Home స్కిల్స్ Washing machine cleaning tips: వాషింగ్ మెషిన్‌ శుభ్ర‌ప‌రిచే సులువైన చిట్కాలు..

Washing machine cleaning tips: వాషింగ్ మెషిన్‌ శుభ్ర‌ప‌రిచే సులువైన చిట్కాలు..

washing machine, laundry, tumble drier
వాషింగ్ మెషిన్ క్లినింగ్ టిప్స్ Photo by stevepb on Pixabay

Washing machine cleaning tips: వాషింగ్ మెషిన్ వాడడ‌మే కానీ దాని శుభ్రత విషయంలో మాత్రం నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటాం. దీని కార‌ణంగా కొద్ది రోజులకే వాషింగ్ మెషిన్‌లో ర‌క‌రకాల స‌మ‌స్య‌లు వ‌స్తూ ఉంటాయి. అప్పుడ‌ప్పుడు వాషింగ్ మెషిన్ కచ్చితంగా క్లీన్ చేస్తూ ఉండాలి. దీనివ‌ల్ల అందులో ఉన్న మురికి, బాక్టీరియా, క్రిములు పోయి బట్టల మురికి పూర్తిగా పోవడానికి అవ‌కాశం ఉంటుంది. 

అయితే వాషింగ్ మెషిన్ వాడ‌డం ఎంత తెలిసినా దానిని క్లీనింగ్ ఎలా చేయాలో చాలామందికి తెలియ‌దు. వాషింగ్ మెషీన్ ఎప్పుడూ పైన చూడడానికి శుభ్రంగా ఉన్నా లోపల మాత్రం క‌నిపించ‌ని దుమ్ము, ధూళీతో మురికిగా ఉంటుంది. క‌నుక దాన్ని ఎప్పుటిక‌ప్పుడు శుభ్రం చేసుకోవ‌డం చాలా అవ‌స‌రం. దీని వ‌ల్ల వాషింగ్ మెషిన్ ఎక్కువ కాలం మ‌న్నిక‌గా ఉంటుంది. అయితే  సులభంగా వాషింగ్ మెషిన్‌ను ఎలా  క్లీన్ చేసుకోవాలో  కొన్ని టిప్స్  ఇప్పుడు చూద్దాం.

వైట్ వెనిగర్‌తో మెషీన్ క్లీనింగ్:

వైట్ వెనిగర్ మెషిన్ క్లీనింగ్ చేయ‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌నిచేస్తుంది. వెనిగ‌ర్‌ క్రిముల‌ను పోగొట్టే గుణాలు క‌లిగి ఉంటుంది. ముందుగా రెండు క‌ప్పుల వెనిగర్‌ను వాషింగ్ మెషీన్ డిటర్జెంట్ డిస్పెన్సర్లో వేసుకోవాలి. ఆ తర్వాత వాషింగ్ మెషిన్ ఆన్ చేసి కొద్దిసేపు రన్ చేయాలి. అలా చేయడం ద్వారా మెషిన్ లోపల పేరుకుపోయిన మురికిని అంత‌టిని తొల‌గిస్తుంది. డ్ర‌మ్ లోపల మూత చుట్టూ ఉండే బాక్టీరియా మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. దాంతో మీ వాషింగ్ మెషిన్ శుభ్రంగా మారుతుంది. అనంతరం నార్మల్‌గా బట్టలు వాష్ చేసినట్లే నీరు పోసి తిప్పితే స‌రిపోతుంది. మెషీన్‌లో నుండి వ‌చ్చే చెడు వాస‌న‌ను కూడా తగ్గిస్తుంది.

వెనిగ‌ర్, వంటసోడాతో మ‌రింత శుభ్రం:

వాషింగ్ మెషిన్ క్లీనింగ్ ప‌ద్ద‌తిలో మ‌రొక ఎఫెక్టివ్ చిట్కా వంటాసోడా. వెనిగర్, బేకింగ్ సోడా మిశ్రమం కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీనికి  ముందుగా వెనిగ‌ర్, వంట‌సోడా  మిశ్రమాన్ని తీసుకొని స్పాంజితో మెషిన్ లోపల బాగా స్క్రబ్ చేయాలి. అనంతరం కాస్త వేడినీరు పోసుకొని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మురికి త్వరగా పోయి బ‌ట్ట‌లు సులువుగా శుభ్ర‌మ‌వుతాయి. ఆ తర్వాత ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని వాషిన్ మెషిన్ లోపల తుడిచి ఆరబెట్టుకుంటే చాలు. అప్పుడు  వాషింగ్ మెషింగ్ చక్కగా క్లీన్ అవ్వడమే కాకుండా కొత్తదానిలా మెరిసిపోతుంది.

ఈ జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోండి:

  1. వాషింగ్ మెషీన్‌లో చాలామంది వాషింగ్ పౌడ‌ర్ వాడుతుంటారు. కానీ దానికి బ‌దులుగా లిక్విడ్ వాడ‌డమే ఉత్త‌మం. ఎందుకంటే పౌడ‌ర్ బ‌ట్ట‌లు ఉతికేట‌ప్పుడు అందులో చిన్న చిన్న ముద్ద‌లుగా ఉండిపోతుంది. దానివ‌ల్ల డ్ర‌మ్ చెడువాస‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. అదే లిక్విడ్ కొంచెం సాఫ్ట్‌గా ఉండ‌డం వ‌ల్ల డ్ర‌మ్ మొత్తం శుభ్రంగా క్లీన్ అవ‌డానికి అవ‌కాశం ఉంటుంది.
  1. బ‌ట్టలు ఉత‌క‌డం పూర్త‌యిన తర్వాత డ్ర‌మ్ డోర్ కొన్ని నిమిషాల పాటు తెరిచి ఉంచుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల డ్ర‌మ్ లోప‌లికి గాలి చొర‌బ‌డి మెషీన్ ఆర‌డానికి ఇంక చెడువాస‌న రాకుండా ఉండ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.
  1. అలాగే మెషీన్‌లో నుండి బ‌ట్ట‌లు తీసిన త‌ర్వాత  దాన్ని ఒక శుభ్ర‌మైన పొడి క్లాత్ తీసుకుని  డ్ర‌మ్ ర‌బ్బ‌రు ద‌గ్గ‌ర పేరుకుపోయిన దుమ్ముని తుడుచుకోండి. అలాగే డ్ర‌మ్ డోర్‌ని కూడా తుడుచుకోవాలి.
  1. వాషింగ్ మెషీన్‌లో బ‌ట్ట‌ల లోడ్ త‌క్కువ ఉండేలా చూసుకోండి. దాని కెపాసిటీని బ‌ట్టి మెషీన్‌లో బ‌ట్ట‌లు వేయాలి. లోడ్ ఎక్కువ‌య్యే కొల‌దీ మెషీన్‌లో భారీగా శబ్ధం వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. దీనివ‌ల్ల  చాలా స‌మ‌స్య‌లు రావడంతో పాటు త్వ‌రగా పాడైపోయే అవ‌కాశం ఉంటుంది.
  2. నెల‌కు ఒక్క‌సారైనా వాషింగ్ మెషీన్ డిటెర్జెంట్ బాక్స్‌ అంత‌టిని బ‌య‌ట‌కు తీసి శుభ్రంగా క్లీన్ చేసుకుని అది ఆరిన త‌ర్వాత మ‌ళ్లీ  జాగ్ర‌త్త‌గా దానిని అమ‌ర్చుకోవాలి.

– లక్ష్మీ నెక్కల, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

Exit mobile version