Latest

నేచురల్ స్టార్ నానీ నిర్మాతగా, దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిలర్ ‘హిట్’ ఫస్ట్ కేస్ చిత్రం ఎంతటి మంచి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సిరీస్ లో రెండో చిత్రం ‘హిట్ ది సెకెండ్ కేస్’ త్వరలోనే పట్టాలెక్కనుంది.

ఈ లాక్ డౌన్ కాలం రెండో హిట్ కేసును సిద్ధం చేయడానికి ఎంతో ఉపయోగపడిందంటున్నారు దర్శకుడు శైలేష్. శనివారం ఈ చిత్రం తాలుకూ స్ర్కిప్ట్ పూర్తైనట్టు ఆయన ప్రకటించారు.

మొదటి కేసులో హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం ఆఫీసర్ విక్రం (విశ్వక్ సేన్) మిస్సింగ్ కేసులను ఏ విధంగా ఛేదించాడు, దాని వెనుక ఉన్న నేపథ్యం ఏంటో కథాంశంగా చూపించి ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

ఆద్యంతం ఊపిరి బిగపట్టేలా చేసిన స్క్రీన్ ప్లేతో అలరించాడు. అమ్మాయిలు అపరణహకు గురవుతున్న కేసులో విచారణలో ఉన్న వారందరూ అనుమానితులుగానే అనిపిస్తారు. నెక్ట్స్ ఏంటన్న రీతిలో ఉత్కంఠకు గురిచేస్తుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో కూడా ఉంది.

ఇప్పుడీ సెకెండ్ కేస్ ఏ మేరకు థ్రిల్ ఇవ్వగలదన్నది వేచిచూడాలి. ఈ చిత్రం తాలూకు స్ర్కిప్ట్ రాసిన పుస్తకం మొదటి పేజీలో..

హిట్ ది సెకెండ్ కేస్ 

డా. శైలేష్ కొలను

రిజిస్టర్డ్ విత్ ద ఆస్ట్రేలియన్ రైటర్స్ గిల్డ్.. అని ఉంటుంది. దీన్ని బట్టీ హిట్ సిరీస్ లో రెండో కేసు ఏ విధంగా ఉండబోతోంది, దాని వెనుక ఉండే నేపథ్య కథాంశం అర్థం చేసుకోవచ్చు.

ఆస్ట్రేలియన్ రైటర్స్ గిల్డ్ అనే సంస్థ రచయితల హక్కులను కాపాడేందుకు పనిచేస్తున్న సంస్థ. రచయితల ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ కాపాడేందుకు, వారి రెమ్యునరేషన్ విషయంలో హక్కులను కాపాడేందుకు పనిచేసే సంస్థ.

తెలుగులో సీక్వెల్ సినిమాలు ఇటీవల కాలంలో చాలా తక్కువే. బాహుబలి వంటి విజయవంతమైన చిత్రాలు కూడా తక్కువే. ఫిబ్రవరి మాసాంతంలో విడుదలై విజయం సాధించిన హిట్ మూవీ పార్ట్ 2 అతి తక్కువ సమయంలో తెరకెక్కుతుండడం విశేషమే.

ఇవీ చదవండి


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Trending

Exit mobile version