Home ఎంటర్‌టైన్‌మెంట్‌ This week releases: ఈ వీకెండ్‌లో థియేట‌ర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా...

This week releases: ఈ వీకెండ్‌లో థియేట‌ర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా ఇదే

Red Theater Chair Lot Near White Concrete Pillars
ఈవారం థియేటర్, ఓటీటీ విడుదల Photo by Pixabay on Pexels

This week releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కాబోతున్నాయి. మే   రెండో వారంలో చిన్న చిత్రాలదే హవా న‌డుస్తోంది. దాదాపు 16 సినిమాలు రిలీజ్ అవుతుండ‌గా అందులో ఒక‌టి, రెండు మాత్ర‌మే చెప్పుకోద‌గ్గ సినిమాలుగా ఉన్నాయి. మొత్తంగా ఈ వారం థియేట‌ర్, ఓటీటీలో విడుద‌ల కాబోతున్న సినిమాలేంటో ఇక్క‌డ చూసేయండి.

థియేట‌ర్‌లో విడుద‌ల కాబోయే చిత్రాలు:

ప్రతినిధి-2

నారా రోహిత్ , సిరి లెల్లా  క‌థానాయికులుగా మూర్తి దేవ‌గుప్త‌పు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ప్ర‌తినిధి – 2. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్ష‌కులకు అందించేందుకు స‌న్నాహాలు జరిగినా అనివార్య కార‌ణాల రీత్యా వాయిదా ప‌డింది. ఇప్ప‌డు మే 10వ తేదీన బాక్పాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌నుంది. ఈ సినిమా ప్ర‌తినిధి-1 కి కొన‌సాగింపుగా రూపొందించారు. ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ధారులుగా స‌ప్త‌గిరి, దినేష్ తేజ్, జిషు సేన్ గుప్తా త‌దిత‌రులు న‌టించారు. ‘ఎక్కి కూర్చున్నాడంటే ఐదేళ్లు చెప్పింది చేయాల్సిందే, డిసైడ్‌ చేసుకో, నిన్ను ఎవరు పరిపాలించాలో…’ అంటూ టీజర్లు, ట్రైలర్లతో ఆసక్తి కలిగించారు. ఇందులో నారా రోహిత్ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాడ‌ని ప‌లు స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకుంటాయ‌ని చిత్ర బృందం తెలిపింది. దీనికి సంబంధించి ప్ర‌చార చిత్రాలు కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

కృష్ణమ్మ:

కొర‌టాల శివ నిర్మాతగా వి.వి.గోపాల‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం కృష్ణ‌మ్మ‌. దీనిని యాక్ష‌న్ త‌ర‌హా సినిమాగా రూపొందించారు. ఈ సినిమాలో న‌త్య‌దేవ్ హీరోగా అతీరా రాజ్ జంట‌గా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం  మే 10 వ తేదీన  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై కూడా భారి అంచ‌నాలు నెల‌కొన‌గా సినిమా ట్రైల‌ర్‌పై ఆస‌క్తిని పెంచుతున్నాయి. మంచి కథా స‌న్నివేశాల‌ను రియలిస్టిక్‌గా రూపొందించామని చిత్ర బృందం చెబుతోంది.

కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్:

మనుషులకు, చింపాజీలకు మధ్య జరిగే యుద్థం నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారు. ఇలాంటి క‌థ‌లు ప్రేక్ష‌కుల‌కు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. ఈ త‌ర‌హాలో వ‌చ్చిన చిత్ర‌మే రైజ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్. ఈ ఫ్రాంచైజీ సినిమాలకు క్రేజ్ ఎక్కువ‌గానే ఉంటుంది. ఇప్పుడు ఈ సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రం కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌. ఈ సినిమాకి వెస్‌బాల్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని మే 10వ తేదీన థియేట‌ర్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ఇంగ్లీష్‌తో పాటు వివిధ భాషల్లోనూ విడుదల కానుంది.

క‌థ విష‌యానికి వ‌స్తే సముద్రతీరంలో ఉండే ఏప్స్‌ను పాలిస్తున్న నియంత ప్రాక్సిమస్‌ సీజర్‌.. మనుషుల టెక్నాలజీ అన్వేషించడం తో పాటు, వారిని అంతం చేయాలనుకుంటుంది. తన సేనలతో కలిసి వెంటాడి మరీ కొందరిని చంపేస్తుంది. అన్ని విషయాల్లో తెలివిగా వ్యవహరించే నోవా అనే యువతిని కూడా హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో సీజర్‌ సంతతికి చెందిన చింపాజీ వచ్చి అడ్డుకుంటుంది. ఈ చర్యతో ఆగ్రహించిన ప్రాక్సిమస్‌ సీజర్‌ ఏం చేసింది? నోవా, సీజర్‌ సంతతికి చెందిన చింపాజీ చేసిన పోరాటం ఏంటి? అన్నది కథ.

ఆరంభం:

మోహన్‌ భగత్‌, సుప్రిత సత్యనారాయణ్‌, భూషణ్‌ కళ్యాణ్‌, రవీంద్ర విజయ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ఆరంభం. ఈ చిత్రానికి  అజయ్‌ నాగ్‌ దర్శకత్వం వహించ‌గా ఏవీటీ  ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంద‌ని చిత్ర బృందం తెలిపింది. ఇది కూడా మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

బోడ్కిన్ (ఇంగ్లీష్ వెబ్‌సిరీస్‌) – మే 09

మదర్‌ ఆఫ్‌ ది బ్రైడ్‌ (హాలీవుడ్) – మే 09

థాంక్యూ నెక్ట్స్‌ (వెబ్‌సిరీస్‌) – మే 09

ద రోస్ట్ ఆఫ్ టామ్  బ్రాడీ (ఇంగ్లీష్ సినిమా) – మే 06  

లివింగ్ విత్ లిపార్డ్స్ (ఇంగ్లీష్ సినిమా) – మే 10

అమెజాన్‌ ప్రైమ్ ఓటీటీ రిలీజెస్:

ఆవేశం (మలయాళం) – (తెలుగు డ‌బ్బింగ్) – మే 09

యోధ (హిందీ) – మే 09

మ్యాక్స్‌ట‌న్ హాల్ ( జ‌ర్మ‌న్ సిరీస్ ) – మే 09

జీ5 ఓటీటీ రిలీజెస్:

8 ఏఎం మెట్రో (హిందీ) – మే 10

పాష్ బాలిష్ (బెంగాలీ సిరీస్) – మే 10

డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీ:

ఆల్‌ ఆఫ్‌ అజ్‌ స్ట్రేంజర్స్‌ (హాలీవుడ్‌) – మే 08

సోనీలివ్:  

అన్‌ దేఖీ 3 (హిందీ సిరీస్‌) – మే 10

ఆహా ఓటీటీ :

రోమియో (తమిళ్‌) – మే 10

లయన్స్‌ గేట్‌ప్లే:

ది మార్ష్‌ కింగ్స్‌ డాటర్‌ (హాలీవుడ్) – మే 10

స‌న్ నెక్ట్స్:

ఫ్యూచ‌ర్ పొండాటి (త‌మిళ సిరీస్) – మే 10

జియో సినిమా :

మ‌ర్డ‌ర్ ఇన్ మ‌హిమ్ (హిందీ సిరీస్) – మే 10 

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version