Home ఎంటర్‌టైన్‌మెంట్‌ Weekend Releases: ఈ వీకెండ్ థియేట‌ర్, ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న సినిమాలివే!

Weekend Releases: ఈ వీకెండ్ థియేట‌ర్, ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న సినిమాలివే!

ott releases
ఈవారం ఓటీటీ సినిమాలు "Dabba TV will become smart! This new device has arrived, in just Rs 3000" by quickspice is licensed under CC BY 2.0

Weekend OTT, Theatre Releases: ఈ వీకెండ్, అంటే మే మొద‌టి వారంలో థియేటర్, ఓటీటీల్లో పలు కొత్త చిత్రాలు సందడి చేయనున్నాయి. థియేటర్ రిలీజెస్, ఓటీటీ స్ట్రీమింగ్ మూవీస్, వెబ్‌సిరీస్ గురించి ఇక్కడ తెలుసుకోండి.

థియేటర్‌లో విడుద‌ల‌వుతున్న మూవీస్:

1. ఆ ఒక్కటీ అడక్కు:

అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా ఫ‌రియా అబ్దుల్లా క‌థానాయిక‌గా న‌టించిన చిత్రం ఆ ఒక్క‌టీ అడ‌క్కు.  మే 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మ‌ల్లి అంకం ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా రాజీవ్ చిల‌క నిర్మించారు. విభిన్న క‌థాంశంతో వస్తున్న ఈ మూవీలో అల్ల‌రి న‌రేష్ త‌న కామెడీతో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల‌ను న‌వ్వులతో క‌ట్టిప‌డేయ‌నున్నారు.

2. ప్రసన్న వదనం:

సుహాస్‌ కీలక పాత్రలో అర్జున్‌ వై.కె. దర్శకత్వంలో రూపొందిన చిత్రం ప్రసన్న వదనం. థ్రిల్ల‌ర్ సినిమాల‌లో ఇదొక భిన్న‌మైన సినిమాగా తెర‌కెక్కించిన్న‌ట్లు టీజర్లు, ట్రైలర్ల ద్వారా తెలుస్తోంది.  దీనిలో ప్ర‌ధాన పాత్ర‌లుగా రాశీ సింగ్, పాయ‌ల్ రాధాకృష్ణ న‌టిస్తున్నారు. ఇందులో మూడు మ‌ర్డ‌ర్ కేసుల్లో ఇరుక్కున్న ఒక అబ్బాయి బ్లైండ్‌నెస్‌తో బాధ‌ప‌డుతుంటాడు. మ‌రి ఆ అబ్బాయి ఆ కేసులో ఎలా ఇరుక్కున్నాడు? అస‌లైన హంత‌కుడిని చ‌ట్టానికి అప్ప‌గించ‌గ‌లిగాడా? అనేదే అస‌లు క‌థ‌. ఈ క‌థ‌కు జె.ఎస్.మ‌ణికంఠ‌, టి. ఆర్. ప్ర‌సాద్ రెడ్డి  క‌లిసి నిర్మించారు. ఈ చిత్రం మే 3న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

3. శబరి:

వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ప్రధాన పాత్రలో అనిల్‌ కాట్జ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శబరి. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న ప్రేక్షకుల ముందుకురానుందీ చిత్రం. బిడ్డ కోసం తల్లి ప‌డే త‌ప‌న ఎలా ఉంటుందో చూపించే ఒక సైకలాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా ఉంటుంద‌ని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రం కూడా మే 3 న ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. మ‌హేంద్ర‌నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది ఒక్క తెలుగులోనే కాకుండా త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో  ప్రేక్ష‌కుల అల‌రించ‌నుంది.

4. జితేందర్‌రెడ్డి:

ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ జితేందర్‌రెడ్డి. ఈ చిత్రంలో క‌థానాయికుడిగా రాకేష్ వ‌ర్రే న‌టించారు. ఈ చిత్రాన్ని మే 3 న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

5. బాక్(baak):

త‌మ‌న్నా, రాశీ ఖ‌న్నా క‌థానాయికులుగా సుంద‌ర్ సి ప్రధాన పాత్ర‌గా న‌టించిన చిత్రం బాక్. ఇది హార‌ర్ కామెడీ చిత్రం. ఏప్రిల్ 26 న విడుద‌ల కావాల్సి ఉండగా, కానీ కొన్ని కార‌ణాల రీత్యా మే 3న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇందులో వెన్నెల కిషోర్, కోవై స‌ర‌ళ‌, త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లుగా న‌టించునున్నారు.

ఈ వారం ఓటీటీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు:

అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ:

ది ఐడియా ఆఫ్‌ యూ (హాలీవుడ్‌) –  మే 2 

అంబ‌ర్ గ‌ర్ల్స్ స్కూల్ (హిందీ సినిమా) – మే 01

ది ఐడియా ఆఫ్ యూ (ఇంగ్లీష్ సినిమా) – మే 02

క్లార్క్‌స‌న్ ఫార్మ్ సీజ‌న్ 3 (ఇంగ్లీష్) – మే 03

ఉమ‌న్ ఆఫ్ మై బిలియ‌న్ (ఇంగ్లీష్ డాక్యుమెంట‌రీ) – మే 03

డిస్నీ+హాట్‌స్టార్‌ ఓటీటీ:

ది వీల్‌ (వెబ్‌సిరీస్‌)  – ఏప్రిల్‌ 30 

మంజుమ్మ‌ల్ బాయ్స్ – (తెలుగు డ‌బ్బింగ్ సినిమా) – మే 05

మాన్‌స్ట‌ర్స్ ఎట్ వ‌ర్క్ సీజ‌న్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మే 05

నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీ:

డియర్‌ (తమిళ/తెలుగు) –  ఏప్రిల్ 28 

హీరామండి (హిందీ సిరీస్‌) – మే 1 

సైతాన్‌ (హిందీ)  – మే 3 

ది ఎటిపికల్‌ ఫ్యామిలీ (కొరియన్‌) –  మే 4 

ఫియాస్కో – (ఫ్రెంచ్ సిరీస్) –  ఏప్రిల్ 30

టి పి బ‌న్ (జ‌ప‌నీస్ సిరీస్) – మే 02

జియో సినిమా ఓటీటీ:

హాక్స్ సీజ‌న్ 3 (ఇంగ్లీష్ సినిమా ) –  మే 3 

వోంకా (హాలీవుడ్‌) –  మే 3 

ది టాటూయిస్ట్‌ ఆఫ్‌ ఆష్‌విజ్‌ (వెబ్‌సిరీస్‌)  – మే 3

మైగ్రేష‌న్ (ఇంగ్లీష్ సినిమా ) – మే 01

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version