Home హెల్త్ Natural Detox Diet : శరీరాన్ని డిటాక్స్ చేసే డైట్​ ప్లాన్ ఇదే.. ఫాలో అయిపోండి..

Natural Detox Diet : శరీరాన్ని డిటాక్స్ చేసే డైట్​ ప్లాన్ ఇదే.. ఫాలో అయిపోండి..

detox diet plan
డిటాక్స్ డైట్ ప్లాన్

Diet Plan for Detox : వస్తువులకు సర్వీసింగ్ ఎంత ముఖ్యమో.. శరీరానికి డిటాక్స్ అంతే ముఖ్యం. అప్పుడు మీరు రోగాల బారిన పడకుండా.. హెల్తీగా ఉండగలుగుతారు. జీర్ణక్రియ, జీవక్రియతో సహా శారీరక విధులకు ఆటంకం కలిగించే ఆక్సీకరణ ఒత్తిడి, మంట నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి డిటాక్స్ చేయాలి అంటున్నారు నిపుణులు.

శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకు వెళ్లకుంటే అవి శరీరంలోపల చెడు కొవ్వుగా మారి శరీరానికి హాని చేస్తాయి. కాబట్టి మలినాలు బయటకు పంపేందుకు డిటాక్స్ చాలా అవసరం. అంతేకాకుండా కొన్నిసార్లు తెలియకుండానే ఎక్కువ ఆహారం తినేసి ఇబ్బంది పడుతూ ఉంటాము. ఆ సమయంలో కూడా మీకు జీర్ణ సమస్యలు వస్తాయి.

తక్కువ నిద్ర, ఎక్కువ ఆహారం కూడా మీ శరీరాన్ని సహజంగా విషాన్ని బయటకు పంపే సామర్థ్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. వాటికి చెక్ పెట్టాలంటే మీరు కచ్చితంగా డిటాక్స్ చేయాల్సిందే. దీనికోసం మీరు డిటాక్స్ ప్లాన్​ని ఫాలో అవ్వాలి. అంటే ఉదయం నుంచి డిన్నర్​ వరకు తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలి.

డిటాక్స్ డ్రింక్

అల్పాహారం కోసం డిటాక్స్ డ్రింక్​తో రోజును ప్రారంభించండి. దానికోసం కప్పు నీరు తీసుకుని దానిలో పసుపు, నిమ్మరసం, అల్లం రసం, పెప్పర్​ పొడి వేసి బాగా కలపండి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర పనితీరుకు కిక్​ స్టార్ట్ అందించి.. నీటి స్థాయిని సమతుల్యం చేస్తాయి.

బ్రేక్​ఫాస్ట్​లో..

శరీరాన్ని డిటాక్స్ చేయడానికి న్యూట్రీషియన్ రిచ్​ బ్రేక్​ఫాస్ట్ తీసుకోవచ్చు. పాలతో చియాసీడ్ పుడ్డింగ్​ చేసుకుని సేవించవచ్చు. ఆరోగ్యం, పోషణ కోసం బెర్రీలు కూడా కలిపి తీసుకోవచ్చు. ఇది మీరు ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఈ ప్రక్రియ జీర్ణక్రియను పెంచుతుంది. లేదంటే మీరు ఉడబెట్టిన గుడ్లు, కూరగాయలను కూడా తీసుకోవచ్చు.

భోజనంలో..

మధ్యాహ్నం తీసుకునే భోజనంలో మీరు తేలికైన ఆహారం తీసుకోవచ్చు. మీ ప్లేట్​లో కొంచెం అన్నం, ప్రొటీన్​తో కూడిన గ్రీన్​ సలాడ్​ ఉండేలా ప్లాన్​ చేసుకోండి. ప్రోటీన్​లో భాగంగా మీరు చేపలు లేదా చికెన్ లేదా పనీర్ తీసుకోవచ్చు.

స్నాక్స్ కోసం..

మనలో చాలా మంది చేసే తప్పు ఏదైనా ఉంది అంటే అది స్నాక్స్. ఫ్రెండ్స్​తో కలిసి బయటకు వెళ్లి లేదా చూసేందుకు బాగుందనే ఏదొకటి తినేస్తూ ఉంటాం. కఠినమైన డైట్స్ చేసినా.. సాయంత్రం ఏదొకటి పర్లేదులే అని తినేస్తాము. కాబట్టి ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవాల్సింది ఇక్కడే. అందుకే స్నాక్స్ టైమ్​లో మీరు బాదం పాలు, బెర్రీలు, నట్స్​తో చేసిన స్మూతీ తీసుకోవచ్చు.

డిన్నర్​..

రాత్రి భోజనం ఎంత లైట్​గా తీసుకుంటే మంచిది. డిటాక్స్ కోసం కాకపోయినా.. ప్రతిరోజు రాత్రి భోజనం చాలా తేలికగా ఉండేలా చూసుకోండి. వెజిటేబుల్ సూప్​ తీసుకుంటే మరీ మంచిది. ఈ డైట్​ని ఫాలో అవుతూ మీరు మీ శరీరాన్ని డిటాక్స్ చేసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చు.

Exit mobile version