Home మనీ Earn money from Instagram: ఇన్‌స్టాగ్రామ్‌‌తో డబ్బు సంపాదన ఎలా?

Earn money from Instagram: ఇన్‌స్టాగ్రామ్‌‌తో డబ్బు సంపాదన ఎలా?

instagram
Photo by Georgia de Lotz on Unsplash

Earn money from Instagram: ఇన్‌స్టాగ్రామ్‌తో డబ్బులు సంపాదించడం సెలబ్రిటీలకే కాదు.. సాధారణ వ్యక్తులు కూడా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌గా మారి మనీ సంపాదించొచ్చు. వెంకటేష్ కూతురు ఆశ్రిత. సినిమాలు చేయలేదు. పబ్లిక్‌లో కనిపించరు. పెళ్లి చేసుకుని బార్సిలోనాలో భర్తతో స్థిరపడ్డారు. ఆమె ఫోటోలు చాలా తక్కువగా నెట్‌లో దర్శనమిస్తాయి. అయినా కూడా ఆమెకు ఇన్స్టాగ్రామ్‌లో లక్షల మంది ఫాలోవర్లు.

అంతేకాదు ఇన్‌ఫ్లూయెన్స‌ర్లలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. ఇదంతా ఆమె వెంకటేష్ కూతురిగా సాధించలేదు. సొంత గుర్తింపుతోనే సాధించారు. ఇన్స్టాగ్రామ్‌లో ఆమె తన వంటకాల ఫోటోలు, వీడియోలతో పాపులర్ అయ్యారు. ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్టు విలువ 400 డాలర్లు అని సమాచారం.

సెలెబ్రిటీ అయినా, సామాన్యుడైనా ఖాతా తెరిచే పద్దతి ఒక్కటే. కాకపోతే సెలెబ్రిటీకి త్వరగా ఫాలోవర్లు వస్తారు. సామాన్యుడికి రావడం కష్టం. అదొక్కటే తేడా. కొంచెం కష్టపడితే సామాన్యులు కూడా ఇన్స్టాలో ఫాలోవర్లను పెంచుకుని, తమ పోస్టుల ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. 

ఇన్‌స్టాలో ఫాలోవర్లను పెంచుకోండి (Money on Instagram followers)

ఇన్‌స్టాగ్రామ్‌తో మానిటైజేషన్ చేయాలంటే ముందుగా మీరు ఫేమస్ అవ్వాలి. లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకోవాలి. దానికి ఒక పద్దతి ఉంది. మీకు ఏదిష్టమో ఒకసారి కూర్చుని ఆలోచించండి. మీ అభిరుచికి తగ్గట్టుగా మీ పోస్టులు ఉంటే బాగుంటుంది.

వంటలు ఇష్టమైతే… ఇన్స్టాలో రోజూ రకరకాల వంటలు, ఆహారపదార్థాల ఫోటోలు, వీడియోలు పోస్టు చేయండి. లేదా మీకు ట్రావెల్ ఇష్టమైతే మీరు తిరిగిన ప్రదేశాలు, అక్కడి వింతలు, విశేషాల ఫోటోలను, వీడియోలను పోస్టు చేయండి. మీకు ఇంట్రస్ట్ ఉన్న ఏ కేటగిరీ అయినా తీసుకుని, వాటి మీద మీ పోస్టింగులు ఉండాలి.

ప్రతి పోస్టులో హాష్ ట్యాగ్‌లు ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూసుకోవాలి. ఫీచర్లన్నీ వాడి మీ పోస్టుల రీచ్ పెరిగేలా చూసుకోవాలి. రీల్స్ వీడియోలు కూడా చేయాలి. స్టోరీస్ ఫీచర్‌కు వ్యూస్ ఎక్కువగా ఉంటాయి. రోజూ స్టోరీస్‌లో ఓ పోస్టు ఉండేలా చూడాలి. 

అఫ్పుడు ఆ కేటగిరీ పోస్టులను ఇష్టపడే వాళ్లంతా మిమ్మల్ని ఫాలో అవుతారు. దీనికి కాస్త సమయం పడుతుంది. ఓపికగా వేచి ఉండాలి. ఒక్కసారి లక్ష మందికి ఫాలోవర్లను పెంచుకుంటే మీ విలువ పెరిగినట్టే. 

ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బులు సంపాదించే 3 మార్గాలు (3 ways to earn money)

1. ఇన్‌ఫ్లూయెర్స్‌(instagram Influencer) గా మారి..

సెలెబ్రిటీలంతా ఈ కోవలోకే వస్తారు. వారికి లక్షల కొద్దీ ఫాలోవర్లు ఉంటారు. ఒక్క పోస్టు పెడితే చాలా మంది చూస్తారు. కాబట్టే వీళ్లని ఇన్‌ఫ్లూయెర్స్ అంంటారు. వారు ఒక బ్రాండు‌కు చెందిన ఉత్పత్తులు కొనమని పోస్టు పెడితే చాలు, సదరు బ్రాండ్‌కు పబ్లిసిటీ లభిస్తుంది. ఆ పోస్టుకు వాళ్లు కొన్ని లక్షల రూపాయలు రెమ్యునరేషన్‌గా అందుకుంటారు. ఆ రెమ్యునరేషన్ ఇచ్చేది సదరు బ్రాండ్ వాళ్లే.

ఇదే తీరుగా మీరు కూడా లక్షల ఫాలోవర్లను సంపాదించుకుంటే మీరు కూడా బ్రాండ్‌లను ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. మీకు ఉండే ఫాలోవర్లను బట్టే కంపెనీలు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాయి. తమ వస్తువులకు ప్రచారం చేయమని అడుగుతాయి. ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు? ఎన్ని లైకులు, షేర్లు, కామెంట్లు వచ్చాయి? అనే దానిపై మీకు ఇచ్చే రెమ్యునరేషన్ ఆధారపడి ఉంటుంది. 

మీ ఫాలోవర్స్ పెంచుకోవాలంటే మీరు నిత్యం పోస్టులు, రీల్స్ (money on instagram reels) పబ్లిష్ చేయాలి. పోస్టుల కంటే ఎక్కువగా రీల్స్‌కు డిమాండ్ ఉంటుంది. రీల్స్ బాగా క్లిక్ అవ్వాలంటే మీకు దేనిలో స్కిల్ ఉంటే దానిపై వీడియోలు చేయాలి. మీకు బ్యూటీ టిప్స్‌పై గానీ, మనీ టిప్స్ పై గానీ, ఇంకేవైనా స్కిల్స్ పంచుకోవాలనుకుంటే వాటిపై చేయొచ్చు. లేదా డైలాగ్స్, డాన్సులు, మోటివేషనల్ కోట్స్ కూడా చేయొచ్చు.

2. అఫిలియేట్ మార్కెటింగ్ (Affiliate Marketing on instagram) ద్వారా…

ఏదైనా ప్రోడక్ట్‌కు సంబంధించిన అఫిలియేట్ లింకును పోస్టు చేయడం ద్వారా కూడా కొంత డబ్బును కమిషన్ రూపంలో సంపాదించవచ్చు. ఉదాహరణకు మీకు వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారనుకుందాం. కొత్తగా విడుదలైన ఫోను తాలుకు అమ్మకపు లింకును మీ ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఇవ్వాలి.

ఎవరైనా ఆ లింకు మీద క్లిక్ చేసి ఆ వెబ్‌సైట్ లోకి వెళ్లి ఆ ఫోనును కొంటే మీకు 1 నుంచి 15 శాతం కమిషన్గా వస్తుంది. దీని కోసం మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలలో అఫిలియేట్‌గా జాయిన్ అవ్వాలి. 

3. సొంత ఉత్పత్తులు అమ్మడం (selling own products on instagram) ద్వారా….

మీరు చేయి తిరిగిన కళాకారులైతే చక్కని కళారూపాలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అమ్మకానికి ప్రమోట్ చేసుకోవచ్చు. మీ వెబ్ సైట్లు, లేదా మీ బోటిక్ వివరాలు, అందించే సేవలు ఇలా అన్నింటినీ ప్రమోట్ చేసుకోవచ్చు. చాలా మంది ఇన్‌స్టాలో తమ సొంత టాలెంట్ తో దూసుకుపోతున్నారు. అలాంటి వారికి మంచి వ్యాపారంతో పాటూ ఫాలోవర్లు పెరుగుతారు. 

అలాగే షౌటవుట్స్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. అంటే వేరే వాళ్ల ఇన్స్టా పేజీని మీ ఖాతాలో ప్రమోట్ చేసి కొంత మొత్తాన్ని ఫీజుగా వసూలు చేయవచ్చు. అయితే దానికి ఆ పేజీ వాళ్లే మిమ్మల్ని ప్రమోట్ చేయమని అడగాలి. అలా అడగాలంటే మీ ఖాతాలో లక్షల్లో ఫాలోవర్లు ఉండాలి. 

కనుక ఇన్‌స్టాలో (Earn money from instagram) డబ్బు సంపాదించాలంటే ముందుగా ఫాలోవర్లను బాగా పెంచుకోండి. లక్షల్లో ఫాలోవర్లు ఉంటే మీరు ప్రయత్నించకుండానే ప్రమోషన్ ఆఫర్లు మీకు వస్తుంటాయి. తద్వారా బోలెడంత డబ్బు కూడా వస్తుంది. 

– మానస్, ఫ్రీలాన్స్ జర్నలిస్టు

Exit mobile version