విడిపోతున్నట్లు ఇన్ స్టాలో పోస్టు పెట్టి నాగచైతన్య ఫోటోలు డిలీట్ చేసిన సమంత ఇప్పుడు మళ్లీ ట్విస్ట్ ఇచ్చింది. తన ప్రోఫైల్ లో విడిపోతున్నట్లు తెలిపిన పోస్ట్ డిలీట్ చేసి.. నాగచైతన్యకు చెందిన కొన్ని ఫోటోలు మళ్లీ ప్రోఫైల్ లో ఉంచింది.
తెలుగు ప్రేక్షకులకు నాగచైతన్య సమంత జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ తెలుగులో బ్లాక్ బస్టర్ చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. నాగచైతన్యకు ఇది రెండో సినిమాయే అయినా.. రెండో చిత్రమైన ఏమాయ చేశావేతోనే సక్సెస్ వచ్చింది. ఈ చిత్రంతో వీరు బంపర్ హిట్ కొట్టడమే కాకుండా తమ నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అనంతరం మరో మూడు సినిమాల్లో కలిసి నటించేసి తెరపై మా జంటకు ఇక తిరుగులేదనిపించారు.
ఇలా సినీప్రయాణం సాగుతుండగానే.. వారి ప్రేమ ప్రయాణం మొదలైంది. ముందు ఫ్రెండ్స్ తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ప్రేమ రూమర్లకు బ్రేక్ వేసి.. అనంతరం తమ ప్రేమ గురించి అభిమానులకు తెలియజేశారు. అంతేనా.. ఏమాయ చేశావే సినిమాలో మాదిరిగానే క్రిస్టియన్, హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుని.. టాలీవుడ్లో కొత్త ట్రెండ్ సృష్టించారు. ఆదర్శ జంట అంటే చై, సామ్ అనే రీతిగా తమ పెళ్లి ప్రయాణం చేశారు. కానీ ఏమైందో ఏమో తమ పెళ్లి ప్రయాణానికి ముగింపు పలికిస్తున్నామంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
అందరిలోనూ ఒకటే ప్రశ్న. మొన్నటివరకు బాగానే ఉన్నారే. ఇప్పుడేమైంది సడన్‌గా విడిపోవడమేంటి అంటూ ఇండస్ట్రీ వర్గాలతో పాటు.. యావత్త్ తెలుగు ప్రజలు చర్చించుకున్నారు. దీనిపై చై, సామ్ కూడా ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. అదే సమయంలో సమంత తన ఇన్ స్టాలో చైతన్యకు సంబంధించిన ప్రతి ఫోటోను డిలీట్ చేసేసింది. అతనిని అన్ ఫాలో కూడా చేసేసింది. అనంతరం ఎవరి కెరీర్లో వాళ్లు బిజీగా ఉన్నారు.
విడిపోయిన తర్వాత సమంత ఆరోగ్యం ఎంతగా కరాబైందో అందరికీ తెలిసిందే. అయినా సరే కెరీర్ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తుంది. యశోద, శాకుంతలం వంటి విభిన్న కథలను ఎంచుకుని తన నటనకు ప్రావీణ్యం సినిమాలను ఎంచుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఈ రెండు సినిమాలు మిశ్రమ ఫలితాలే ఇచ్చాయి. తాజాగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాతో హిట్ కొట్టి మళ్లీ కెరీర్ ట్రాక్‌లో పెట్టింది అంటున్నారు.
ఇదిలా ఉండగా.. సడెన్ గా సమంత ఇన్ స్టా ప్రోఫైల్ లో నాగ చైతన్య ఫోటోస్ కనిపిస్తున్నాయి. ఇదే కాదండోయ్ విడిపోతున్నట్లు వెల్లడించిన పోస్ట్ ప్రస్తుతం ఆమె ప్రోఫైల్ లో కనిపించడంలేదు. దీంతో సమంత, చై మళ్లీ కలిస్తే బాగుంటుందని ఆశించేవారంతా ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. మళ్లీ ఈ జంట కలిస్తే బాగుంటుందంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదే నిజమైతే సామ్, చై మళ్లీ తమ పెళ్లి ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. లేదా ఏదైనా టెక్నికల్ గ్లిచ్ అని సర్దిచెప్పే అవకాశమూ ఉంది.