Home ఎంటర్‌టైన్‌మెంట్‌ బిగ్‌బాస్‌ తెలుగు ఓటింగ్ ఎలా? ఈసారి విజేత ఎవరు?

బిగ్‌బాస్‌ తెలుగు ఓటింగ్ ఎలా? ఈసారి విజేత ఎవరు?

bigboss telugu voting
bigboss telugu season 3

బిగ్‌బాస్‌ తెలుగు ఓటింగ్ ప్రక్రియ గురించి మీకు తెలుసా? బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 3 విజేతను మీరు నిర్ణయించాలనుకుంటున్నారా? బిగ్‌ బాస్‌ తెలుగు ఓటు ప్రక్రియ గురించి చిటికెలో తెలుసుకోండి. 

తెలుగులో సక్సెస్‌ సాధించిన రియాల్టీ షోల్లో ఇది కూడా ఒకటి. అక్కడెక్కడో నెదర్లాండ్స్‌లో బిగ్‌ బ్రదర్‌గా మొదలై.. హిందీలో బిగ్‌బాస్‌గా మారి.. అదే పేరుతో తెలుగులోకీ వచ్చింది. ప్రస్తుతం తెలుగులో మూడో సీజన్‌ నడుస్తోంది. 16 మంది కంటెస్టెంట్స్ పోటీ పడిన ఈ షోలో.. చివరికి ఐదుగురు మిగిలారు.

చివరి వారం ఓటింగ్‌ నడుస్తోంది. సీజన్‌ 3 విన్నర్‌ ఎవరువుతారో అని బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి సీజన్‌ 3లో టైటిల్‌ కోసం పోటీ పడుతున్న ఆ ఐదుగురు ఎవరు? వాళ్లకు ఎలా ఓటేయాలి? ఇప్పటి వరకు ఎవరు టాప్‌లో ఉన్నారు? ఈ ఓటింగ్‌ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఈ రియాల్టీ షో ఎక్కడి నుంచి వచ్చింది? గేమ్‌ ఎలా ఆడతారు? అన్న సమాచారంతో డియర్‌ అర్బన్‌.కామ్‌ అందిస్తున్న స్టోరీ ఇది.

ఎక్కడి నుంచి వచ్చిందీ బిగ్‌బాస్‌?

నెదర్లాండ్స్‌లో జాన్‌ డె మోల్‌ జూనియర్‌ అనే వ్యక్తి బిగ్‌ బ్రదర్‌ పేరుతో ఈ రియాల్టీ షోను క్రియేట్‌ చేశారు. ఈ షోలో భాగంగా కొందరు కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేస్తారు. మొదట్లో సెలబ్రిటీలతోనే ఈ ప్రోగ్రామ్‌ నడిపేవాళ్లు. వీళ్లందరినీ ఒకే ఇంట్లో కొన్ని రోజుల పాటు ఉంచుతారు. ఒకరికొకరు పరిచయం లేని వీళ్లు ఒకే దగ్గర కలిసి ఉండటం, ఇంటి పనులను అందరూ కలిసి చేయడం, వారం వారం కొత్త కొత్త టాస్క్‌ల్లో పాలుపంచుకోవడం.. ఇలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందీ రియాల్టీ షో.

సెలబ్రిటీ బిగ్‌బ్రదర్‌ షోలో మన బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టీ విజేతగా నిలవడంతో ఇండియన్స్‌కు కూడా ఈ షోపై ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత 2006లో తొలిసారి హిందీలో బిగ్‌బాస్‌ పేరుతో ప్రారంభమైంది. బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సీ దీనికి హోస్ట్‌గా ఉన్నాడు.

రెండో సీజన్‌ సమయానికి శిల్పా శెట్టిని హోస్ట్‌గా తీసుకొచ్చారు. మూడో సీజన్‌లో అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా ఉన్నాడు. ఇక 2010లో జరిగిన నాలుగో సీజన్‌ నుంచి సల్మాన్‌ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం హిందీలో 13వ సీజన్‌ నడుస్తోంది. ఆ తర్వాత ఈ షో క్రమంగా ప్రాంతీయ భాషల్లోనూ వచ్చింది. ప్రస్తుతం తెలుగుతోపాటు బెంగాలీ, తమిళ్‌, మలయాళం, కన్నడ, మరాఠీ భాషల్లోనూ ఈ బిగ్‌బాస్‌ రియాల్టీ షో నిర్వహిస్తున్నారు.

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్ 1

తెలుగులో తొలిసారి 2017లో ఈ బిగ్‌బాస్‌ షో ప్రారంభమైంది.  బిగ్‌బాస్‌ తెలుగు తొలి సీజన్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఫస్ట్‌ సీజన్‌ జులై 17 నుంచి సెప్టెంబర్‌ 24 వరకు.. అంటే 70 రోజుల పాటు నడిచింది. మొత్తం 16 మంది హౌజ్‌మేట్స్‌ టైటిల్‌ కోసం పోటీ పడగా.. శివబాలాజీ విన్నర్‌గా, ఆదర్శ్‌ రన్నరప్‌గా నిలిచారు. విజేతకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఇచ్చారు. తొలి సీజన్‌ హిట్‌ టాక్‌ కొట్టేసింది.

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్ 2

ఇక 2018లో రెండో సీజన్‌ను ఏకంగా 112 రోజుల పాటు పొడిగించారు. ఈ సీజన్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ స్థానంలో నాని హోస్ట్‌గా వచ్చాడు. జూన్‌ 10 నుంచి సెప్టెంబర్ 30 వరకు రెండో సీజన్‌ సాగింది. మొత్తం 18 మంది హౌజ్‌మేట్స్‌ పార్టిసిపేట్‌ చేశారు. రెండో సీజన్‌లో సెలబ్రిటీలతోపాటు సాధారణ వ్యక్తులకు కూడా అవకాశం కల్పించడం విశేషం. సెకండ్‌ సీజన్‌లో కౌషల్‌ విజేతగా నిలవగా.. సింగర్‌ గీతా మాధురి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్ 3

ప్రస్తుతం మూడో సీజన్‌ నడుస్తోంది. జులై 21న ఈ సీజన్‌ మొదలైంది. నవంబర్‌ 3తో ముగుస్తుంది. అంటే ఇప్పుడు చివరి వారంలో ఉంది. మొత్తం 105 రోజుల పాటు మూడో సీజన్‌ నడవనుంది. ఈసారి మొత్తం 16 మంది పార్టిసిపేట్‌ చేశారు. చివరికి ఐదుగురే మిగిలారు. వీళ్లలో ఒకరు విజేతగా నిలవబోతున్నారు. మూడో సీజన్‌కు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మధ్యలో ఒక వారం ఆయన అందుబాటులో లేకపోవడంతో రమ్యకృష్ణ కూడా షో హోస్ట్‌ చేయడం విశేషం.

గేమ్ ఎలా?

ఈ రియాల్టీ షో కోసం ప్రత్యేకంగా ఓ ఇంటినే నిర్మిస్తారు. అందులో షార్ట్‌లిస్ట్‌ అయిన హౌజ్‌మేట్స్‌ను ఉంచుతారు. వీళ్లను ఎప్పటికప్పుడు ఆ ఇంట్లోని కెమెరాలు ఓ కంట కనిపెడుతూ ఉంటాయి. రోజువారీ ఇంటి పనులతోపాటు వారం వారం బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్క్‌లను వీళ్లు చేయాల్సి ఉంటుంది. ఇంట్లోనే ప్రత్యేకంగా ఓ కన్ఫెషన్‌ రూమ్‌ ఉంటుంది. అందులోకి వెళ్లి ఒక్కో హౌజ్‌మేట్‌ తమ మనసులో మాటలను కెమెరాతో చెప్పుకోవచ్చు.

ఇందులో భాగంగానే ప్రతి వారం ఒక హౌజ్‌మేట్‌.. తనకు నచ్చని ఇద్దరు హౌజ్‌మేట్స్‌ను ఎలిమినేషన్‌కు నామినేట్‌ చేయొచ్చు. ఇలా ఎక్కువ ఓట్లు వచ్చిన ఇద్దరికి ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఈ షో చూసే అభిమానులు.. వీళ్లలో ఎవరిని ఎలిమినేట్‌ చేయాలో ఓటింగ్‌ ద్వారా నిర్ణయిస్తారు.

ప్రతి వారం ఒక్కో హౌజ్‌మేట్‌ ఇంటిని వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది. చివరి వరకూ ఉన్న వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. మధ్యమధ్యలో ఇంటి నుంచి వెళ్లిపోయిన వాళ్ల రీఎంట్రీ కోసం కూడా ఓటింగ్‌ పెడుతూ ఉంటారు. అభిమానులు తమకు ఇష్టమైన హౌజ్‌మేట్‌ ఎవరైనా మళ్లీ రావాలనుకుంటే వాళ్లకు ఓటు వేయొచ్చు. ఒక రకంగా ఇదో మైండ్‌గేమ్‌.

మన ఇళ్లలో కుటుంబసభ్యుల మధ్యే అప్పుడప్పుడూ ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. మాటా మాటా అనుకుంటూ ఉంటాం. అలాంటిది భిన్న మనస్తత్వాలు, అభిరుచులు, అభిప్రాయాలు ఉన్న వేర్వేరు వ్యక్తులు ఒకే ఇంట్లో అన్ని రోజుల పాటు కలిసి ఉండటం ఓ సవాలే.

అందరితో కలిసిపోతూ, ఇంటి పనులు చేసుకుంటూ, బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లను పూర్తి చేస్తూ, షో చూసే వారి అభిమానం సంపాదించడం అంత సులువు కాదు. ముందుగానే పక్కా గేమ్‌ ప్లాన్‌తో దిగినా అక్కడ పరిస్థితులు మారిపోవచ్చు. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్లాన్‌ మార్చుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.

నిజానికి ఈ కాన్సెప్ట్‌ మంచిదే కానీ.. టీవీ చానెల్స్‌ రేటింగ్స్‌ కోసం అప్పుడప్పుడూ అర్థంపర్థం లేని ఆటలు, గొడవల్లాంటివి చికాకు కలిగిస్తాయి.

బిగ్‌బాస్‌ తెలుగు ఓటింగ్ ప్రక్రియ ఎలా?

మొత్తం 16 మంది హౌజ్‌మేట్స్‌ మూడో సీజన్‌లో పార్టిసిపేట్‌ చేయగా.. చివరికి ఐదుగురే మిగిలారు. మిగిలిన వాళ్లు వారానికొకరు ఇంటికి వెళ్లిపోయారు. హౌజ్‌మేట్స్‌ నామినేట్‌ చేసిన ఇద్దరిలో ఒకరిని తమ ఓటింగ్‌ ద్వారా ప్రేక్షకులు ఎలిమినేట్‌ చేశారు.

అలా ఇప్పటి వరకు వెళ్లిపోయిన వాళ్లలో నటి హేమ, జర్నలిస్ట్‌ జాఫర్‌, ఈ గేమ్‌లో పాల్గొన్న తొలి ట్రాన్స్‌జెండర్‌ తమన్నా, రోహిని నోని, ఆషు రెడ్డి, పునర్నవి భూపాలం, రవికృష్ణ, శివజ్యోతి, వితిక, హిమజ, మహేష్‌ విట్టా ఉన్నారు. అలీ రెజా కూడా మధ్యలో ఎలిమినేట్‌ అయిపోయి తిరిగి హౌజ్‌లోకి వచ్చాడు.

బిగ్‌బాస్‌ తెలుగు ఓటింగ్ ప్రక్రియ చాలా ఈజీ. మిస్‌డ్‌ కాల్‌ లేదా ఆన్‌లైన్‌ ద్వారా మీ ఫేవరెట్‌ కంటెస్టెంట్స్‌కు ఓటు వేయొచ్చు. సోమవారం రాత్రి పది గంటల నుంచి శుక్రవారం రాత్రి 11.59 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. వీకెండ్స్‌లో ఆ చాన్స్‌ ఉండదు. ఓటింగ్‌కు అందుబాటులో ఉన్న పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం.

హాట్‌స్టార్‌ యాప్‌: ఇందులోకి మీ మెయిల్‌ లేదా ఫోన్‌ నంబర్‌తో లాగిన్‌ కావచ్చు. ఆ తర్వాత బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ఇండెక్స్‌ పేజ్‌లోకి వెళ్లాలి. అక్కడ ఓట్‌ నౌ అన్న బటన్‌ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేసి అక్కడ ఉన్న మీ ఫేవరెట్‌ కంటెస్టెంట్‌కు ఓటు వేయొచ్చు. ఒక వ్యక్తి ఈ హాట్‌స్టార్‌ యాప్‌లో తమ రిజిస్టర్డ్‌ మెయిల్‌ లేదా మొబైల్‌ నంబర్‌ ద్వారా రోజుకు గరిష్ఠంగా 50 ఓట్లు వేసే వీలుంటుంది.

– ఇక ప్రతి కంటెస్టెంట్‌కు ఓ నంబర్‌ కేటాయిస్తారు. ఆ నంబర్‌కు మిస్‌డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా కూడా మీరు ఓటు వేయొచ్చు. ఒక నంబర్‌ నుంచి వారంలో గరిష్ఠంగా పది ఓట్లు మాత్రమే వేసే వీలుంటుంది. పదకొండో ఓటు వేయాలని చూసినా అది చెల్లదు.

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్ 3 విన్నర్‌ ఎవరు?

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3లో చివరిసారి ఓటింగ్‌ జరుగుతోంది. 16 మంది కంటెస్టెంట్స్‌లో చివరికి కేవలం ఐదుగురే మిగిలారు. టైటిల్‌ కోసం వీళ్లు పోటీ పడబోతున్నారు. గ్రాండ్‌ ఫినాలే వచ్చే ఆదివారం (నవంబర్‌ 3, 2019) జరగబోతోంది. ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న వాళ్లు వీళ్లే..

1. రాహుల్‌ సిప్లిగంజ్‌
2. శ్రీముఖి రాథోడ్‌
3. బాబా భాస్కర్‌
4. వరుణ్‌ సందేశ్‌
5. అలీ రెజా

ఈ ఐదుగురిలో ఎవరో ఒకరే బిగ్‌బాస్‌ సీజన్‌ 3 విజేతగా నిలవనున్నారు. గెలిచిన కంటెస్టెంట్‌కు టైటిల్‌తోపాటు రూ. 50 లక్షల క్యాష్‌ ప్రైజ్‌ దక్కుతుంది. రన్నరప్‌కు రూ. 15 లక్షలు, సెకండ్‌ రన్నరప్‌కు రూ. 10 లక్షలు ఇస్తారు.

బిగ్‌బాస్‌ తెలుగు ఓటు ఇలా వేయండి

ఇప్పుడు హౌజ్‌లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్‌ ఒక్కొక్కరికి ఒక్కో నంబర్‌ ఉంటుంది. ఆ నంబర్‌కు మిస్‌డ్‌ కాల్ ఇవ్వడం ద్వారా మీ ఓటు వేయొచ్చు. ఎవరికి ఏ నంబర్‌ ఉందో చూద్దాం. బిగ్‌బాస్‌ తెలుగు ఓటింగ్ ప్రక్రియలో మీరూ పాల్గొని విజేతను ఎంపిక చేసే అవకాశాన్ని వినియోగించుకోండి.

1. వరుణ్‌ సందేశ్‌      8466996714
2. రాహుల్‌ సిప్లిగంజ్‌  8466996704
3. శ్రీముఖి            8466996713
4. బాబా భాస్కర్‌      8466996708
5. అలీ రెజా           8466996711

ఇవి కూడా చదవండి

Exit mobile version