Home గాడ్జెట్స్ మొబైల్ వాడ‌కంలో త‌ప్ప‌క పాటించ‌వ‌ల‌సిన నియమాలు ఇవే.. లేదంటే మీ ఫోన్ పేలిపోవడం పక్కా

మొబైల్ వాడ‌కంలో త‌ప్ప‌క పాటించ‌వ‌ల‌సిన నియమాలు ఇవే.. లేదంటే మీ ఫోన్ పేలిపోవడం పక్కా

mobile rules
మొబైల్ వినియోగంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి

మొబైల్ ఫోన్ వాడుతున్న‌ప్పుడు తెలియ‌క కొన్ని పొర‌పాట్లు చేస్తాం. వాటి వ‌ల్ల మ‌న‌కు తెలియ‌కుండానే ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంది. మ‌రి ఆ పొర‌పాట్లు ఏంటి?  ఇలాంటి పొర‌పాట్లు మీరు కూడా చేస్తున్నారా? ఇక్క‌డ తెలుసుకోండి.

స్మార్ట్ ఫోన్ వినియోగ నియమాలు

  1. మొబైల్ బ్యాట‌రీ 20% క‌న్నా ఎక్కువ మెయిన్‌టైన్ చేయాలి. అంత‌క‌న్నా త‌క్కువ‌గా ఉండ‌కూడ‌దు. 20% క‌న్నా తక్కువ‌గా ఉంటే మొబైల్ బ్యాట‌రీ పాడైపోతుంది. 
  2. మొబైల్‌లో చాలామంది అన్ని ర‌కాల యాప్స్‌ డౌన్‌లోడ్ చేస్తుంటారు. ర్యామ్ క్లీన‌ర్, ర్యామ్ బూస్ట‌ర్ వంటి యాప్స్ అస్సలు చేయ‌కూడ‌దు. వీటి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. 
  3. మీ మొబైల్‌ని ఎవ‌రికీ ఇవ్వ‌కూడ‌దు. ఒక‌వేళ ఇచ్చారంటే సెక్యూరిటీ ప‌రంగా కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. యాప్ లాక్ ఇన్‌స్టాల్  చేసుకోవాలి. త‌ర్వాత సెట్టింగ్స్, ప్లే స్లోర్, బ్రౌజ‌ర్, సోష‌ల్ మీడియాకు సంబంధించిన యాప్స్ ఫేస్‌బుక్, వాట్సాప్‌, ఇన‌్స్టాగ్రామ్ వీట‌న్నింటికి లాక్ వేసుకోవాలి. తద్వారా హాకర్స్ బెడద నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు.
  4. బ్యాట‌రీ డ్యామేజ్ అవ‌డం వ‌ల‌న ఫోన్ పేలిపోతూ ఉంటుంది. పై నుండి ఫోన్ ప‌డిపోవ‌డం వ‌ల‌న బ్యాట‌రీ డ్యామేజ్ అవుతుంది. క‌నుక ఫోన్ చాలా జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి.
  5. డిఫెక్టివ్ ఛార్జ్‌ర్‌తో చార్జింగ్ పెట్ట‌కూడ‌దు. దీని వ‌ల‌న ఫోన్ పేలిపోతుంది. ఫోన్‌తో పాటు వ‌చ్చిన చార్జ‌ర్ మాత్రమే వాడాలి. ఒకవేళ అది పాడైపోతే మ‌ర‌లా అదే కంపెనీ చార్జ్‌ర్ తెచ్చుకుని వాడాలి.
  6. గేమ్స్ ఎక్కువ‌గా ఆడేవాళ్లు వాటికి బానిస కాకూడదు. లేదంటే కొన్ని స‌మ‌యాల్లో ఫోన్ బాగా వేడెక్కి పేలిపోతుంది. 
  7. వీడియో తీసేట‌ప్పుడు, వీడియో కాల్ మాట్లాడేట‌ప్పుడు, పర్సనల్ హాట్ స్పాట్ ఆన్ చేసినప్పుడు, బ్లూటూగ్ ఆన్ చేసినప్పుడు ఫోన్ వేడెక్కుతూ ఉంటుంది. అ స‌య‌యంలో కాస్త ఆగి ఫోన్ కూల్ అయిన త‌ర్వాత వాటిని ఆన్ చేసుకోవడం మంచిది. లేదంటే ఫోన్ పేలిపోయే ప్ర‌మాదం ఉంటుంది. 
  8. అలాగే లో సిగ్న‌ల్ ఉన్న‌ప్పుడు ఫోన్ బాగా వేడెక్కుతుంది. కాసేపు మొబైల్ డేటా ఆపేయడం, ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోవడం మంచిది.
  9. చాలామంది మొబైల్‌లో చాలా యాప్స్‌ని ఇన్‌స్టాల్ చేస్తూ ఉంటారు. మీ ఫోన్లో ఎంత త‌క్కువ యాప్స్ ఉంటే అంత మంచిది. అప్పుడ‌ప్పుడు ఫోన్ బ్యాకప్ చేసుకుని రీసెట్ చేస్తూ ఉండాలి. దీని వ‌ల‌న అన‌వ‌స‌ర‌మైన డేటా అంతా పోయి ఫోన్ మ‌ళ్లీ కొత్త‌గా ఉంటుంది. 
  10. ఫోన్ బ్యాక్‌సైడ్ క‌రెన్సీ నోట్లు పెట్టి ఫోన్ వాడుతూ ఉంటారు. క‌రెన్సీ నోటు పేప‌ర్‌లాగా ఉండ‌డం కాకుండా కొంచెం మందంగా ఉంటుంది. క‌రెన్సీ నోటు మీద ఉన్న పెయింట్ వల్ల టెంపరేచ‌ర్ బ‌య‌ట‌కు పోకుండా ఆగిపోతుంది. దానితో ఫోన్ వేడెక్కి బ్యాట‌రీ పేలిపోయే అవ‌కాశం ఉంటుంది. 
  11. అలాగే టైట్‌గా ఉన్న పౌచులు వేయ‌కూడ‌దు. అలా వేయ‌డం వ‌ల్ల హీట్ బ‌య‌ట‌కు పోకుండా ఆగిపోతుంది. దీని ద్వారా బ్యాట‌రీ బాగా వేడెక్కి ఫోన్ పేలిపోతుంది. 
  12. అలాగే చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడకూడ‌దు. ఫోన్ మాటిమాటికి కింద ప‌డేస్తూ ఉంటారు. దీని వ‌ల‌న ఫోన్ బ్యాట‌రీ డ్యామేజ్ అయి ఫోన్ పేలుడు సంభ‌వించ‌వచ్చు.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version