రియల్ ఎస్టేట్‌కు కొల్లూరు మరో హాట్‌స్పాట్‌గా మారనుంది. మణికొండ, పుప్పాలగూడ, అలకాపూర్ టౌన్‌షిప్, ఖాజాగూడ, మంచిరేవుల, నార్సింగి, కోకాపేట్, గచ్చిబౌళి ఓవర్ క్రౌడెడ్ కావడంతో పాటు, రేట్లు ఆకాశాన్ని అంటాయి. ఖాళీ స్థలాలు అందుబాటులో లేకుండా పోవడంతో రియల్‌ఎస్టేట్ బిల్డర్లకు తదుపరి గమ్యస్థానంగా కొల్లూరును ఎంచుకుంటున్నారు.
ఇప్పటికే కొల్లూరులో అనేక కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఇటీవల ప్రీలాంచ్ ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఐటీ జోన్‌కు తూర్పు, ఉత్తరం, దక్షిణ వైపులన్నీ ఫుల్ అవడంతో ఇప్పుడు పశ్చిమ దిశలో ఔటర్ రింగ్ రోడ్డుకు ఒకటి రెండు కిలోమీటర్ల దూరం వరకు కొత్త ప్రాజెక్టులన్నీ మొదలవుతున్నాయి.
హైదరాబాద్ నడిబొడ్డంతా ఇప్పుడు ఓల్డ్ సిటీ అయిపోతోంది. ఐటీ జోన్, ఇతర మల్టీ నేషనల్ కంపెనీల చుట్టూ నివాస ప్రాంతాలు డిమాండ్‌ను సంతరించుకుంటున్నాయి. అందువల్ల కొల్లూరు, వెలిమల, పతిఘన్‌పూర్ వంటి ప్రాంతాలు భవిష్యత్తులో హాట్‌స్పాట్లుగా మారనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల తెల్లాపూర్, వట్టి నాగులపల్లి, గోపన్ పల్లి వంటి ప్రాంతాలు ఉండగా.. దీనికి సమీపంలో ఔటర్ రోడ్డు వెలుపల ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి.
ప్రస్తుతం కరోనా కారణంగా మార్కెట్ డల్‌గా ఉంది. బార్గేయినింగ్ చేసేందుకు కాస్త వెసులుబాటు ఉంటుంది. అందువల్ల హైదరాబాద్ నగరంతో నిత్యం అటాచ్‌మెంట్ అవసరం లేదనుకునేవారు ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఈ ప్రాంతాల్లో నివాసాన్ని ఎంచుకోవడం మేలు.
రూ. 35 లక్షల నుంచి రూ. 50 లక్షలలోపు మంచి 2 బీహెచ్‌కే సొంతం చేసుకోవచ్చు. ప్రాజెక్టును బట్టి ఎస్‌ఎఫ్‌టీ ధర రూ. 2399 నుంచే అందుబాటులో ఉండడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు.
ఈవీకే ఆవాసా
భువన్‌తేజా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ ఈవీకే ఆవాస గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టును ప్రీలాంచ్ ఆఫర్ కింద అందిస్తోంది. ఆఫర్ ప్రైస్ రూ. 2,799గా కోట్ చేసింది. ఇందులో మూడు ప్లాన్లను ప్రకటించింది. ప్లాన్–ఏ కింద ఫుల్ క్యాష్ పేమెంట్ 45 రోజుల్లోపు చేయాలి. ఎస్‌ఎఫ్‌టీ ధర రూ. 2,799గా ప్రకటించింది.
ఇక ప్లాన్ బీలో 45 రోజుల్లో 50 శాతం డౌన్ పేమెంట్ చేయాలి. మిగిలినది లోన్‌కు వెళ్లొచ్చు. ఈ ప్లాన్ బీలో ఎస్‌ఎఫ్‌టీ ధర రూ. 3,199గా ప్రకటించింది.
ఇక ప్లాన్–సీలో 45 రోజుల్లో 25 శాతం డౌన్‌పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 75 శాతం లోన్ ద్వారా సమకూర్చుకోవచ్చు. ఎస్‌ఎఫ్‌టీ ధర రూ. 3,599గా ప్రకటించింది.
ఈ ప్రాజెక్టు 8 ఎకరాల్లో రానుంది. మొత్తం ఏడు టవర్లు. ఒక్కో టవర్‌లో జీ ప్లస్ 17 టవర్రలు ఉంటాయి. ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంటుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, విప్రో సర్కిల్, హైటెక్ సిటీకి సమీపంలో ఉంటుంది.
ఇదే సంస్థ ఈవీకే ఆరా ప్రాజెక్టును వెలిమలలో అందిస్తోంది. ఇది కూడా ఓఆర్‌ఆర్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇలాంటి ప్రాజెక్టులు చాలావరకు ప్రీలాంఛ్ ఆఫర్లు అందిస్తున్నాయి. చేతిలో డబ్బులు ఉంటే ప్రీలాంచ్ ఆఫర్లను అందిపుచ్చుకోవడం మేలు.
సిగ్నేచర్ ఆల్టియస్
కొల్లూరులో సిగ్నేచర్ ఆల్టియస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులో 347 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. 18 వేల ఎస్‌ఎఫ్‌టీ క్లబ్ హౌజ్ ఉంది. హెచ్‌ఎండీఏ అప్రూవ్డ్ ప్రాజెక్టు. సమస్తి ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో ఉంటుంది. విప్రో సర్కిల్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది.
హాల్‌మార్క్ వెస్టా..
హాల్‌మార్క్ బిల్డర్స్ కొల్లూరు సమీపంలో పతిఘన్‌పూర్‌లో హాల్‌మార్క్ వెస్టా పేరుతో గేటెడ్ కమ్యూనిటీ నిర్మిస్తోంది. ఎస్‌ఎఫ్‌టీ ధర రూ. 3,599గా ప్రకటించింది. అన్ని ఛార్జీలు కలుపుకుని 2 బీహెచ్‌కే రూ. 54 లక్షల్లో అందించనుంది. హౌజింగ్ లోన్ సౌకర్యం ఉంటుంది. సమీపంలో గ్లేడియం ఇంటర్నేషనల్‌స్కూల్ ఉంది.