Latest

Chase Rats out Home : ఇంట్లో ఎలుకలు ఉంటే ఆ బాధ చెప్పలేనిది. బట్టలనుంచి.. తినే ఆహారం వరకు అన్నింటినీ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వస్తుంది. ఎలుకబోనులు పెట్టినా మీ సమస్య తీరట్లేదు అనుకుంటే ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి. అవి మీ ఇంట్లోనుంచి ఎలుకలను కనుమరుగు చేస్తాయి.

ఇంట్లో ఎలుకలు ఉంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నచ్చిన డ్రెస్​లు చిరిగిపోవచ్చు. లేదంటే తినే ఆహారం పాడైపోవచ్చు. వైర్లు తెగిపోవచ్చు. చెప్పులు సగమే మిగిలి ఉండొచ్చు. పుస్తకాలు చిరిగిపోవచ్చు. రోగాలబారిన పడవచ్చు. ఇలా ఒకటా రెండా ఎన్నో సమస్యలకు ఎలుకలను నిలయంగా చెప్పవచ్చు. తమ దారికి వచ్చిన ప్రతిదానిని అవి నాశనం చేసేస్తాయి. అవి ఎక్కడ దాక్కుంటాయో చెప్పలేము. కంటికి కనిపించినా పట్టుకునేలోపు వేగంగా పరుగెత్తేస్తాయి.

కొన్ని సందర్భాల్లో ఎలుకల బోనులు సహాయం చేసినా.. మరికొన్నిసార్లు అవి విఫలమైపోతాయి. వాటిని తప్పించుకుని తెలివిగా తిరిగేస్తాయి. అయితే కొన్ని సహజమైన ఇంటి నివారణలు వాటిని మీ ఇంటి నుంచి తరిమికొట్టడంలో ప్రభావవంతంగా ఉంటాయి. అవేంటో మీరు తెలుసుకుని ఇంటి నుంచి వాటిని పంపేయండి.

పిప్పరమెంట్ నూనె

పిప్పరమెంట్ ఆయిల్ బలమైన, గాఢమైన సువాసనను కలిగి ఉంటుంది. ఆ స్మెల్​ను ఎలుకలు తట్టుకోలేవు. ఇది ఎలుకలను ఇంటి నుంచి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనికోసం మీరు ఏమి చేయాలంటే.. చిన్న కాటన్ బాల్​ తీసుకుని.. దానిని కొంచెం పిప్పరమెంట్​ ఆయిల్​లో ముంచండి.

కాటన్ బాల్స్ ను ఇంటిలో నాలుగు మూలల.. ముఖ్యంగా పైపులు, సింకులు, ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రాంతాలలో దానిని అప్లై చేయండి. ఇలా రోజూ చేస్తే మీ ఇంటి నుంచి ఎలుకలు పారిపోతాయి.

పెప్పర్ ఫ్లేక్స్

పైన చెప్పిన విధంగానే పెప్పర్ ఫ్లేక్స్ కూడా ఘాటైన వాసన కలిగి ఉంటాయి. పెప్పర్ స్మెల్​కు ఎలుకలకు ఇబ్బంది కలుగుతుంది. ఇది ఎలుకలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది.

ఒకవేళ ఎలుకలు పొరపాటు పెప్పర్ కలిగిన ఆహార పదార్థలు తీసుకుంటే అవి వాటి ప్రాణానికే నష్టం కలిగిస్తాయి. కాబట్టి పెప్పర్​ ఫ్లేక్స్​ను మీ ఇంటి నలుమూలల్లో పెప్పర్ ఫ్లేక్స్ చల్లండి. ఇది ఎలుకల సమస్యనుంచి విముక్తి కలిగిస్తుంది.

ఉల్లిపాయలు

ఉల్లిపాయలతో ఎలుకలను తరిమికొట్టవచ్చు. అయితే ఇది కాస్త శ్రమతో కూడుకున్న పని. కానీ ఎలుకలను తరిమికొట్టడంలో ఉల్లిపాయలు నిస్సందేహంగా ప్రభావవంతంగా పని చేస్తాయి.

ఎలుకలు ఘాటైన వాసనను తట్టుకోలేవు కాబట్టి.. ఉల్లిపాయ ముక్కలను మీరు ఇంట్లోని కొన్ని ప్రదేశాలలో చల్లండి. అయితే ఈ ముక్కలు కుళ్లిపోయే ప్రమాదముంది. కాబట్టి వాటిని నిరంతరం తాజావాటితో భర్తీ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఎలుకలు దూరమవుతాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి ఎలుకలను తరిమికొట్టడంలో ఒక అద్భుతమైన మూలకంగా చెప్పవచ్చు. ఇది ఎలుకలు ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది. ఇంట్లో ఉండేవాటిని బయటకు పంపేస్తుంది. దీనికోసం మీరు కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని.. వాటిని మిక్స్ చేసి ద్రావణాన్ని సిద్ధం చేసుకోవాలి. దీనిని ఎలుకలు సంచరించే ప్రాంతాల్లో చల్లండి. దీనిని ఉపయోగించడం కూడా చాలా సులభం. మీరు ఈ టెక్నిక్​ను తరచూ ట్రై చేయవచ్చు.

బిర్యాని ఆకులు

బిర్యాని ఆకులు కూడా పైన పేర్కొన్న అన్ని నివారణల మాదిరిగానే ఎలుకలను ఇంటి నుంచి తరిమేయగలవు. ఎందుకంటే ఎలుకలు వాటిని తింటే.. వాటికి శ్వాసలో ఇబ్బందులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని నిమిషాల్లోనే అవి చనిపోతాయి. కాబట్టి మీ ఇంటిలో బిర్యాను ఆకులు వేసి ఉంచి.. ఎలుకల సమస్యల నుంచి విముక్తి పొందండి.


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Trending

Exit mobile version