Home ఫుడ్ Breakfast recipes with Oats: ఓట్స్‌తో 5 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు.. చేయడం చాలా సులువు

Breakfast recipes with Oats: ఓట్స్‌తో 5 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు.. చేయడం చాలా సులువు

oatmeal
ఓట్స్‌తో పలు బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు సులువుగా చేయొచ్చు (Pexels)

Breakfast recipes with Oats: రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కొత్తగా చేయడం చాలా కష్టమైన పని. ఓట్స్‌తో 5 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు చేయొచ్చు. పైగా సులువు కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరూ ట్రై చేయండి.

  1. ఓవర్‌నైట్ ఓట్స్: 1/2 కప్పు రోల్‌డ్ ఓట్స్‌ను 1/2 కప్పు పాలు లేదా యోగర్ట్, అలాగే మీకు నచ్చిన 1/2 కప్పు పండ్ల ముక్కలతో కలపండి. దీనిని రాత్రిపూట రిఫ్రిజిరేటర్‌లో పెట్టండి. ఉదయం రుచికరమైన, పోషకాలతో కూడిన అల్పాహారాన్ని ఆస్వాదించండి.
  2. బనానా ఓట్ పాన్‌కేక్‌లు: బాగా పండిన ఒక అరటి పండును మెత్తగా చేసి, 1/2 కప్పు రోల్డ్ ఓట్స్, 1 గుడ్డు, 1/4 కప్పు పాలు, 1/2 టీస్పూన్ బేకింగ్ పౌడర్‌తో కలపండి. నాన్-స్టిక్ పాన్‌లో ఉడికించి, మీకు ఇష్టమైన టాపింగ్స్‌తో ఆస్వాదించండి.
  3. యాపిల్స్, దాల్చినచెక్కతో ఓట్‌మీల్: 1/2 కప్పు రోల్డ్ ఓట్స్ 1 కప్పు నీరు లేదా పాలతో ఉడికించాలి. దాని పైన తరిగిన యాపిల్స్, దాల్చిన చెక్క, తేనె లేదా మాపుల్ సిరప్ డ్రాప్స్ వేయండి. చాలా రుచికరంగా ఉంటుంది.
  4. ఓట్‌మీల్ బ్రేక్‌ఫాస్ట్ బార్‌లు: 2 కప్పుల రోల్డ్ ఓట్స్, 1 అరటి పండు గుజ్జు, 1/4 కప్పు తేనె, 1/4 కప్పు ఏవైనా నట్స్ (చిన్న ముక్కలుగా చేసుకోవాలి) కలపండి. బేకింగ్ డిష్‌లో పెట్టి 350 ° ఫారిన్ హీట్ ఉష్ణోగ్రత వద్ద 20-25 నిమిషాలు వేడి చేయండి. బార్‌లుగా కట్ చేసి బ్రేక్‌ఫాస్ట్‌గా ఆరగించండి.
  5. ఓట్‌మీల్ స్మూతీ: 1/2 కప్పు రోల్డ్ వోట్స్, 1 అరటిపండు, 1/2 కప్పు పాలు లేదా పెరుగు, మీకు నచ్చిన 1/2 కప్పు పండ్లను కలిపి బ్లెండ్ చేయండి. రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్‌గా ఈ ఓట్ మీల్ స్మూతీని ఆస్వాదించండి.
Exit mobile version