Home ఫుడ్ బొబ్బర పప్పు గారెలు .. బ్రేక్ ఫాస్ట్ రెడీ చేయండిలా

బొబ్బర పప్పు గారెలు .. బ్రేక్ ఫాస్ట్ రెడీ చేయండిలా

0
బొబ్బర పప్పు గారెలు .. బ్రేక్ ఫాస్ట్ రెడీ చేయండిలా

బొబ్బర పప్పు గారెలు ఉదయం అల్పాహారంగానూ లేదా సాయంత్రం స్నాక్స్ గానూ తీసుకోవచ్చు. రోజూ పిల్లలకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం, వారు రోజూ ఒకే తీరు బ్రేక్ ఫాస్టా అని ప్రశ్నించడం మీకు భారంగా మారుతుంది. రొటీన్ కు భిన్నంగా ఈజీగా చేయగలిగే మరో బ్రేక్ ఫాస్ట్ బొబ్బర పప్పు గారెలు. వీటినే అలసంద వడలు అని కూడా అంటారు. మంచి పౌష్టికాహారంగా కూడా పరిగణించే ఈ బొబ్బర పప్పు గారెలు ఎలా చేయాలో ఒక సారి చూద్దాం..

బొబ్బర పప్పు గారెలకు కావాల్సిన పదార్థాలు

♦  బొబ్బర పప్పు – ఒక కప్పు

♦  కారం పొడి – ఒక టీ స్పూన్

♦  ఉప్పు – తగినంత

♦  వెల్లుల్లి – నాలుగు రెబ్బలు

♦  జీలకర్ర – అర టీ స్పూన్

♦  వంట సోడా – అర టీ స్పూన్

♦  ఉల్లి గడ్డ – ఒకటి

♦  కొత్తి మీర – తగినంత

♦  కరివేపాకు – తగినంత

cowpea recipe

బొబ్బర పప్పు గారెలు తయారీ విధానం, స్టెప్ బై స్టెప్

  1. ముందుగా బొబ్బర పప్పును రెండు నుంచి మూడు గంటలు నానబెట్టుకోవాలి. 
  2. బాగా నానబెట్టిన పప్పును చక్కగా కడిగి నీళ్లు లేకుండా తీసిపెట్టుకోవాలి
  3. మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, (కారం పొడి బదులుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు), బబ్బెర పప్పు వేసి కొంచెం గరుకుగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి
  4. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ మిశ్రమాన్ని తీసుకొని అందులో కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, వంటసోడా, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి దానిలో డీప్ ఫ్రై కోసం సరిపడా నూనె పోసి నూనె కాగనివ్వాలి. cowpea recipe making
  6. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న గారెల పిండిని తీసుకుని చిన్న చిన్న గారెలుగా ఒత్తుకుని కాగుతున్న నూనెలో వేసి బంగారం రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.

అంతే.. రుచికరమైన, కరకరలాడే బొబ్బర పప్పు గారెలు రెడీ..

జీర్ణక్రియకు మేలు

బొబ్బెర్లను అలసందలు కూడా అంటారు. వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియకు మేలు చేస్తుంది. వీటిల్లో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలం. బొబ్బర్లు లో గ్లైజమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. మధుమేహం ఉన్న వారికి ఆరోగ్యకరమైన ఆహారం. విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. పొటాషియం అందించే ఆహారం ఇది.

– కిరణ్మయి, ఫ్రీలాన్స్ రైటర్

ఇవి కూడా చదవండి


Discover more from Dear Urban

Subscribe to get the latest posts sent to your email.

Previous article మెంతికూర కుడుములు .. హెల్తీ బ్రేక్ ఫాస్ట్
Next article kulu manali tour: కులు మనాలి టూర్ .. మంచులో విహరిద్దాం ఇలా..
డియర్ అర్బన్ డెస్క్ అనుభవజ్ఞులైన జర్నలిస్టులు, కంటెంట్ ఎడిటర్లు, రీసెర్చ్ నిపుణులతో కూడిన సంపాదక బృందం. సమాజానికి ఉపయోగపడే, నమ్మకమైన, పరిశోధనాత్మక సమాచారాన్ని అందించడం ఈ బృందం ప్రధాన లక్ష్యం. ఈ బృందం సభ్యులకు కలిపి 20 సంవత్సరాలకు పైగా జర్నలిజం అనుభవం ఉంది. ఆర్థికం, జీవనశైలి, విద్య, ఆరోగ్యం, టెక్నాలజీ, ఉద్యోగాలు, సామాజిక అంశాలపై లోతైన అవగాహనతో కథనాలు రూపొందిస్తారు. డియర్ అర్బన్ డెస్క్ ప్రచురించే ప్రతి కథనం కచ్చితత్వం, విశ్వసనీయత, పాఠకులకు ఉపయోగకరమైన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతుంది. ప్రచురణకు ముందు అన్ని కథనాలు ఫాక్ట్ చెక్, ఎడిటోరియల్ రివ్యూ ప్రక్రియ ద్వారా ధృవీకరణ తనిఖీ ఉంటుంది. పాఠకులకు సరళమైన భాషలో క్లిష్టమైన అంశాలను అర్థమయ్యేలా వివరించడం డియర్ అర్బన్ డెస్క్ ప్రత్యేకత. సమాజంలో జరుగుతున్న మార్పులు, ట్రెండ్స్, ప్రజలకు ఉపయోగపడే సమాచారం వేగంగా అందించడం ఈ బృందం ముఖ్య ధ్యేయం. డియర్ అర్బన్ డెస్క్ లక్ష్యం — నమ్మకమైన సమాచారం ద్వారా పాఠకుల జీవితాన్ని మెరుగుపరచడం.