Home ట్రావెల్ వర్క్‌ ఫ్రమ్‌ టూరిజం స్పాట్‌ .. మధ్యప్రదేశ్‌ కొత్త కాన్సెప్ట్‌

వర్క్‌ ఫ్రమ్‌ టూరిజం స్పాట్‌ .. మధ్యప్రదేశ్‌ కొత్త కాన్సెప్ట్‌

madhya pradesh tourism
madhya pradesh tourism spot

ర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లాగే ఈ వర్క్‌ ఫ్రమ్‌ టూరిజం.. కోవిడ్‌తో దెబ్బతిన్న పర్యాటకాన్ని పునరుద్ధరించేందుకు మధ్యప్రదేశ్‌ టూరిజం శాఖ కొత్త కాన్సెప్ట్‌ తీసుకొచ్చింది. ఇప్పటికే డిసెంబరు వరకు ఐటీ, ఇతర రంగల్లోని ఉద్యోగులకు కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అవకాశాన్ని కల్పించాయి.

ఆయా ఉద్యోగుల వర్క్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా.. వారంత నూతన ఉత్తేజాన్ని పొందేందుకు వీలుగా మధ్యప్రదేశ్‌ టూరిజం విభాగం ఈ పనితో పాటు పర్యాటకం కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. పర్యాటకులు ఎలాంటి ఆటంకం లేకుండా తమ విధులు నిర్వర్తించడంతోపాటు పనిలోపనిగా టూరిజం స్పాట్లు చూసేందుకు అన్ని ఏర్పాట్లను మధ్యప్రదేశ్‌ టూరిజం చేస్తోంది.

తరచుగా ఇంటి నుండి పని చేయడం ఉత్తేజకరమైనదిగా భావించినా.. దానికి ఉండే సవాళ్లు దానికీ ఉన్నాయి. ఇంటిల్లిపాదితోపాటు ఆఫీస్‌ వర్క్‌ చేయడం ఒక సవాలే. ఇలాంటి పరిస్థితిలో పని, ఇంటి మధ్య సమతుల్యతను కాపాడుకోవడం కష్టం. మధ్యప్రదేశ్‌ టూరిజం తెచ్చిన ఈ కొత్త కాన్సెప్ట్‌ ఆకట్టుకునేలా ఉంది.

tourism spot from MP
మధ్య ప్రదేశ్ లోని ఓ టూరిజం స్పాట్

ఉద్యోగులు తమ ఇల్లు లేదా కార్యాలయం నుండి మాత్రమే కాకుండా, మధ్యప్రదేశ్‌లోని ప్రధాన పర్యాటక గమ్యస్థానాలలో లభించే హోటళ్ళు, రిసార్ట్స్‌ నుంచి పనిచేసుకుంటూనే ఆ ప్రదేశం యొక్క సహజ సౌందర్యం, పర్యాటక కార్యకలాపాలను ఆస్వాదించడానికి అవకాశం లభిస్తుంది. ఇది ఖచ్చితంగా మనశ్శాంతిని, కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. ఇది ఉద్యోగుల కార్యాచరణను, వారి సృజనాత్మకతను కూడా పెంచుతుందని మధ్యప్రదేశ్‌ టూరిజం విభాగం విశ్వాసం కనబరుస్తోంది.

ఎక్కడెక్కడ ప్రారంభం..

ప్రారంభ దశలో, వైట్‌ టైగర్‌ ఫారెస్ట్‌ లాడ్జ్, (బాంధవ్‌గఢ్‌), కిప్లింగ్‌ కోర్ట్‌ (పెంచ్‌ నేషనల్‌ పార్క్‌), బైసన్‌ రిట్రీట్, సత్నా నేషనల్‌ పార్క్, చంపక్‌ బంగ్లా (పాచ్‌మాడి), సైలానీ ఐలాండ్‌ రిసార్ట్‌ (ఓంకారేశ్వర్‌) ఈ జాతితాలో చేర్చారు. భారతదేశంలోని ప్రధాన పర్యాటక గమ్యస్థానాలలో ఉన్న ఈ హోటళ్ళు, రిసార్ట్‌లన్నీ ప్రాథమిక సౌకర్యాలతో కూడి ఉన్నాయి. పరిశుభ్రత, భద్రత కోసం అవసరమైన అన్ని మార్గదర్శకాలు, నిబంధనలు, నిర్దిష్ట ప్రోటోకాల్‌ను ఈ హోటళ్ళు, రిసార్ట్‌లలో ప్రాధాన్యతతో అనుసరిస్తున్నారు.

Exit mobile version