Home లైఫ్‌స్టైల్ సంతోష‌క‌ర‌మైన జీవితం గ‌డ‌పాలంటే ఆ నాలుగు హార్మోన్లు త‌ప్ప‌నిస‌రి

సంతోష‌క‌ర‌మైన జీవితం గ‌డ‌పాలంటే ఆ నాలుగు హార్మోన్లు త‌ప్ప‌నిస‌రి

three women doing exercise inside gray room
సంతోషంగా ఉండాలంటే హార్మోన్లు ఎందుకు అవసరం Photo by i yunmai on Unsplash

మన భావోద్వేగాలకు హార్మోన్లే కారణం. జీవితంలో సంతోషం అనేది ప్ర‌తి మ‌నిషికి కావాలి. దానికోసం ఎన్నో చేస్తుంటాం. ముఖ్యంగా ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో సుఖం, ఆనందం, స్నేహితులు, బంధువులు, ఇంకా మ‌నం ఏ ప‌నిలోనైనా విజ‌యం సాధించాల‌న్నా ఉండాల్సింది సంతోషం. ఆడ‌వారైనా, మ‌గ‌వారైనా, పెద్ద‌వారైనా, చిన్న‌వారైనా మీ కోపం, ఆనందం ర‌క‌ర‌కాల ఫీలింగ్స్‌ అవి మ‌న శ‌రీరంలో విడుద‌ల‌య్యే హార్మొన్ల స్థాయిని బ‌ట్టి ఉంటాయి. 

ఆనందాన్ని ఇచ్చే హార్మోన్లు మ‌న శ‌రీరంలో విడుద‌ల అయినప్పుడే మ‌నిషి ఆనందంగా ఉండ‌గ‌లుగుతాడు. ప్ర‌స్తుత కాలంలో ర‌క‌ర‌కాల ఆందోళ‌నలు, ఒత్తిడితో గ‌డుపుతున్న రోజుల్లో సంతోషంగా, ప్ర‌శాంతంగా ఉండాలంటే ఈ నాలుగు హార్మోన్లు ఖ‌చ్చితంగా ఉండాల్సిందే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అస‌లు ఈ హార్మోన్ అంటే ఏమిటి? ఇవి మ‌న శరీరంలో ఎలాంటి ప‌నులు చేస్తాయో చూద్దాం.

సంతోష‌క‌ర‌మైన హార్మోన్లు

మ‌న మెద‌డు ఉత్పత్తి చేసే హార్మోన్లను బట్టి మ‌న మూడ్ మారుతుంటుంది. మ‌న శ‌రీరంలో ఉండే ప్ర‌తి భాగంతోనూ ఈ మూడ్ క‌మ్యూనికేట్ అయి ఉంటుంది. మ‌రి ఆ నాలుగు హార్మోన్లు ఏంటి?  వీటివ‌ల్ల ఏం లాభం.

1.డొప‌మైన్:

ఇది మ‌న‌కు సంతోషం క‌లిగిన‌ప్పుడు వెంట‌నే విడుద‌ల‌య్యే హార్మోన్. మెద‌డులో హ్య‌పీ హార్మోన్ అందించే ప్ర‌త్యేక‌మైన న్యూరోట్రాన్స్‌మీట‌ర్ ఉంటుంది. మ‌నం ఏదైనా  అనుకున్న ప‌ని సాధించినపుడు దాని ద్వారా మ‌నం సంతోషంగా ఉన్న‌ప్పుడు ఈ హార్మోన్ విడుద‌ల రెట్టింపు స్థాయిలో ఉంటుంది. దానివల్ల మీ సంతోషాన్ని మ‌ళ్లి మళ్లి రెట్టింపు చేసుకోవ‌డానికి మంచి ఉత్ప్రేర‌కాన్ని అంద‌చేస్తుంది. మీరు మొబైల్‌లో వీడియోలు చూసినా, పాట‌లు విన్నా, బోర్ కొట్ట‌దు. ఇది మీ మెద‌డుకు అల‌వాటు అయిపోతుంది. కానీ ఈ అల‌వాటు వ‌ల్ల మ‌న మెద‌డు చురుగ్గా ప‌నిచేయ‌దు.

ఆరోగ్య‌వంతమైన డోప‌మైన్ కోసం:

రోజూ నిద్ర‌పోయే ముందు మ‌రుస‌టి రోజూ ఏం చేయాల‌న్న‌ది ఒక ప్ర‌ణాళిక రూపోందించుకోవాలి. మ‌నం అనుకున్న‌ది ప్లానింగ్ ప్ర‌కారం జ‌రిగేలా చేసుకోవాలి. అప్పుడు అది ఆరోగ్య‌క‌ర‌మైన డోప‌మైన్‌గా రెట్టింపు  అవుతుంది.

2. సెర‌టోనిన్:

మ‌న‌లో చాలామంది ఆందోళ‌న, డిప్రెష‌న్ ఇలాంటి వాటికి లోన‌వుతూ ఉంటారు. క‌నుక ఇలాంటి వాటిని దరిచేర‌కుండా కాపాడేది ఈ హార్మోన్. మ‌న‌ల్ని ప్ర‌శాంతంగా ఉంచేందుకు ఈ హార్మోన్ చాలా అవసరం. దీనినే ఫీల్ గుడ్ హార్మోన్ అని కూడా అంటారు. ఎవ‌రికైనా సాయం చేయ‌డం, అందుకున్న సాయానికి ధన్యవాదాలు తెలపడం, తగినంత నిద్ర, వ్యాయామం వంటివన్నీ సెరోటోనిన్ స్థాయిల‌ను రెట్టింపు చేస్తాయి.

3. ఆక్సిటోసిన్: 

దీనినే ల‌వ్ హ‌ర్మోన్ అని కూడా అంటారు. మ‌నం చూపే ప్రేమ అంటే పిల్ల‌లు, ప్రేమికులు, భార్యాభ‌ర్త‌ల మీద, పెంపుడు జంతువుల ప‌ట్ల చూపే ప్రేమ ఈ హార్మోన్ ద్వారానే జ‌రుగుతాయి. మ‌నం ఇష్ట‌మైన వారిని ముట్టుకోవ‌డం వ‌ల్ల కూడా ఈ హార్మోన్ పెరుగుతుంది.

మ‌ఖ్యంగా ఇష్ట‌మైన వారితో ఎక్కువ స‌మ‌యం గ‌డ‌పాలి. అంతేకాకుండా మ‌న‌ల్ని మ‌నం ఆనందంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఇష్ట‌మైన మ్యూజిక్ విన‌డం, ఇష్ట‌మైన ప‌నులు చేయడం ద్వారా ఈ హార్మోన్ పెంచుకోవ‌చ్చు. అలాగే న‌లుగురితో క‌లిసి ఉండ‌డం వంటివి చేయాలి.

4. ఎండార్ఫిన్:

ఈ హ‌ర్మోన్ మ‌న శ‌రీరంలో వ‌చ్చే నొప్పుల‌ను, ఇంకా భాద‌ల‌ను నివారించేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎలాంటి ఒత్తిడినైనా త‌ట్టుకునేలా చేస్తుంది. ఇది చాలా శ‌క్తివంతంగా ఉంటుంది. ఇది నేచుర‌ల్ పెయిన్ కిల్ల‌ర్ అని అంటారు. మెడిటేష‌న్, సంగీతం, న‌వ్వ‌డం, ఇలాంటివి చేస్తే ఎండోర్ఫిన్ స్థాయిలు పెరుగుతాయి.

ఇలా హాయిగా, సంతోషంగా ఉండండి

  1. ఎప్పుడైనా ఒత్తిడి ఎక్కువ‌గా ఉంది అనుకున్న‌ప్పుడు మ‌నకి ఇష్ట‌మైన వారిని హగ్ చేసుకోండి. 
  2. రోజు మొత్తంలో కొద్దిసేపైనా న‌వ్వండి.
  3. హాస్య వీడియోల‌ను చూడ‌డం మ‌ర‌వ‌కండి.
  4. మీ ఆసక్తిని బ‌ట్టి మీ ప‌నిని ఎంచుకోండి.
  5. తేలికపాటి వ్యాయామం చేయండి.
  6. సానుకూల దృక్పథాన్ని అనుసరించండి.
  7. పొందిన సాయం మరువకండి.
  8. ద్వేషాన్ని వీడి ప్రేమించడం నేర్చుకోండి. 

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version