Home న్యూస్ వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయో తెలుసా?

వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయో తెలుసా?

ventilator
Image by Oleksandr Stepura from Pixabay

దేశవ్యాప్తంగా వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకునేముందు ప్రస్తుతం దేశంలో కరోనా పరిస్థితి క్లుప్తంగా చెప్పుకొందాం. జూన్ 15 వ తేదీ నాటికి 3,32,424 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు 9,520 మంది మృతి చెందారు. మొత్తం కేసుల్లో 1,53,106 యాక్టీవ్ కేసులు ఉండగా 1,69,798 మంది డిశ్చార్జ్ అయ్యారు.

గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 11,502 కేసులు నమోదయ్యాయి. 325 మంది మృతి ఒక్కరోజులోనే మరణించారు. ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా 1,07,958 కేసులు ఉండగా 3,950 మంది మృతి చెందారు. 

తమిళనాడులో 44,661 కేసులకు గాను 435 మంది మృతి చెందారు. ఢిల్లీలో 41,182 కేసులు ఉండగా 1,327 మంది మృతి చెందారు. గుజరాత్ లో 23,544 కేసులకు గాను 1,477 మంది మృతి చెందారు.

కేసుల సంఖ్య పెరుగుతోంది. మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు కరోనాకు మందు రాలేదు. కానీ ఎక్కువ మంది శ్వాసపరమైన ఇబ్బందులతో చనిపోతున్నారు. దుస్థితి ఏంటంటే దేశంలో వెంటిలేటర్లు కూడా సరిపడా లేకపోవడమే.

గడిచిన 70 ఏళ్లలో అసలు దేశంలో ఉన్న వెంటిలేటర్ల సంఖ్య ఎంతో తెలుసా? కేవలం 47,481 మాత్రమే. 

వీటిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న వాటి సంఖ్య 17,850 కాగా.. ప్రయివేటు ఆసుపత్రుల్లో ఉన్నవి 29,631. 

కరోనా మన దేశంలో ప్రవేశించాక 50 వేల వెంటిలేటర్లకు భారత దేశం ఆర్డర్ ఇచ్చింది. కానీ కొన్ని మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలంటే ఇంకా సమయం పడుతుంది. 

ఈ నేపథ్యంలో యాక్టివ్ కేసులతో పోల్చినా దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వెంటిలేటర్లు మూడో వంతు కేసులకు కూడా సరిపోవు. 

నిజానికి ఇవి అందరికీ అవసరం రాదు. ఇప్పటివరకు ఉన్న గణాంకాలను బట్టి చూస్తే కేవలం పది శాతం లోపే పాజిటివ్ కేసుల్లో అవసరం పడుతుంది. అలాగే కరోనా కాకుండా ఇతర రోగుల్లో కూడా అత్యవసర పరిస్థితుల్లో ఇవి అందించక తప్పదు. 

మరి నవంబరు నాటికి దేశంలో అత్యధిక కేసులు నమోదవుతాయని ఐసీఎంఆర్ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ల కొరత ఆందోళన కలిగించే అంశం. అనేక కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేవలం వంద లోపే ఉన్నాయి. మొత్తం 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వంద లోపే వెంటిలేటర్లు ఉండగా.. మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 500 లోపే ఉన్నాయి.

వెంటిలేటర్లు ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? (500లకు పైబడి ఉన్న రాష్ట్రాలు)

రాష్ట్రంప్రభుత్వ పరిధిలో వెంటిలేటర్లుప్రయివేటు పరిధిలో వెంటిలేటర్లుమొత్తం వెంటిలేటర్లు
ఆంధ్రప్రదేశ్5781,5022,081
తెలంగాణ5251,9732,498
కర్ణాటక1,7434,8106,553
తమిళనాడు1,9381,9463,884
కేరళ9501,5312,481
మహారాష్ట్ర1,2864,5075,793
మధ్యప్రదేశ్7788461,623
గుజరాత్5041,1171,622
యూపీ1,9075,1297,035
వెస్ట్ బెంగాల్1,9648742,838
రాజస్తాన్1,1761,1532,329
పంజాబ్4481,0771,525
హర్యానా281623904
బిహార్292480771
జార్ఖండ్270393662
ఒడిశా463178641
అసోం429176604
ఉత్తరాఖండ్213383596
ఢిల్లీ610377986
Exit mobile version