
నెక్సాన్ ఫియర్ లెస్ ప్లస్ | పెట్రోల్ మాన్యువల్ | 12,99,990 |
నెక్సాన్ ఫియర్ లెస్ ఎస్ | పెట్రోల్ మాన్యువల్ | 12,99,990 |
నెక్సాన్ పియర్ లెస్ ప్లస్ ఎస్ | పెట్రోల్ మాన్యువల్ | 13,49,990 |