Home ఫుడ్ Chicken biryani in telugu: చికెన్‌ బిర్యాని ఎలా చేయాలి?

Chicken biryani in telugu: చికెన్‌ బిర్యాని ఎలా చేయాలి?

chicken biryani
Image: Istock

Chicken biryani in telugu: చికెన్‌ బిర్యాని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి హైదరాబాద్‌ చికెన్‌ దమ్‌ బిర్యాని (chicken biryani dum hyderabad), రెండోది బోన్‌లెస్‌ ‌దమ్‌ బిర్యాని (boneless chicken dum biryani). అవి ఎలా చేయాలో తెలుగులో మీకోసం సమగ్రంగా అందిస్తున్న కథనం ఇది. రెస్టారెంట్లయినా, ఫుడ్‌ పార్శిల్‌ అయినా అత్యధికంగా అమ్ముడుపోయేది చికెన్ బిర్యానీయే. స్విగ్గీ వార్షిక నివేదిక ప్రకారం 2019లో ప్రతి నిమిషానికి సగటున 95 బిర్యానీలు ఆర్డర్ చేశారు.

ఇంట్లోనే రెస్టారెంట్‌ స్టయిల్లో చేసుకుంటే డబ్బు ఆదాతో పాటు నాణ్యత బాగుంటుంది. చికెన్ బిర్యానీ తయారు చేసే విధానం chicken biryani recipe స్టెప్ బై స్టెప్ వివరించడంతో పాటు, తయారీకి కావాల్సిన పదార్థాలు వివరంగా మీకోసం..

బోన్‌ లెస్‌ చికెన్‌ బిర్యానీ (bone less chicken biryani) రెసిపీ, చికెన్ బిర్యానీ విత్ బోన్ (Chicken biryani hyderabad) ఎలా చేయాలో వివరంగా మీ కోసం..

చికెన్ బిర్యానీ chicken biryani బోన్ లెస్ తయారీ విధానం స్టెప్ బై స్టెప్ ఇలా..

1. 750 గ్రాముల బోన్‌లెస్‌ చికెన్‌ (chicken for biryani) తీసుకుని ఉప్పు వేసిన నీటిలో గంటపాటు నానబెట్టాలి. ఇలా చేస్తే ముక్కలు మృదువుగా అవుతాయి. ముక్కలు రబ్బర్‌లా ఉండకుండా ఇలా చేయాలి. దీనికి మరో ఆప్షన్‌ కూడా ఉంది. ఉప్పు నీటిలో నానబెట్టాల్సిన పనిలేకుండా.. పాయింట్‌ 2లో చెప్పినట్టుగా అన్నీ కలుపుకుని రెండు మూడు గంటలు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే మారినేట్‌ అవుతుంది. అప్పుడు కూడా చికెన్‌ మృదువుగా మారుతుంది. ఇదే సమయంలో అరకేజీ బాస్మతి బియ్యం కూడా ఓ గంటసేపు నానబెట్టుకుంటే సమయానికి అందుతుంది.

2. ఉప్పు నీరు తీసేసిన తరువాత కొద్దిగా పసుపు, ఒక టీస్పూన్‌ కారం పొడి, ఒక పావు టీ స్పూన్‌ ఉప్పు, అర టీ స్పూన్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్‌ దనియాల పొడి, ఒక టీ స్పూన్‌ వేయించిన జీలకర్ర పొడి, సగం నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసం వేసి ముక్కలన్నింటినీ చేతితో బాగా కలపాలి.

3. ఇప్పుడు ఒక టే బుల్‌ స్పూన్‌ కార్న్‌ ఫ్లోర్(corn flour), మరొక టేబుల్‌ స్పూన్‌ మైదా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. చికెన్‌ ముక్కలకు కోటింగ్‌లాగా వస్తుంది. కార్న్‌ ఫ్లోర్‌ లేనప్పుడు కేవలం మైదా పిండి గానీ, అదీ లేనప్పుడు కేవలం బియ్యం పిండి గానీ వాడొచ్చు. అయితే పిండి మరీ లూజ్‌గా అయితే కోటింగ్‌ పట్టదు. ఓ ఐదు నిమిషాలు మారినేట్‌ అయ్యేలోపు స్టవ్‌ వెలిగించి మిగిలిన పనులు చేద్దాం రండి.

4. డీప్‌ ఫ్రై కోసం మూకుడు లేదా లోతుగా ఉండే పాన్‌ పెట్టి నూనె వేడెక్కాక మంట తగ్గించి మీడియం ఫ్లేమ్‌ ఉంచి మారినేట్‌ చేసిన చికెన్‌ ముక్కలను నూనెలో వేయాలి. క్రిస్పీగా అయ్యేంతవరకు, ఎర్రగా వేగేంతవరకు ఆగాలి. ఇందుకు కాస్త టైమ్‌ పడుతుంది. క్రిస్పీగా అయ్యాక తీసి ఓ గిన్నెలో పక్కన పెట్టేయండి.

5. మరో పాన్‌ తీసుకుని రెండు టేబుల్‌ స్పూన్ల వంట నూనె, ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి పోయిండి. కొద్దిగా జీలకర్ర, మూడు నాలుగు పచ్చి మిరప ముక్కలు, ఓ నాలుగు వెల్లుల్లి ముక్కల తురుము వేసుకోవాలి. కొద్దిగా వేగాక చిన్నగా తురుముకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. కొద్దిగా వేగాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఓ టమాటో బాగా చిన్నగా కోసి ఇందులో వేయాలి.

6. ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ల కారం పొడి, ఒక టీస్పూన్‌ వేయించిన జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్‌ ధనియాల పొడి, అర టీస్పూన్‌ గరం మసాలా, కొద్దిగా ఉప్పు వేయాలి. బాగా ఫ్రై అయ్యేలా చూడాలి. ఇప్పుడు అర టీ స్పూన్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కూడా వేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకుని అరకప్పు పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి.

7. ఇప్పటికే డీప్‌ ఫ్రై చేసిన చికెన్‌ ముక్కలను ఇందులో వేసి ఈ మసాలా అంతా చికెన్‌ ముక్కలకు పట్టేలా వేయించాలి. కొద్దిగా మంట పెంచుకుని వేయించుకోవాలి. తదుపరి ఓ అర కప్పు(ఇంకా కొద్దిగా తక్కువ) నీటిని పోసుకోవాలి. కలర్‌ అవసరమనుకుంటే ఫుడ్‌ రెడ్‌ కలర్‌ ఓ నాలుగైదు చుక్కలు కలుపుకోవాలి. చివరగా కొత్తి మీర, మరో రెండు కరివేపాకు రెబ్బలు వేయాలి. కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి దింపేయాలి.

8. ఇప్పుడు మరో గిన్నెలో మూడు లీటర్ల నీళ్లు (నీళ్లు ఎక్కవని కంగారు పడకండి) పోసి మరిగించాలి. నీళ్లు మరిగాక నాలుగు చిన్నవి బిర్యానీ ఆకులు, ఓ టీ స్పూన్‌ షాజీర (షాహీ జీర), నాలుగైదు లవంగాలు, నాలుగైదు అనాస పువ్వులు, నాలుగైదు మరాఠీ మొగ్గలు, ఆరేడు యాలకులు, చిన్న జాపత్రి, రెండు దాల్చిన చెక్కల ముక్కలు, అర టీ స్పూన్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, కొంచెం పూదీన, రెండు టీ స్పూన్ల ఉప్పు వేసి నీళ్లు మరిగే వరకు ఆగాలి. రెండు టీ స్పూన్ల నూనె కూడా వేసుకోవాలి. ఇలా వేస్తే చికెన్ బిర్యానీ లో బియ్యం గింజ విడివిడిగా ఉండిపోతుంది.

9. నీళ్లు మరిగాక ఇప్పటికే నానబెట్టి పెట్టుకున్న బాస్మతీ బియ్యాన్ని ఇందులో పోయాలి. బియ్యం 50 నుంచి 60 శాతం ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన బియ్యంలోమూడో వంతు బాగాన్ని మరొక గిన్నె (బిర్యానీ దమ్‌ అయ్యేందుకు అడుగు మందంగా ఉన్న గిన్నె కావాలి)లో ఒక లేయర్‌గా పోసుకోవాలి. ఒక రెండు మూడు నిమిషాలు ఆగాక బియ్యం 70 నుంచి 75 శాతం వరకు ఉడుకుతుంది. ఇందులో సగం భాగాన్ని బిర్యానీ గిన్నెల్లో మరొక లేయర్‌గా వేసుకోవాలి.

10. రెండు లేయర్ల బియ్యం వేశాక ఇప్పటికే ఫ్రై చేసుకున్న చికెన్‌ను మూడో లేయర్‌గా వేయండి. లేయర్‌గా వేసుకునేముందు చికెన్‌ గట్టిపడి ఉంటే చికెన్‌పై కొద్దిగా నీళ్లు చిలకరించండి. ఆ తరువాత లేయర్‌గా వేసుకోండి. మిగిలిన బియ్యం రెండు మూడు నిమిషాల్లో దాదాపు 80 నుంచి 90 శాతం ఉడుకుతుంది. వీటిని ఫైనల్ లేయర్ గా వేయండి.

11. ఒక టేబుల్‌ స్పూన్‌ నెయ్యి, రెండు టేబుల్‌ స్పూన్ల నూనెను బాగా కలిపి మిశ్రమంగా చేసి గిన్నె అంచుల వెంట పోయాలి. కొద్దిగా అన్నంపైన చల్లాలి. కొద్దిగా వేయించిన ఉల్లి రెబ్బలను, కొద్దిగా యాలకుల పొడిని చికెన్‌ బిర్యానీపై వేయాలి. చివరగా ఒక కప్పు నీటిని గిన్నె అంచుల వెంట ఎసరుగా పోయాలి. ఫుడ్‌ కలర్‌ అవసరమనుకుంటే సాఫ్రాన్‌ వాటర్‌ పోయొచ్చు.

12. చికెన్ బిర్యానీ దమ్‌ (Chicken biryani dum) అయ్యేందుకు గిన్నెను సీల్‌ చేయాలి. మైదా పిండి ముద్దను గానీ, గోధుమ పిండి ముద్దను గానీ పొడుగ్గా చేసుకుని దానిని గిన్నె అంచులకు అమర్చి మూత పెట్టేయాలి. ఒక ఏడెనిమిది నిమిషాలు హైఫ్లేమ్‌లో, ఒక ఏడెనిమిది నిమిషాలు సిమ్‌లో దమ్‌ చేసుకోవాలి. దించేసి ఓ పావుగంట అలాగే ఉంచి తరువాత వడ్డించుకోవాలి.

చికెన్‌ బిర్యానీ chicken biryani with bones విత్‌ బోన్స్‌ అయితే ఇలా చేయాలి..

బోన్స్‌తో కూడిన చికెన్‌లో కూడా పైన చెప్పిన ప్రాసెస్‌ చాలావరకు ఉంటుంది. ఇందులో తేడా ఏంటంటే డీప్‌ ఫ్రై కి బదులుగా.. 

ఎ) తొలి లేయర్ లో మారినేటెడ్ చికెన్ వేసి తదుపరి లేయర్ సగం ఉడికిన బిర్యానీ రైస్ వేసి‌ దమ్ చేయడం. లేదా బి) చికెన్‌ కొద్దిగా ఫ్రై చేసుకుని తొలి లేయర్ గా వేసి బిర్యానీ దమ్ చేయడం. లేదా సి) చికెన్‌ కర్రీ ప్రాసెస్ లో 50 శాతం ఉడికిన చికెన్ ను ఒక లేయర్‌గా వేసి, మరో లేయర్లో సగం ఉడికిన బిర్యానీ రైస్ వేయడం, మూడో లేయర్లో చికెన్ వేసి, నాలుగో లేయర్లో సగం ఉడికిన బియ్యం వేయడం. 

చికెన్ బిర్యానీ (chicken biryani making) ఎలా చేయాలో చూద్దాం..

1. 750 గ్రాముల చికెన్‌ మారినేట్‌ చేసుకోవాలి. బిర్యానీ కోసం చికెన్‌ తెచ్చేటప్పుడు బిర్యానీ కట్‌ చికెన్‌ దొరుకుతుంది. అంటే లెగ్‌ పీస్‌లు, బ్రెస్ట్‌ వంటివి మాత్రమే ఇస్తారు. కాస్త ధర ఎక్కువ. చికెన్‌ బాగా కడిగాక తగినంత పసుపు, ఒక టీస్పూన్‌ కారం పొడి, చిటికెడు ఉప్పు, సగం టీ స్పూన్‌ అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం టీ స్పూన్‌ స్పూన్‌ దనియాల పొడి, ఒక టీ స్పూన్‌ వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా నిమ్మరసం వేసి ముక్కలన్నింటినీ బాగా కలపాలి. రెండు మూడు గంటలు మారినేట్‌ చేసుకోవాలి.

2. పైన చెప్పిన ప్రాసెస్‌లో భాగంగా తొలి లేయర్‌లో ఈ మారినేటెడ్‌ చికెన్‌ వేసుకోవాలి. తదుపరి దానిపై 60 శాతం ఉడికిన బిర్యానీ రైస్‌ను వేసి దమ్‌ చేసుకోవాలి. బిర్యానీ రైస్‌ చేసేందుకు పైన చెప్పిన మసాలాలు అన్నీ వేయాలి.

3. మారినేటెడ్‌ చికెన్‌ డైరెక్ట్‌గా తొలిలేయర్‌గా వేస్తే చికెన్‌ సరిగ్గా ఉడకదని భావించే వాళ్లు చికెన్‌ కర్రీలాగా కొద్దిగా ఉడికించుకుని(అంటే ఫ్రై చే యడం ద్వారా) దీనిని తొలి లేయర్‌గా వేసి తరువాత 60 శాతం ఉడికిన బిర్యానీ రైస్‌ను మరో లేయర్‌గా వేసుకుని దమ్‌ చేసుకోవాలి. బిర్యానీ రైస్‌ ఎలా చేయాలో పైన చెప్పిన ప్రాసెస్‌ చదవండి.

చికెన్‌ బిర్యాని (chicken biryani ingredients) కి కావాల్సిన పదార్థాలు

చికెన్‌ డీప్‌ ఫ్రై కోసం కావాల్సిన పదార్థాలు

 బోన్‌ లెస్‌ చికెన్‌ – 750 గ్రాములు
పసుపు – అర టీ స్పూన్‌
 కారం పొడి– 1 టీ స్పూన్,
ఉప్పు – 1/4 టీ స్పూన్‌
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – అర టీ స్పూన్‌
దనియాల పొడి – అర టీ స్పూన్‌
వేయించిన జీలకర్ర పొడి– ఒక టీ స్పూన్‌
నిమ్మకాయ రసం – ఒక టీ స్పూన్‌
వంట నూనె – డీప్‌ ఫ్రై కోసం తగినంత

చికెన్‌ ఫ్రై (డీప్‌ ఫ్రై అయ్యాక టమాటో మసాలా‌చేయడానికి) కోసం కావాల్సినవి

కార్న్‌ఫ్లోర్‌ – ఒక టేబుల్‌ స్పూన్‌(లేనిపక్షంలో బియ్యం పిండి)
మైదా పిండి– ఒక టేబుల్‌ స్పూన్‌(లేనిపక్షంలో బియ్యం పిండి)
వంట నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు
నెయ్యి – ఒక టేబుల్‌ స్పూన్‌
జీలకర్ర – అర టీ స్పూన్‌
పచ్చి మిర్చి– మూడు
వెల్లుల్లి– నాలుగు
ఉల్లిగడ్డ – ఒకటి
కరివేపాకు – రెండు మూడు రెబ్బలు
టమాటో – ఒకటిన్నర
కారం పొడి– ఒకటిన్నర టీ స్పూన్లు
వేయించిన జీలకర్ర పొడి– ఒక టీస్పూన్‌
ధనియాల పొడి– ఒక టీ స్పూన్‌
గరం మసాలా– అర టీస్పూన్‌
ఉప్పు– చిటికెడు
అల్లం వెల్లుల్లి– అర టీ స్పూన్‌
పెరుగు – అరకప్పు
ఫుడ్‌ కలర్‌ – తగినంత
కొత్తి మీర – తగినంత
నిమ్మరసం – కొద్దిగా

బిర్యానీ రైస్‌ (biryani ingredients) తయారీకి కోసం కావాల్సిన పదార్థాలు

బాస్మతీ రైస్‌ – అర కేజీ (కనీసం ఏడాది పాతవైతే మేలు)
 బిర్యానీ ఆకులు – నాలుగు
షాజీర – టీ స్పూన్‌
లవంగాలు – నాలుగైదు
అనాస పువ్వులు– నాలుగు
మరాఠీ మొగ్గలు – నాలుగు
యాలకులు – ఆరేడు
చిన్న జాపత్రి – కొద్దిగా
దాల్చిన చెక్క – రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – అర టీ స్పూన్‌
కొత్తిమీర – కొద్దిగా
పూదీన– కొద్దిగా
ఉప్పు –రెండు టీ స్పూన్లు
నూనె– రెండు టీ స్పూన్లు
నెయ్యి– ఒక టేబుల్‌ స్పూన్‌
వంట నూనె(చివర్లో వేసేందుకు) – రెండు టేబుల్‌ స్పూన్లు
వేయించిన ఉల్లి రెబ్బలు– తగినంత
యాలకుల పొడి– తగినంత
సీల్‌చేసేందుకు– మైదా లేదా గోధుమ పిండి

చికెన్‌ డీఫ్‌ ఫ్రైకి బదులు నేరుగా దమ్ చేయడం, లేదా కర్రీలా ఉడికించి లేయర్ గా వేసుకోవాల్సి వస్తే కార్న్‌ ఫ్లోర్‌ వంటివి అవసరం లేదు. మిగిలినవన్నీ వాడుకోవచ్చు.

చికెన్ బిర్యానీ ఒకసారి చేసి తిన్నాక, మసాలాలు ఎక్కువైనట్టు అనిపిస్తే తగ్గించుకోండి. చికెన్‌ బిర్యానీకి తోడు మసాలా క్యాప్సికమ్‌ లేదా మసాలా టమోటా, రైతాతో కలిపి తింటే అదుర్స్‌..

– రెసిపీ : నవీన , హైదరాబాద్

ఇవీ చదవండి:

Exit mobile version