వినోద ప్రియులందరికీ గుడ్ న్యూస్. ఈసారి మరింతగా మెస్మరైజ్ చేయడానికి, కట్టిపడేసే కథనాలతో సోనీ లివ్ పక్కాగా సిద్ధమైంది. థ్రిల్లింగ్ పొలిటికల్ డ్రామాలు, ఆద్యంతం ఉత్కంఠ కలిగించే థ్రిల్లర్లు, హృదయాలను హత్తుకునే ఫ్యామిలీ స్టోరీలతో ప్రేక్షకులను అలరించేందుకు భారీగా ప్రాజెక్టులు తీసుకొస్తోంది. 2025లో రిలీజ్ కాబోయే వెబ్‌సిరీస్‌లు, సినిమాలతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఈవెంట్‌లను సైతం స్ట్రీమ్ చేయనుంది. ఇంకెందుకు ఆలస్యం, సోనీ లివ్ అందించబోయే వినోద ప్రయాణాన్ని చూసేద్దాం.
హిందీలో రాబోయే సిరీస్‌లు, సినిమాలు
- రియల్ కాశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్: నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ కథ ఇద్దరు యువకులు కాశ్మీర్‌లో మొదటి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్‌ను ఎలా స్థాపించారనేది ఆసక్తికరంగా చూపిస్తుంది. ఇందులో మానవ్ కౌల్, మహమ్మద్ జీషన్ అయ్యూబ్ ముఖ్య పాత్రల్లో నటించారు.
- డైనస్టీ – మోహ్ నిష్ఠ సత్తా: సాహిల్ సంఘ్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌లో రవీనా టాండన్, రోనిత్ రాయ్ లాంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
- స్కామ్ 2010: ది సుబ్రతా రాయ్ సాగా: ‘స్కామ్’ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు దాని తర్వాతి చాప్టర్‌గా హన్సల్ మెహతా దర్శకత్వంలో ఈ సిరీస్ రాబోతోంది. భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పద వ్యాపార కథల్లో ఇది ఒకటి.
- సమ్మర్ ఆఫ్ 76: 1976 లో దేశంలో ఎమర్జెన్సీ కాలం నేపథ్యంలో సుధీర్ మిశ్రా తెరకెక్కించిన ఈ సిరీస్‌లో విశాల్ వశిష్ఠ, ఇషా తల్వార్ నటించారు.
- మహారాణి 4: పొలిటికల్ డ్రామా సిరీస్‌గా హిట్ అయిన మహారాణి నాలుగో సీజన్‌కు సిద్ధమవుతోంది. హుమా ఖురేషి ‘రాణి భారతి’గా తిరిగి వచ్చి ప్రేక్షకులను అలరించనుంది. ఈ సిరీస్‌ను పునీత్ ప్రకాష్ డైరెక్ట్ చేశారు.
- సివిల్ లైన్స్: ఆధునిక ప్రేమకథతో తెరకెక్కిన ఈ సిరీస్‌లో వరుణ్ శర్మ, శివానీ రఘువంశీ, అనురాగ్ కశ్యప్, రేణుకా షహానే వంటి ప్రముఖులు నటించారు.
- గుల్లక్ 5: ఈ సిరీస్ మరోసారి మన ప్రియమైన మిశ్రా కుటుంబం కథను హాస్యం, ఎమోషన్స్‌తో చెప్పనుంది.
- ఉందేఖి 4: క్రైమ్ థ్రిల్లర్ అభిమానుల కోసం ఉందేఖి నాలుగో సీజన్‌తో తిరిగి వస్తోంది.
- 13th – Some Lessons Aren’t Taught in Classrooms: పాఠశాలలో నేర్పని జీవిత పాఠాలను కథగా చెప్పే ఈ సిరీస్‌ను నిషిల్ శేత్ డైరెక్ట్ చేశారు. ఇందులో గగన్ దేవ్ రియార్, పరేష్ పహుజా, గిరిజా ఓక్ నటించారు.
ఇతర భాషల్లో సిరీస్‌లు, తెలుగులో ప్రాజెక్ట్స్
- బెంగాలీ ఒరిజినల్స్: 1970–71 లిబరేషన్ వార్ సమయంలో జరిగే కథతో ‘జాజ్ సిటీ’ సిరీస్ వస్తోంది.
- తమిళ ఒరిజినల్స్: ఇందులో ‘ది మద్రాస్ మిస్టరీ’, ‘సేతురాజన్ ఐపీఎస్’, ‘కుట్రమ్ పురింధవన్’, ‘తీవినై పొట్రు’, ‘ఫ్రీ లవ్’ లాంటి సిరీస్‌లు ఉన్నాయి. ప్రభుదేవా ‘సేతురాజన్ ఐపీఎస్’ తో ఓటీటీలో ఎంట్రీ ఇవ్వనున్నారు.
- మలయాళ ఒరిజినల్స్: ‘బ్లైండ్‌ఫోల్డ్’, ‘ఐస్’, ‘అన్‌ఫెయిర్’ అనే కొత్త కథలు రాబోతున్నాయి.
- తెలుగు ఒరిజినల్స్: తెలుగులో ‘బ్లాక్ & వైట్’, ‘బృందా 2’ సిరీస్‌లు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో జగపతి బాబు, ఆమని నటించిన ‘బ్లాక్ & వైట్’ హై-స్టేక్స్ డ్రామాగా ఉండనుంది. త్రిష కృష్ణన్, రవీంద్ర విజయ్ నటించిన ‘బృందా 2’ కూడా ఈసారి మరింత డ్రామాతో ఆకట్టుకోనుంది.
రియాలిటీ షోలు, లైవ్ స్పోర్ట్స్
సోనీ లివ్లో రియాలిటీ షోలకూ కొదవలేదు. మిలియన్ డాలర్ లిస్టింగ్ ఇండియా 2, మాస్టర్ చెఫ్ ఇండియా, షార్క్ ట్యాంక్ ఇండియా 5 వంటి ఫేవరెట్ షోలు మళ్లీ కొత్త సీజన్లతో ప్రేక్షకులను అలరించనున్నాయి.
అలాగే క్రీడాభిమానుల కోసం ఆసియా కప్ 2025, యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్, ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎఫ్‌సీ, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారత్ క్రికెట్ సిరీస్‌లు వంటి లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్స్‌ను కూడా సోనీ లివ్ ప్రసారం చేయనుంది.





