Home మనీ ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు?

ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు?

0
ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చు?

ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగి జీవితానికి వెన్నెముక లాంటిది. మనకు తెలియకుండానే ఈ పీఎఫ్ మన సర్వీసుకు అనుగుణంగా పెద్దదవుతుంది. మన కష్టాల్లో అండగా ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ ను ఏడు సందర్భాల్లో మన అవసరాలకు తగినట్టుగా విత్ డ్రా చేసుకోవచ్చు.

ముఖ్యంగా జీవితంలో అతి ముఖ్యమైన సందర్భాల్లో ఈ ప్రావిడెంట్ ఫండ్ మనం ఉపసంహరించుకుని వీలుంది ఆ సందర్భాలు ఏంటో ఇప్పుడు చూద్దాం

1. పెళ్లి

వివాహం చేసుకునే సందర్భంలో ఈపీఎఫ్ నుంచి 50 శాతం మేర ఉద్యోగి వాటా ఉపసంహరించుకోవచ్చు. అయితే ఏడేళ్ళ సర్వీస్ పూర్తిచేసి ఉండాలి.

అవివాహిత ఉద్యోగి లేదా కుమారుడు లేదా కుమార్తె, సోదరుడు లేదా సోదరి  వివాహానికి నగదు ఉపసంహరించుకోవచ్చు.

2. విద్య కోసం

ఉద్యోగి ఈపీఎఫ్ చందా లో 50% వాటా వరకు ఉపసంహరించుకోవచ్చు. దీనికి కూడా ఏడేళ్ళ సర్వీసు పూర్తి చేసి ఉండాలి.

ఉద్యోగి ఉన్నత విద్య కోసం గానీ లేదా పదో తరగతి పూర్తి చేసిన ఆ ఉద్యోగి పిల్లల కోసం గానీ నగదు ఉపసంహరించుకోవచ్చు.

3. స్థలం కొనుగోలు లేదా ఇల్లు నిర్మాణం లేదా ఇంటి కొనుగోలు.

మూడో అంశం అతి ప్రాముఖ్యమైనది. స్థలం కొనుగోలు కోసమైతే నెలసరి వేతనం, డిఎ కలిపి దానిపై 24 రెట్ల మేర ఉపసంహరించుకోవచ్చు. ఇంటి నిర్మాణం కోసం అయితే ముప్పై ఆరు రెట్లు ఉపసంహరించుకోవచ్చు.

ఐదేళ్ల సర్వీస్ పూర్తిచేసి ఉండాలన్న నిబంధన ఉంది. ఇక సదరు ఆస్తి, అంటే స్థలం గానీ ఇల్లు గానీ ఉద్యోగి పేరున గానీ జీవిత భాగస్వామి పేరున గానీ లేదా సంయుక్తంగా గాని రిజిస్టర్ అయి వుండాలి. దాదాపుగా 90 శాతం వరకూ వెనక్కి ఇస్తారు.

4. హోమ్ లోన్ రీ పేమెంట్ కోసం

హోమ్ లోన్ రీ పేమెంట్ కోసం కూడా పీఎఫ్ ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకోవచ్చు. అయితే పదేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. అలాగే సదరు ఆస్తి ఉద్యోగి పేరిట గానీ జీవితభాగస్వామి పేరిట గానీ సంయుక్తంగా గానీ రిజిస్టర్ అయి అయ్యుండాలి.

హోమ్ లోన్ రీపేమెంట్ కోసం 90 శాతం నగదు ఉపసంహరించుకోవచ్చు. ఉద్యోగి చందా, అలాగే యాజమాన్యం చందా.. 2 ఖాతాల నుంచి 90 శాతం ఉపసంహరించుకోవచ్చు.

5. ఇంటి ఆధునీకరణ

ఇందుకోసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. 12 నెలల వేతనానికి సమానంగా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సదరు ప్రాపర్టీ ఉద్యోగం పేరిట లేదా జీవిత భాగస్వామి పేరిట లేదా సంయుక్తంగా గాని రిజిస్టర్ అయి ఉండాలి.

6. మెడికల్ ఎమర్జెన్సీ

ఆరో అంశం మెడికల్ ఎమర్జెన్సీ. ఇక్కడ ఇన్నేళ్లు సర్వీస్ పూర్తిచేసి ఉండాలన్న నిబంధన ఏమీ లేదు. ఆరు నెలలకు సరిపడా నగదు ఉపసంహరించుకోవచ్చు.

ఉద్యోగికి గానీ, కుటుంబ సభ్యుల చికిత్స కోసం కానీ నగదు ఉపసంహరించుకోవచ్చు.

అయితే ట్రీట్మెంట్ కి సంబంధించిన సర్టిఫికెట్ పైన డాక్టర్ మరియు యజమాని సంతకం ఉండాలి.

7. పదవీ విరమణకు ముందు..

ఏడో అంశం పదవీ విరమణ కంటే కొద్దికాలం ముందు.. అంటే ఉద్యోగి 50 ఏళ్ల వయసు చేరుకోగానే నగదు ఉపసంహరించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Previous article హౌజింగ్ వెబ్‌సైట్స్ .. కొనుగోలు నుంచి రిపేర్ల వరకూ
Next article స్మార్ట్ హోం డివైజెస్ తో మీ ఇల్లు స్మార్ట్
డియర్ అర్బన్ డెస్క్ అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, కంటెంట్ ఎడిటర్లు, రీసెర్చ్ నిపుణులతో కూడిన సంపాదక బృందం. సమాజానికి ఉపయోగపడే, నమ్మకమైన, పరిశోధనాత్మక సమాచారాన్ని అందించడం ఈ బృందం ప్రధాన లక్ష్యం. ఈ బృందం సభ్యులకు కలిపి 20 సంవత్సరాలకు పైగా జర్నలిజం అనుభవం ఉంది. ఆర్థికం, జీవనశైలి, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ, ఉద్యోగాలు, సామాజిక అంశాలపై లోతైన అవగాహనతో కథనాలు రూపొందిస్తారు. డియర్ అర్బన్ డెస్క్ ప్రచురించే ప్రతి కథనం కచ్చితత్వం, విశ్వసనీయత, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంది. ప్రచురణకు ముందు అన్ని కథనాలు ఫాక్ట్ చెక్, ఎడిటోరియల్ రివ్యూ ప్రక్రియ ద్వారా ధృవీకరణ తనిఖీ ఉంటుంది. పాఠకులకు సరళమైన భాషలో క్లిష్టమైన అంశాలను అర్థమయ్యేలా వివరించడం డియర్ అర్బన్ డెస్క్ ప్రత్యేకత. సమాజంలో జరుగుతున్న మార్పులు, ట్రెండ్స్, ప్రజలకు ఉపయోగపడే సమాచారం వేగంగా అందించడం ఈ బృందం ముఖ్య ధ్యేయం. డియర్ అర్బన్ డెస్క్ లక్ష్యం — నమ్మకమైన సమాచారం ద్వారా పాఠకుల జీవితాన్ని మెరుగుపరచడం.