Home ఫుడ్ షీర్ ఖుర్మా సిద్ధం చేద్దాం ఇలా..

షీర్ ఖుర్మా సిద్ధం చేద్దాం ఇలా..

sheer khurma
pic credit https://upload.wikimedia.org/wikipedia/commons/b/bc/Sheer_khurma.jpg

నోరూరించే షీర్ ఖుర్మాఎవరికి నచ్చదు? ఈద్ వచ్చిందంటే షీర్ ఖుర్మా ఉండాల్సిందే.. చాలా సింపుల్ గా చేయగలిగే స్వీట్ షీర్ ఖుర్మా. ఎలా చేయాలో ఓసారి చూద్దామా? ఈ స్వీట్ చేసేందుకు కావాల్సిన పదార్థాలన్నీ సాధారణ కిరాణా షాపులో దొరికేవే. దొరకనిపక్షంలో ఆమెజాన్ ప్యాంట్రీ వంటి ఆన్ లైన్ గ్రాసరీలో ట్రై చేయండి.

కావాల్సిన పదార్థాలు

  పాలు ఒకటిన్నర లీటర్లు

◊  సేవయాన్ (సేమియా) 100 గ్రాములు

◊  చక్కెర 200 గ్రాములు

  ఖజూర్ 50 గ్రాములు

  బాదాం 25 గ్రాములు

  కిస్మిస్ 25 గ్రాములు

  చిరోంజీ 25 గ్రాములు

  మిల్క్ మెయిడ్ టిన్ లో నాలుగో వంతు

చేసే విధానం ఇలా..

  1. బాదం, కాజూ, కజూర్ తదితర డ్రై ఫ్రూట్స్ ను రాత్రిపూట విడిగా నానబెట్టాలి. 

  2. మరుసటి రోజు ఉదయం ఈ ఎండు పండ్లను సన్నని ముక్కలుగా కోయండి.

  3. ఇప్పుడు మందంగా ఉన్న వంట పాత్ర తీసుకొని పాలు పోసి బాగా వేడి చేయాలి. ఇప్పుడు మిల్క్‌మెయిడ్ తీసుకొని అందులో పోసి బాగా కలపాలి.

  4. దీనికి సేవయాన్ ( సేమియా ) జోడించి మళ్లీ కలపాలి. ముద్దలు ఏర్పడకుండా చూడాలి. పాలు వెంట వెంట కలుపుతూ ఉండాలి.

  5. ఇప్పుడు దానిలో ముక్కలు చేసిన కజూర్‌ను వేసి తక్కువ మంట మీద ఉడికించాలి. దానికి చక్కెర వేసి బాగా కలపాలి.

  6. మరొక చిన్న కడాయి తీసుకొని మూడు నాలుగు చెంచాల నెయ్యి వేసి కాజు, బాదం, చిరోంజీ మరియు కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి దానికి మనం తయారుచేస్తున్న ఖీర్ యొక్క రెండు మూడు టేబుల్ స్పూన్లు కలపాలి.

  7. వేయించిన పొడి పండ్లను నేరుగా పాలలో వేస్తే పాలు విరిగిపోవచ్చు. కాబట్టి దీనిని నివారించడానికి నేను ఈ పద్ధతిని ఎంచుకున్నాను.

  8. తరువాత దీనిని ఖీర్ కు జోడించిన తరువాత, తక్కువ మంట మీద మరో మూడు నిమిషాలు ఉంచి ఉడికించాలి.

  9. ఇప్పుడు షీర్ ఖుర్మా సిద్ధంగా ఉంది. మీకు నచ్చితే మీరు వేడిగా ఉంచవచ్చు లేదా రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం ద్వారా చల్లగా వడ్డించవచ్చు.

వ్యాసకర్త: మిథిలా పావని, ఫ్రీలాన్స్ రచయిత

ఇవి కూడా చదవండి

Exit mobile version