Latest

రాణా ప్రేయసి మిహీకా బజాజ్ ఎంత అందంగా ఉంటుందో.. తన లైఫ్‌ ఫిలాసఫీ కూడా అంతే అద్భుతంగా ఉంది. మిహీక బజాజ్. పక్కా హైదరాబాదీ. ఒక మూడేళ్ల క్రితం వరకు తల్లి బంటీ బజాజ్ కు వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ లో సహాయం చేసేవారు.

ఆ తరువాత 2017 ద్వితీయార్థంలో సొంతగా డ్యూ డ్రాప్స్ అనే ఒక ఇంటీరియర్ డిజైన్ సంస్థను ప్రారంభించారు.  ఇప్పుడు వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ తో పాటుగా ఈ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.

సహజంగా మనకు మన జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలన్న విషయంలో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలు, వాటిని చేరుకొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాల విషయంలో క్రమశిక్షణ పాటించాల్సి ఉంటుంది. మనకు మనపై ఉన్న అవగాహన, పరిణతి మన లక్ష్యాలను నిర్దేశిస్తాయి అంటారు.

అలాగే లక్ష్యాల విషయంలో మనకు స్పష్టత వచ్చాక వాటిని సాధించేందుకు మనకంటూ కొన్ని సిద్ధాంతపరమైన విధానాలు అవసరం. లక్ష్యసాధనలో అవే మన ఖచ్చితత్వాన్ని చెప్తాయి.

దానికి ఫిలాసఫీ అని, జీవన దృక్పథం అని, ఆటిట్యూడ్‌ ఆఫ్‌ లైఫ్‌ అని, క్రమశిక్షణ అని ఎన్నో పేర్లు ఉండొచ్చు. ఒక్కో మనిషి ఒక్కో ఫిలాసఫీని అవలంబిస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఒక పనిని ఒకరు ఒక పద్ధతిలో చేస్తే, మరొకరు మరో విధంగా చేస్తారు. ఏమంటే..! ఇది నా ఫిలాసఫీ అంటారు.

ఈ ఫిలాసఫీని మనం ఎవర్నైన చూసి నేర్చుకొని ఉండొచ్చు, లేదా మనకు మనం అలవరుచుకొని ఉండొచ్చు. ఫిలాసఫీ.. ఏ విషయంలోనైనా మనకు ఒకింత సానుకూల ధృక్పథాన్నే ఇస్తుంది.

ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం ఏ విధంగా నడుచుకోవాలన్న విషయంలో మనకున్న స్పష్టత దీనికి కారణం కావచ్చు. ఆ ఫిలాసఫీనే మన విలువలను, మన వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తాయి. ఆ ఫిలాసఫీనే మనకు, ఇతరులకు వ్యత్యాసాన్ని చూపుతుంది. వత్యాసం అంటే ఎక్కువా, తక్కువా అని కాదు. జీవనశైలిలో ఆలోచనా విధానం అంతే.
miheeka
ఈ విషయంలో నటుడు రాణా దగ్గుబాటి ప్రేయసి మిహీకా బజాజ్ కు ఒక ఫిలాసఫీ ఉంది. ఈ క్షణాన్ని అస్వాదిస్తూ జీవించడం.. రేపన్న దానిపై భయం లేకుండా, నిన్నటి రోజుపై బాధ లేకుండా జీవించడం.

‘‘మనం అనునిత్యం అందోళనతో జీవిస్తుంటాం. రేపటిపై బెంగతో, నిన్నటి గురించి పశ్చాతాపంతో ఈ క్షణాన్ని ఆస్వాదించడం కాదు కదా, జీవించడమే మరిచిపోతాం. ఒక్క క్షణం ఈ ఆందోళనలు, భయాలను తరిమేయడం గురించి ఆలోచిస్తే, అప్పుడు అర్థమవుతుంది మనకు అవన్ని ఎంత అనవసరమో.

గతంలో మనం ఎంచుకున్న నిర్ణయాల ఫలితమే ప్రస్తుత మన వర్తమానం. అదే మనల్ని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. అలాంటప్పుడు గతం గురించి, మనం తీసేసుకున్న నిర్ణయాలపై మనకు పశ్చాత్తాపం ఎందుకు!.

భవిష్యత్తు అన్నది నియంత్రణ లేనిది, అలాంటప్పడు దానిపై బెంగ, ఆందోళన ఎందుకు.

గతం నుంచి నేర్చుకుందాం– ఎందుకంటే అదే మనకు గురువు. భవిష్యత్తు కోసం పనిచేద్దాం. అదే మనకు ఆనందం. ఈ క్షణంలో జీవించండి, ఆస్వాదించండి, అదే మన అతిపెద్ద సంపద.

ఈ క్షణం.. అదే, ఎక్కడైతే మనం ఉండాలో అదే ఈ ప్రస్తుత క్షణం. ఒక దీర్ఘమైన శ్వాసతో ఈ క్షణంలో జీవిస్తూ.. పరిసరాలను అనుభూతి చెందండి.
mihika bajaj
నమ్మండి, ఈ విశ్వం మీ కోసం ఎదురు చూస్తోంది. మీకు కావాల్సిందంతా మంచి మనసు, స్వచ్ఛమైన ఉద్దేశాలు. అంతే ప్రతీది బాగుంటుంది. ఈ క్షణంలో జీవిచండి అంతే!..’’ అంటూ తన ఫిలాసఫీని పంచుకుంది మిహీకా బజాజ్.


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Trending

Exit mobile version