రూ. 300లోపు ఆసక్తికరమైన గాడ్జెట్స్

gadgets for smart phone
gadgets for smart phone

ప్రతి ఒక్కరు దాదాపుగా టచ్ మొబైల్స్ నే వాడుతున్నారు. మరి అలాంటి ఫోన్లకు కేవలం రూ. 300లోపే ఆసక్తికరమైన గాడ్జెట్స్ ఏమున్నాయో చూద్దామా.

సెల్ఫీ ఫ్లాష్

వీటిలో ముందుగా 16 ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ గురించి తెలుసుకుందాం మొబైల్ లో వెనుక కెమారా వాడే సమయంలో ఫ్లాష్ లైట్ ఉంటుంది… అదే వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు సెల్ఫీ కెమెరాతో ఫొటో తీసుకోవాలంటే మాత్రం అయ్యో ఫ్లాష్ లైట్ ఉంటే బావుండు అనుకుంటాం.

అలాంటి వారికి ఈ 16 ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ ఉపయోగపడుతుంది. దీన్ని ఉపయోగించాంటే చాలా సులభం. రెగ్యులర్ ఛార్జర్ తోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీనిపైన ఆన్ ఆఫ్ బట్ ఉంటుంది… దాని ద్వారా మూడు స్టెప్పుల్లో 16 ఎల్ఈడీలు ఉన్న ఈ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవచ్చు.

ఫ్లాష్ లైట్ కి 3.5ఎంఎం జాక్ వస్తుంది. దాని సాయంతో మొబైల్ ఆడియో జాక్ (ఇయర్ ఫోన్స్ పెట్టే చోటు) దగ్గర గుచ్చితే సరిపోతుంది. ఫొటో తీసే సమయంలోనే కాదు విద్యుత్తు లేని సమయంలో చిన్నపాటి వెలుతురు కావాలనుకునే వారికి కూడా బాగానే ఉపయోగపడుతుంది.

ఇన్ని ఫీచర్స్ ఉన్న దీని ధర కేవలం రూ. 221 మాత్రమే. అమెజాన్ ఈ కామర్స్ సైట్ లో 16 ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ అని సెర్చ్ చేస్తే చాలు మీకు అందుబాటులోకి వస్తుంది.

మొబైల్ ఫ్యాన్

వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా చాలా ఉపయోగపడే గాడ్జెట్. ఆసక్తికరమైన గాడ్జెట్స్ లో ఇదొకటి. మీరు బయట ఎక్కడో ఉన్నారు.. బాగా ఉక్కపోస్తుంది.. అలాటప్పుడు ఏం చేస్తాం పేపర్ లేదా చిన్న అట్ట ముక్కో చూసుకుని కొంచెం మొహానికి గాలి తగిలేలా ప్రయత్నిస్తాం. అదే ఈ మైక్రో యూఎస్బీ ఫ్యాన్ ఉండి మీ మొబైల్ లో చార్జింగ్ ఉంటే చాలు దానికి గుచ్చి చక్కగా గాలిని ఆస్వాదించొచ్చు. మన మొబైల్ లో ఉండే మైక్రో యూఎస్బీ ఛార్జింగ్ పిన్ కి ఫ్యాన్ గుచ్చితే చాలు. దీని ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది.

కేవలం రూ. 165లకే అమెజాన్ ఈ కామర్స్ సైట్ లో అందుబాటులో ఉంది. మన జేబులో సులభంగా పట్టేంత చిన్నగా ఉంటుంది.

ఆడియో స్ల్పిట్టర్

బస్సులోనో, పార్కులోనో ఇద్దరు ఒకే ఇయర్ ఫోన్ ను చెరో చెవిలో పెట్టుకుని పాటలు వినడం చూసే ఉంటాం. అలాంటి దృశ్యాలు చూడటానికి బానే ఉంటాయి కాని వాళ్లు పాటల్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేరు. అదే ఆడియో స్ల్పిట్టర్ ఉంటే ఒకేసారి అయిదుగురు అదే పాటని ఎంచక్కా వినొచ్చు.

మరో సందర్భం కూడా చెప్పుకుందాం. మిత్రులు కలిసి ఉండే చోట ఒకరు నిద్రపోతూ ఉంటారు. మిగిలిన వారు ల్యాప్ టాప్ లో సినిమా లేదా యూట్యూబ్ చూస్తూ ఉంటారు. వారి నిద్ర చెడిపోతుందనే ఉద్దేశంతో ఒకోసారి ఆపేయాల్సి వస్తుంది. అలాటప్పుడు కూడా ఆడియో స్ల్పిట్టర్ చాలా ఉపయోగపడుతుంది. 3.5 జాక్ ఇన్స్ 6 ఉండే ఆడియో స్ల్పిట్టర్ అందుబాటులో ఉంటుంది.

దానికి రెండు వైపుల మేల్ అవుట్ ఉండే జాక్ కూడా ఇస్తారు. ఆ కేబుల్ ఒకవైపు మొబైల్ లేదా ల్యాప్ ట్యాప్ కి కనెక్ట్ చేసి మరోవైపు ఆడియో స్ల్పిట్టర్ కి కనెక్ట్ చేయాలి. మిగిలిన ఫిమేల్ 3.5 జాక్ ఇన్ స్టాట్స్ లో ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ సెట్స్ పెట్టుకుని ఒకేసారి అయిదుగురు వినొచ్చు.

దీని ధర రూ.294 మాత్రమే. ఇది కూడా అమెజాన్ ఈ కామర్స్ సైట్ లో అందుబాటులో ఉంది. ఆడియో స్ల్పిట్టర్ యడాప్టర్ అని సెర్చ్ చేస్తే కనిపిస్తుంది.

వీఆర్ హెడ్సెట్వర్చువల్ రియాలిటీ(వీఆర్)

టెక్నాలజీ సమాచారం తెలుసుకునేటప్పుడో లేదా 360 డిగ్రీల వీడియో గురించి చర్చించేటప్పుడే వినే ఉంటాం. కాని ఉపయోగించిన సందర్భాలు తక్కువగా ఉంటాయి. వీఆర్ హెడ్సెట్ ధర ఎక్కువగా ఉండటం, దాని గురించి పూర్తిగా తెలియకపోవడం కారణాలు కావచ్చు.

అయితే ప్రస్తుతం అమెజాన్ ఈ కామర్స్ లో రూ. 300లోపులోనే వీఆర్ హెడ్సెట్ అందుబాటులో ఉంటుంది. ఇది మన దగ్గర ఉంటే.. యూట్యూబ్ లో అందుబాటులో ఉండే 360 డిగ్రీ వీడియోలు చూడొచ్చు.

అంటే వీడియోలో చూపే 360 డిగ్రీలలో మనం ఎటువైపు చూడాలి అనుకుంటే అటే చూడొచ్చు.. నేరుగా మనం అక్కడే ఉండి చూస్తున్న అనుభూతి కలుగుతుంది. వీఆర్ గేమ్స్ ఆడేందుకు ఉపయోగపడుతుంది. మొబైల్ వీఆర్ హెడ్సెట్ కు సపోర్టు చేస్తే రెగ్యులర్ సినిమాలు కూడా థియేటర్ లో చూసినట్లు అనుభూతి కలిగేలా చూడొచ్చు. వీఆర్ కి కన్వర్ట్ చేసిన త్రీడీ సినిమాలు కూడా చూడొచ్చు.

వాటర్ ఫ్రూఫ్ పౌచ్

వర్షా కాలం బయటకు వెళితే ఎప్పుడు తడిచిపోతామో తెలియదు.. ముఖ్యంగా వేలు పోసి కొనే మొబైల్ తడిచిపోతుందేమో బెంగ సహజంగా ఉంటుంది. టాప్ ఎండ్ మొబైల్స్ లలో కొన్ని వాటర్ ఫ్రూఫ్ మోడల్స్ ఉన్నా మిగిలిన వారికి మాత్రం అకాల వర్షాలతో మొబైల్ తడిచిపోయి పాడవుద్దని కంగారు పడతారు. చాలా మంది ఆ ఇబ్బందిని కూడా చూసే ఉంటారు.

అలాంటి వారికి వాటర్ ఫ్రూఫ్ పౌచ్ చాలా ఉపయోగపడుతుంది. మన జేబులో పెట్టుకునే తీసుకెళ్లగలిగేలా ఉండే ఈ పౌచ్ నీళ్లల్లోకి వెళ్లినా, వర్షంలో తిరిగే సమయంలో మొబైల్ కి పెట్టేస్తే మనం చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. దీని ధర కూడా మనకు అందుబాటులోనే ఉంది. కేవలం రూ. 216తో అమెజాన్ ఈకామర్స్ సైట్ లో అందుబాటులో ఉంది.

వాటర్ ఫ్రూఫ్ మొబైల్ పౌచ్ అని సెర్చ్ చేస్తే చాలు కనిపిస్తుంది. మరింకెందుకు ఆలస్యం తక్కువ ధరలో దొరిగే ఈ చిన్నపాటి ఆసక్తికరమైన గాడ్జెట్స్ కొనుగోలు చేసి ఎంజాయ్ చేయండి మరి..

— డియర్ అర్బన్ టీమ్

ఇవి కూడా చదవండి

♦  రూ. 15 వేల రేంజ్ లో బెస్ట్ స్మార్ట్‌ ఫోన్స్ ఇవే

♦  ఆన్ లైన్ లో పాత వస్తువులు అమ్ముతున్నారా?

♦  రూ. 10 వేల లోపు టాప్ 10 మొబైల్స్

Next articleఫ్యాక్టరీ సెట్టింగ్స్ రీసెట్ లో జాగ్రత్తలు