Home స్కిల్స్ హౌజింగ్ వెబ్‌సైట్స్ .. కొనుగోలు నుంచి రిపేర్ల వరకూ

హౌజింగ్ వెబ్‌సైట్స్ .. కొనుగోలు నుంచి రిపేర్ల వరకూ

housing websites
Image by Harry Strauss from Pixabay

హౌజింగ్ వెబ్ సైట్స్ ఎంతగా ఉపయోగపడతాయంటే కొత్తగా ఇల్లు, స్థలం, ఫ్లాట్ ఏదీ కొనాలన్నా, లేదా అద్దెకు తీసుకోవాలన్నా అరచేతిలో సమాచారం అందిస్తాయి. అలాగే ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ మీకు వివరిస్తాయి. త్రీడీ చిత్రాలు, వీడియోలతో కళ్లకు కట్టేలా మీ ముందుంచే రియల్‌ ఎస్టేట్‌ వెబ్ సైట్స్‌, యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి హౌజింగ్ వెబ్‌సైట్స్ డియర్ అర్బన్ డాట్ కామ్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.

99ఎకర్స్‌ (99Acres)

ఇండియాలోని పాపులర్‌ రియల్‌ ఎస్టేట్‌ సైట్స్‌లో ఈ 99 ఎకర్స్‌ ముందు వరసలో ఉంటుంది. హైదరాబాద్‌ వంటి మెట్రో పాలిటన్‌ నగరాలతోపాటు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో అందుబాటులో ఉన్న ఇళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వెబ్‌సైట్‌లో ఉంది. చిన్న ఇండిపెండెంట్‌ ఇల్లు నుంచి అపార్ట్‌మెంట్‌, విల్లా, ఇతర కమర్షియల్‌ ప్రాపర్టీల వరకు చాలా ఆప్షన్స్‌ 99 ఎకర్స్‌లో ఉన్నాయి. ఏదైనా ప్రాపర్టీని అమ్మాలన్నా, కొనాలన్నా, అద్దెకు తీసుకోవాలన్నా ఈ సైట్‌ బెస్ట్‌ ఆప్షన్‌.

మధ్య తరగతి వాళ్లు కోరుకునే సాధారణ ఇంటితోపాటు.. అన్ని హంగులూ ఉండే లగ్జరీ ఇళ్ల వరకూ వేల కొద్దీ ఆప్షన్స్‌ ఇందులో ఉన్నాయి. ఇక హోమ్‌లోన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ఈ సైట్‌ అందిస్తోంది. మీకు కావాల్సిన లోన్‌, అది తీర్చడానికి గడువు, మీ వయసు ఎంటర్‌ చేస్తే.. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బ్యాంకుల వివరాలు, వాటి వడ్డీ, ప్రాసెసింగ్‌ ఫీజులాంటి సమగ్ర సమాచారాన్ని మీ ముందు పెడుతుంది. 99 ఎకర్స్‌ అధికారిక వెబ్‌సైట్‌ ఇక్కడ క్లిక్ చేయండి

మ్యాజిక్‌బ్రిక్స్‌ (MagicBricks)

పాపులర్ హౌజింగ్ వెబ్‌సైట్స్ లో మ్యాజిక్‌ బ్రిక్స్‌ ఒకటి. ఓ ప్రాపర్టీని అమ్మాలన్నా, కొనాలన్నా, అద్దెకు తీసుకోవాలన్నా.. అందుకు సంబంధించిన పూర్తి సేవలను మ్యాజిక్‌ బ్రిక్స్‌ అందిస్తోంది. లొకేషన్‌ ఆధారంగా మీ ఆఫీస్‌ దగ్గర్లో అద్దెకు లభించే ఇళ్ల వివరాలతోపాటు అక్కడ అందుబాటులో ఉన్న ఏజెంట్ల గురించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు కోసం హోమ్‌ లోన్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా ఈ సైట్‌లో ఉంది. లొకేషన్‌, ప్రాపర్టీ టైప్‌, మీ బడ్జెట్‌ చెబితే మీ దగ్గర్లో ఆ రేంజ్‌లో ఉన్న ఇళ్ల వివరాలన్నీ మ్యాజిక్‌బ్రిక్స్‌ చూపిస్తుంది. అలాగే మీ ఆస్తిని అమ్మాలన్నా, అద్దెకు ఇవ్వాలన్నా కూడా  ఆ వివరాలను ఉచితంగా ఇందులో పోస్ట్‌ చేసుకోవచ్చు. మ్యాజిక్ బ్రిక్స్ వెబ్ సైట్ కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

హౌజింగ్‌ (Housing)

ప్రాపర్టీ అమ్మకం, కొనుగోళ్లలో అత్యధిక శాతం సక్సెస్‌ రేటు సాధించిన ఘనత ఈ హౌజింగ్‌ సైట్‌ సొంతం. అన్ని ప్రాపర్టీలకు సంబంధించి కచ్చితమైన సమాచారం ఇందులో ఉంటుందన్న పేరుంది. ఇండియాలోనే కాదు.. విదేశాల్లో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా కూడా హౌజింగ్‌ అవకాశం కల్పిస్తోంది. పైగా అప్పుడప్పుడూ షాపింగ్‌ వెబ్‌సైట్లలాగే మెగా హోమ్‌ ఉత్సవ్‌ పేరుతో ఆఫర్లు కూడా ఇస్తుంటుంది.

ఇక మీరు ఉంటున్న నగరంలో ఎప్పటికప్పుడు ఆస్తుల విలువలో మార్పులకు సంబంధించిన సూచీ కూడా హౌజింగ్‌ సైట్‌లో అందుబాటులో ఉంది. https://housing.com/

ఓఎల్‌ఎక్స్‌ హోమ్స్‌ (OLX Homes)

దేశంలోనే అతి పెద్దదైన ఫ్రీ క్లాసిఫైడ్స్‌ వెబ్‌సైట్‌ ఓఎల్‌ఎక్స్. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనూ అడుగుపెట్టింది. పాత వస్తువులను ఎలాగైతే ఓఎల్‌ఎక్స్‌లో పెట్టి అమ్మడం, కొనడం చేస్తున్నారో.. ప్రాపర్టీ విషయంలో ఓఎల్‌ఎక్స్‌ హోమ్స్‌ కూడా అంతే. పెద్ద నగరాలతోపాటు ఇండియాలోని ఏ లొకేషన్‌లో ఉన్న ప్రాపర్టీ వివరాలనైనా ఇందులో తెలుసుకోవచ్చు.

అలాగే మీరు అమ్మాలనుకున్న, అద్దెకు ఇవ్వాలనుకున్న ప్రాపర్టీ వివరాలను ఓఎల్‌ఎక్స్‌ హోమ్స్‌లో అప్‌లోడ్‌ చేయొచ్చు. వెబ్ సైట్ చిరునామా ఇదీ.. https://www.olx.in/items/q-house

క్వికర్‌ హోమ్స్‌ (Quickr Homes)

పాత వస్తువుల అమ్మకం, కొనుగోళ్ల కోసం ఉద్దేశించిన క్వికర్‌ కూడా.. ఓఎల్‌ఎక్స్‌లాగే రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి దిగింది. నగరాల్లో పేయింగ్‌ గెస్ట్‌లుగా ఉండాలనుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులకు ఈ వెబ్‌సైట్‌ మంచి ఆప్షన్‌. మీరుంటున్న నగరంలో పేయింగ్‌ గెస్ట్‌ రూమ్స్‌ ఎక్కడెక్కడ ఉన్నాయన్న సమాచారం క్వికర్‌ అందిస్తోంది. వీటితోపాటు మీ బడ్జెట్‌కు తగినట్లుగా ఏదైనా ప్రాపర్టీ అమ్మకం, కొనుగోలు, అద్దెకు సంబంధించిన సమాచారాన్ని సులువుగా వెతుక్కోవచ్చు. https://www.quikr.com/homes

హౌజింగ్ వెబ్‌సైట్స్ లో మరికొన్ని

కామన్‌ ఫ్లోర్ (‌https://www.commonfloor.com/),

సులేఖా ప్రాపర్టీస్ (http://property.sulekha.com/)‌,

మకాన్‌ (https://www.makaan.com/),

ప్రాప్‌టైగర్‌ (https://www.proptiger.com/),

స్క్వేర్‌యార్డ్స్‌ (https://www.squareyards.com/) వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి.

ఆన్‌లైన్‌ ఫర్నీచర్‌

ఇల్లు కొనుగో్లు చేయడమో, అద్దెకు తీసుకోవడమో అయ్యాక అందులోకి అవసరమయ్యే ఫర్నిచర్ ను కూడా ఆన్ లైన్ లో ఎంపిక చేసుకోవచ్చు. పెద్ద పెద్ద మంచాలు, బీరువాలు, సోఫా సెట్లు మార్కెట్‌కు వెళ్లి కొనడం ఒకెత్తయితే.. వాటిని ఇంటికి తీసుకురావడం మరో ఎత్తు. మీకు ఆ ఇబ్బంది లేకుండా ఇంట్లో కూర్చొన్న చోటుకే మీరు కోరుకున్న ఫర్నీచర్‌ను డెలివరీ చేయడానికి కూడా ఎన్నో ఆన్‌లైన్‌ స్టోర్స్‌ ఉన్నాయి. వీటిలో మీకు నచ్చింది ఎంపిక చేసుకోవడానికి కొన్ని వేల వెరైటీలు అందుబాటులో ఉంటాయి. పైగా ఇంటికే తెచ్చిస్తారు. ఫ్రీ షిప్పింగ్‌ ఆఫర్లు కూడా ఉంటాయి.

పెప్పర్‌ఫ్రై (Pepperfry)

ఇండియాలోనే అతి పెద్దదైన ఆన్‌లైన్‌ ఫర్నీచర్‌, హోమ్‌ డెకార్‌ స్టోర్‌ ఇది. ముంబైలో ప్రధాన కార్యాలయం ఉంటుంది. హైదరాబాద్‌ సహా దేశంలోని ప్రముఖ నగరాలకు ఫర్నీచర్‌ను డెలివరీ చేస్తారు. సోఫాలు, కుర్చీలు, టేబుల్స్‌లాంటి ఫర్నీచర్‌తోపాటు హోమ్‌ డెకరేషన్‌కు సంబంధించిన ఐటమ్స్‌, కిడ్స్‌ రూమ్ ఐటమ్స్‌, ఇంటీరియర్‌ డిజైన్‌, ల్యాంప్స్‌లాంటివన్నీ ఇందులో దొరుకుతాయి. ఆరున్నర లక్షలకుపైగా ప్రోడక్ట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఏ ప్రోడక్ట్‌ కొన్నా ఉచితంగా ఇంటికి తెచ్చిస్తారు. ఇదీ వెబ్‌సైట్‌ https://www.pepperfry.com/

వుడెన్‌ స్ట్రీట్‌ (Wooden Street)

టాప్‌ ఆన్‌లైన్‌ ఫర్నీచర్‌ వెబ్‌సైట్స్‌లో ఇదీ ఒకటి. అన్ని రకాల ఫర్నీచర్‌ లభించడంతోపాటు దీనికో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే.. సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఇంటికి కావాల్సిన ఫర్నీచర్‌ ప్యాకేజీలను వుడెన్‌ స్ట్రీట్‌ అందిస్తోంది. అంటే మంచం, బెడ్‌, దాని పక్కన ఉండే టేబుల్‌, సోఫా సెట్‌, డైనింగ్‌ సెట్‌, షూ రాక్‌, టీవీ టేబుల్‌లాంటివన్నీ ఈ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. మీ రేంజ్‌ను బట్టి లక్షా 20 వేల నుంచి రెండు లక్షల 20 వేల వరకు ఈ ప్యాకేజీలు ఉంటాయి. దీనికి అదనంగా ఫ్రీ షిప్పింగ్, ఫ్రీ అసెంబ్లింగ్‌, డిస్కౌంట్లు, పండుగ ఆఫర్లు అందిస్తోంది. https://www.woodenstreet.com/

డ్రీమ్స్‌ఫర్నీచర్‌ (Dreamzz Furniture)

మీ ఇంట్లోకి ఎలాంటి ఫర్నీచర్‌ సూట్‌ అవుతుందో తేల్చుకోలేకపోతున్నారా? అయితే ఈ డ్రీమ్స్‌ ఫర్నీచర్‌ కస్టమర్‌ సర్వీస్‌ టీమ్‌కు మీ ఇంటి ఫొటోలు తీసి పంపించండి. మీకున్న స్థలంలో ఏ ఫర్నీచర్‌ అతికినట్లు సరిపోతుందో వాళ్లు చెబుతారు. మిగతా సైట్లలాగే ఇందులోనూ వేల ప్రోడక్ట్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా షిప్పింగ్, అసెంబ్లీ ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ముంబైకి చెందిన ఈ కంపెనీ ఇండియా మొత్తం ఫ్రీ హోమ్‌ డెలివరీ చేస్తోంది. https://www.dreamzzfurniture.com/. ఈ సంస్థ సర్వీసుపై కస్టమర్లు వందకు వంద శాంత సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం.

ఇవే కుండా https://www.urbanladder.com/,

https://www.hometown.in/,

https://inliving.com/ లాంటి ఎక్స్‌క్లూజివ్‌ ఫర్నీచర్‌ వెబ్‌సైట్లలోనూ కొనుగోలు చేయొచ్చు.

ఇక  రెగ్యులర్‌ షాపింగ్‌ సైట్స్‌ అయిన ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, స్నాప్‌డీల్‌, హోమ్‌షాప్‌18లాంటి వెబ్‌సైట్లలోనూ ఫర్నీచర్‌ అందుబాటులో ఉంది.

రిపేర్లు ఇతర సేవలు..

ఇల్లూ, ఫర్నిచర్ కొన్నారు సరే.. ఏవైనా రిపేర్లు అవసరమైతే? ఏవైనా ఇతర సేవలు అవసరమైతే ఏంచేయాలి.. అవన్నీ అందుబాటులోకి తెచ్చిన ఈ కామర్స్ వెబ్ సైట్ల వివరాలు ఇక్కడ డియర్అర్బన్ డాట్ కామ్ అందిస్తోంది.

మీ ఇంటికి రంగు వేయాలన్నా.. ఇంట్లో ఏవైనా రిపేర్లు చేయాలన్నా.. మీరు తెచ్చుకున్న ఫర్నీచర్‌ను బిగించాలన్నా.. మీ కంప్యూటర్‌ను బాగు చేయాలన్నా.. ఇలా అన్ని సర్వీసులను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకోవచ్చు.

ఇంటి మెయింటెనెన్స్‌.. అంటే ప్లంబర్స్‌, కార్పెంటర్స్‌, ఎలక్ట్రీషియన్స్‌లాంటి సర్వీసులు కావాలంటే ఇప్పుడు క్షణాల్లో ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. చాలా వరకు హైదరాబాద్‌లాంటి మెట్రో నగరాల్లో చిన్న చిన్న ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్స్‌లాంటి వాళ్లను వెతికి పట్టుకోవడం కష్టం. కంప్యూటర్‌, ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషీన్ల రిపేర్లు.. ఇంట్లో వాటర్‌ ట్యాంక్‌, సెప్టిక్‌ ట్యాంక్‌లాంటి క్లీనింగ్స్‌.. యోగా, ఫిజియో థెరపీ, ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌లాంటి హెల్త్‌ సర్వీసులు.. ఇలా ఒకటేమిటి.. ఏం కావాలన్నా అందించడానికి ఈ-కామర్స్‌ సైట్స్‌ ఉన్నాయి.

బ్రో4యు (bro4U)

అన్ని రకాల సేవలను అందించే ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ ఇది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఇంట్లో అవసరమైన అన్ని సర్వీసులను అందిస్తుంది. ఏ సర్వీసుకైనా మంచి శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్‌ను పంపిస్తారు. లాండ్రీ, కార్పెంటర్స్‌, ఏసీ రిపేర్‌, హౌజ్‌ క్లీనింగ్‌, పెయింటెర్స్‌, ప్లంబర్స్‌.. ఇలా మీకు కావాల్సిన సర్వీసులన్నీ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌ సహా బెంగళూరు, ముంబై, పుణె నగరాల్లో ఈ సంస్థ సర్వీసులు అందిస్తోంది. బిజినెస్‌ టు కస్టమర్‌ సర్వీసులే కాదు.. బిజినెస్‌ టు బిజినెస్‌ సర్వీసులు కూడా ఇస్తుంది. అంటే మీ ఆఫీస్‌ మెయింటెనెన్స్‌ కూడా చేస్తుంది. దీనికి సంబంధించిన యాప్‌ కూడా ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌, గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది.

హౌజ్‌జాయ్‌ (housejoy)

ఇంట్లోకి రొటీన్‌గా కావాల్సిన ప్లంబింగ్‌, కార్పెంట్రీ, ఎలక్ట్రికల్‌, పెయింటింగ్‌, క్లీనింగ్‌లాంటి సర్వీసులతోపాటు ఇంటికే సెలూన్‌ సర్వీస్‌ను కూడా తీసుకురావడం ఈ హౌజ్‌జాయ్‌ ప్రత్యేకత. హెయిర్‌ కటింగ్‌తోపాటు అన్ని రకాల బ్యూటీ ప్యాకేజీలు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

ఫేషియల్స్‌, పెడిక్యూర్‌, మానిక్యూర్‌, బాడీ స్పాలాంటి సర్వీసులను ఈ ఈ-కామర్స్‌ సైట్‌ అందిస్తోంది. ఇంటి నిర్మాణంతోపాటు ఇంటీరియర్‌, రెనొవేషన్‌లాంటి రంగాల్లో కూడా ఈ సంస్థ తన సేవలను విస్తరించింది. హైదరాబాద్‌ సహా చెన్నై, ఢిల్లీ, ముంబై, బెంగళూరులాంటి మెట్రో నగరాల్లో ఈ సంస్థ తన సేవలను అందిస్తోంది.

అర్బన్‌క్లాప్‌ (urbanclap)

ఇంటికే సెలూన్‌ సేవలతోపాటు మసాజ్‌ సర్వీస్‌నూ అందించే సంస్థ ఇది. ఫిట్‌నెస్‌, యోగాకు సంబంధించిన సర్వీసులు కూడా ఈ అర్బన్‌క్లాప్‌ ప్రత్యేకత. అంతేకాదు పెళ్లిళ్ల కోసం ప్రత్యేకంగా మేకప్‌ ఆర్టిస్టులు, ఫొటోగ్రాఫర్లు, మెహెందీ ఆర్టిస్ట్‌లను కూడా పంపిస్తుంది. మొత్తం వందకుపైగా సేవలను అందిస్తోంది. అర్బన్‌క్లాప్‌ పేరుతో యాప్‌ కూడా అందుబాటులో ఉంది. హైదరాబాద్‌తోపాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ సంస్థ తన సేవలు అందిస్తుండటం విశేషం. ఈ సంస్థ వెబ్‌సైట్‌ చిరునామా  https://www.urbanclap.com/.

జస్ట్‌ఫిక్స్‌ (justfix)

ఇంటికి కావాల్సిన అన్ని సర్వీసులను అందించే మరో ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఇది. ప్రతి సర్వీసుకూ శిక్షణ పొందిన ప్రొఫెషనల్స్‌ అందుబాటులో ఉంటారు. ఏ సర్వీస్‌కు ఎంత వసూలు చేస్తారన్నది ఈ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో వివరంగా చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

Exit mobile version