Latest

Vaginal Infections after Sex : లైంగిక సమయంలో యోని ఇన్ఫెక్షన్లు చాలా మంది మహిళల్లో సాధారణమనే చెప్పవచ్చు. లైంగికంగా పాల్గొన్న పాల్గొనకపోయినా.. బ్యాక్టీరియా, ఈస్ట్ యోనిలో ఉంటుంది. అయితే లైంగిక చర్య తర్వాత యోనిలో బ్యాక్టీరియా, ఈస్ట్ పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది. అది మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేస్తుంది.
సాధారణంగా యోనిని శుభ్రం చేయకపోవడం, హార్మోన్లలో మార్పులు, దీర్ఘకాలంగా యాంటీబయాటిక్స్ తీసుకుంటే యోని సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది. ఇవేకాకుండా లైంగిక చర్య తర్వాత, గర్భం ధరించినప్పుడు, సబ్బుతో వాష్ చేసినప్పుడు, బిగుతుగా ఉండే లో దుస్తులు ధరించినప్పుడు యోని సమస్యలు వస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవచ్చు. ముందుగా మీకు ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉందో తెలుసుకోవాలి.
యోనిలో చికాకు, వాపు ఉంటే మీరు వైద్య పరీక్షలు చేయించుకోండి. యాంటీబయాటిక్ విశ్లేషణ కోసం యోని ఉత్సర్గ నమూనాను సేకరించవచ్చు. గోనేరియా లేదా క్లామిడియా వంటి STIల కోసం టెస్ట్ చేయించుకోండి. లైంగిక సంక్రమణ వ్యాధిని పరీక్షించడానికి మూత్ర నమూనా ఇవ్వండి.

ఎలా నివారించాలంటే..

అన్ని యోని ఇన్ఫెక్షన్‌లను నివారించలేము. అయితే కొన్ని చిట్కాలు యోని ఇన్ఫెక్షన్ తగ్గించడంలో సహాయపడతాయి. టాంపాన్‌లు, ప్యాడ్‌లు, ప్యాంటీ లైనర్‌లతో సహా సువాసన కలిగిన పీరియడ్ ఉత్పత్తులను ఉపయోగించడం మానేయాల్సి ఉంది. డౌచింగ్, యోని డియోడరెంట్‌లు, యోనిపై లేదా లోపల ఏదైనా సువాసనగల స్ప్రేలు ఉపయోగించే అలవాటు ఉంటే పూర్తిగా మానేయండి.
బబుల్ బాత్‌లు, సువాసనతో కూడిన బాడీ వాష్‌లు యోని pHని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఎల్లప్పుడూ సాదా నీటితో మాత్రమే స్నానం చేయండి. సెక్స్ టాయ్స్ వినియోగిస్తే.. వాటిని వెంటనే శుభ్రం చేయండి. వాటిని ఇతరులతో షేర్ చేసుకోకపోవడమే మంచిది. అలాగే యోనికి గాలి చికాకు కలిగించే, గాలిప్రవాహాన్ని అడ్డుకునే లోదుస్తులు దూరంగా ఉంచండి. కాటన్ లో దుస్తులు మీకు ఎల్లప్పుడూ మంచివి. ప్రతిరోజు మీ లో దుస్తులను మార్చండి.
అదనపు తేమను నిరోధించడానికి వీలైనంత త్వరగా స్విమ్‌సూట్‌లు, తడిగా ఉన్న దుస్తులు మార్చేయండి. లేదంటే అవి మీకు ఇన్ఫెక్షన్ పెంచుతాయి. సువాసనలేని సబ్బులు ఉపయోగిస్తే మంచిది. కండోమ్‌లు కేవలం STIల నుంచి మిమ్మల్ని రక్షించడమే కాకుండా యోనిలోని బ్యాక్టీరియా సమతుల్యతను మార్చుతాయి. యోని pHలో మార్పులను నిరోధిస్తాయి.

వైద్యుడి సూచనల మేరకు..

మీరు చికిత్సకు ఆలస్యం చేస్తే అవి  మరింత తీవ్రం కావచ్చు. కాబట్టి మీకు సమస్య ఉందని గుర్తిస్తే వైద్యుడిని వెంటనే సంప్రదించండి. తరచుగా మెట్రోనిడాజోల్ టాబ్లెట్, జెల్ లేదా క్రీమ్ యోని సమస్యలకు చికిత్స కోసం వైద్యులు సూచిస్తారు. బ్యాక్టీరియా సంక్రమణ చికిత్సకు క్రీమ్ లేదా జెల్ రూపంలో ఉండే క్లిండమైసిన్ ఉపయోగించవచ్చు. యాంటీ ఫంగల్ క్రీమ్‌లు లేదా సుపోజిటరీలను ఈస్ట్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి. ట్రైకోమోనియాసిస్ చికిత్సకు మెట్రోనిడాజోల్ లేదా టినిడాజోల్ మాత్రలను ఉపయోగిస్తారు. మీరు యోని డ్రై, చికాకుతో బాధపడుతుంటే.. ఈస్ట్రోజెన్ క్రీమ్‌లు లేదా టాబ్లెట్స్ సహాయం చేస్తాయి.

Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Trending

Exit mobile version