Home ఫుడ్ స‌మ్మ‌ర్ స్పెష‌ల్ బ‌నానా మిల్క్ షేక్  ఇలా ఈజీగా ఇంట్లోనే

స‌మ్మ‌ర్ స్పెష‌ల్ బ‌నానా మిల్క్ షేక్  ఇలా ఈజీగా ఇంట్లోనే

బనానా మిల్క్ షేక్
బనానా మిల్క్ షేక్ Photo by Elena Leya on Unsplash

బనానా మిల్క్ షేక్ ఎప్పుడైనా తాగారా? ఈ సమ్మర్ సీజన్‌లో తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి. అర‌టిపండు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంద‌రం ఇష్టంగా తినే పండ్ల‌ల్లో అర‌టిపండు ఒక‌టి. ఇది సీజ‌న్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో మ‌నకు దొరుకుతుంది.   అర‌టిపండు మ‌న‌కు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల‌ను అందిస్తుంది.

అర‌టి పండును మామూలుగా తీసుకోవ‌డమే కాకుండా మిల్క్ షేక్‌గా తీసుకోవడాన్ని పిల్లలు ఇష్టపడుతారు. ఈ వేస‌విలో చ‌ల్లచ‌ల్లగా  మిల్క్ షేక్‌ల‌ను తాగడం వ‌ల్ల మంచి వేడి నుంచి ఉప‌శ‌ప‌మ‌నం ల‌భిస్తుంది. పిల్ల‌ల‌కు కూడా ఇది ఎంతో ఇష్టంగా అనిపించే పానీయం. చాలా త‌క్కువ స‌మ‌యంలో, త‌క్కువ ప‌దార్ధాల‌తో త‌యారు చేసుకునే ఈ మిల్క్ షేక్‌ను స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మీ ముందు ఉంచుతున్నాం. దీనికి కావ‌ల్సిన ప‌దార్ధాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ‌నానా మిల్క్ షేక్ కి కావల్సిన ప‌దార్ధాలు:

  • అర‌టిపండు – 2
  • కాచి చ‌ల్లార్చిన పాలు – 1 క‌ప్పు
  • ఖ‌ర్జూరం  –  5
  • బాదం – 1 టీ స్పూన్
  • జీడిప‌ప్పు – 1 టీ స్పూన్
  • ఐస్ క్యూబ్స్ త‌గినన్ని

బ‌నానా మిల్క్ షేక్ త‌యారీ విధానం:

1. ముందుగా అర‌టిపండును ముక్క‌లుగా క‌ట్ చేసుకుని జార్‌లో వేసుకోవాలి

2. త‌రువాత ఇందులో కాచి చ‌ల్లార్చిన పాలు వేసుకోవాలి.

3. ఇప్పుడు ఇందులో పంచ‌దార‌కు బ‌దులుగా ఖ‌ర్జూరం వేసుకోవాలి. అవ‌స‌ర‌మైతే అలా ఇష్టం లేని వాళ్లు పంచ‌దార‌ను వేసుకోవ‌చ్చు.

4. త‌ర్వాత కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకొని గ్లాసులోకి తీసుకుని దానిని బాదం ఇంక జీడిప‌ప్పుతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే బ‌నానా మిల్క్ షేక్ సిద్దం అయిపోయిన‌ట్టే.

ఈ విధంగా చేసుకుంటే చ‌ల్లచ‌ల్లగా ర‌ుచితో పాటు ఆరోగ్యం కూడా సొంతం చేసుకోవ‌చ్చు. అలాగే వేస‌వి వేడిమి నుంచి చ‌క్క‌ని ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌వ‌చ్చు.

బ‌నానా మిల్క్ షేక్ వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు:

బ‌నానా మిల్క్ షేక్ లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉండ‌డం వ‌ల్ల మ‌జిల్ప్ బ‌లోపేతం అవుతాయి. ఈ మిల్క్ షేక్‌లో ఫైబ‌ర్, కాల్షియం, పొటాషియం, ప్రోటీన్ మ‌రియు మిన‌ర‌ల్స్, విట‌మిన్స్ పుష్క‌లంగా ఉంటాయి. అంతేకాకుంగా మ‌నం రోజులో చాలా యాక్టివ్ గా ఉండాలంటే మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ఈ మిల్క్ షేక్ ద్వారా ల‌భిస్తాయి. త‌క్ష‌ణ శ‌క్తిని అందిస్తుంది. పాల‌లో ఉండే కాల్షియం వల్ల బోన్స్ గ‌ట్టిగా ఉంటాయి.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version