ఇది స్టార్టప్‌ల యుగం. లక్షల జీతం వచ్చే ఉద్యోగాలను కూడా వదులుకొని సొంతంగా ఓ స్టార్టప్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచన నేటి యువతలో పెరిగిపోతోంది. స్టార్టప్ ఐడియాలు వెతుకుతున్న కాలమిది.. స్టార్టప్ అంటే ఏమీ లేదు. చిన్నగా, తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టే వ్యాపారం. ముఖ్యంగా ఐటీ సెక్టార్‌లో ఈ స్టార్టప్‌ల సంఖ్య చాలా ఎక్కువ.
ఒక్కరు లేదా నలుగురైదుగురు ఫ్రెండ్స్ కలిసి చిన్న ఆఫీస్ స్పేస్ అద్దెకు తీసుకొని స్టార్టప్‌ను మొదలు పెట్టేస్తున్నారు. నేరుగా దేశ, విదేశాల్లోని క్లైంట్స్‌ను సంప్రదించి చిన్న, చిన్న ప్రాజెక్టులను దక్కించుకుంటున్నారు. కాస్త రిస్క్ అయినా సరే.. ఓ సంస్థలో ఉద్యోగిగా చేసే కంటే.. ఇలా సొంతంగా స్టార్టప్ బెటర్ అన్న ఆలోచన యువతలో పెరిగిపోతోంది.
టీహబ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి స్టార్టప్స్‌ను ఎంకరేజ్ చేయడానికి గచ్చిబౌలిలో ఓ భవనాన్ని నిర్మించిన సంగతి తెలుసు కదా. స్టార్టప్‌ల కోసం తక్కువ అద్దెకు కార్పొరేట్ స్పేస్ ఇవ్వడమే ఈ టీహబ్ ఉద్దేశం.
అయితే చాలా మందికి ఏదైనా స్టార్టప్ మొదలుపెట్టాలని ఉన్నా.. ఏం చేయాలి.. ఎలా చేయాలి అన్నదానిపై స్పష్టత ఉండదు. అలాంటి వాళ్లకు టెక్నాలజీ రంగంలో ఎలాంటి స్టార్టప్స్ బెటరో ఇప్పుడు చూద్దాం. మీ కోసం డియర్ అర్బన్ డాట్ కామ్ అందిస్తున్న స్టార్టప్ ఐడియాలు ఇవీ..
యాప్ డెవలపర్
ఈ స్మార్ట్ ప్రపంచంలో ప్రతిదానికీ ఓ యాప్ ఉంటోంది. అందుకే యాప్ డెవలపర్లకు ఈ రోజుల్లో ఫుల్ డిమాండ్. మీరూ యాప్ డెవలపర్ అయితే సొంతంగా ఓ స్టార్టప్ ప్రారంభించేయండి. సొంత ప్రాజెక్టుల కోసం లేదా ఇతర సంస్థల కోసం యాప్స్‌ను డెవలప్ చేయండి.
మీ యాప్‌ను ప్రమోట్ చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రోడక్ట్‌హంట్, బీటాలిస్ట్, ఫేస్‌బుక్ యాడ్స్, ద స్టార్టప్ పిచ్‌లాంటి వెబ్‌సైట్స్ ద్వారా మీ యాప్స్‌కు మార్కెటింగ్ చేసుకోవచ్చు. పైగా ఇక్కడే మీ యాప్ డెవలప్‌మెంట్ సర్వీస్‌లో పెట్టుబడి పెట్టేవాళ్లను కూడా మీరు వెతుక్కోవచ్చు.
టెక్నాలజీ కన్సల్టెంట్
ఇప్పుడు ప్రపంచమే టెక్నాలజీ చుట్టూ తిరుగుతోంది. ప్రతి రోజు ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీలు, కొత్త ఆవిష్కరణలు మన ముందుకు వస్తున్నాయి. మీకు ఈ టెక్ ట్రెండ్స్‌ను ఫాలో కావడం చాలా ఇష్టమా.. అయితే మీరు టెక్నాలజీ కన్సల్టెంట్‌గా మారిపోవచ్చు.
మీ పని సింపుల్.. మీరు ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలకు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీల సమాచారం ఇస్తుండాలి. వాటిలో ఏయే టెక్నాలజీలు కంపెనీ డెవలప్‌మెంట్‌కు ఉపయోగపడతాయో వివరించాలి. టెక్నాలజీని బాగా ఫాలో అయ్యే వాళ్లకు ఇదేమంత కష్టమైన పనేమీ కాదు.
సోషల్ మీడియా మేనేజర్
ఇది సోషల్ మీడియా యుగం. ప్రస్తుతం మెయిన్‌స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియాకే ఫాలోవర్స్ ఎక్కువ. అందుకే చాలా బ్రాండ్స్ ప్రమోషన్ కోసం సోషల్ మీడియాపై ఆధారపడుతున్నాయి. మీకు సోషల్ మీడియాపై పట్టు ఉంటే.. వెంటనే ఓ స్టార్టప్ మొదలు పెట్టేయొచ్చు. సోషల్ మీడియా మేనేజర్‌గా బ్రాండ్స్ ప్రమోషన్ చేసుకోవచ్చు.
మీరు ఒప్పందం కుదుర్చుకున్న బ్రాండ్ తాలూకు సోషల్ మీడియా అకౌంట్‌ను మేనేజ్ చేయాలి. బ్రాండ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయడం, ఫాలోవర్స్ కామెంట్లు, డౌట్లకు సమాధానాలు ఇస్తుండటం చేయాలి. డిజిటల్ మార్కెటింగ్ రూపొందించాలి. బ్రాండ్ ఫాలోవర్స్‌ను పెంచాలి. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై పట్టు అవసరం లేదు.
మీకు బాగా తెలిసిన వాటితోనే ప్రమోట్ చేయండి. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ట్రెండ్స్ తెలుసుకోవడం చాలా అవసరం. ఒక్కో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఒక్కో స్ట్రేటజీ అవసరం అవుతుంది. అందుకే ఈ బిజినెస్‌కు అనుభవం చాలా ముఖ్యం.
వెబ్‌సైట్ డెవలప్‌మెంట్
ఈ రోజుల్లో చాలా ఈజీగా సంపాదించే మార్గాల్లో ఈ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ స్టార్టప్ కూడా ఒకటి. ముఖ్యంగా ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్‌లను తయారుచేయడానికి సాయపడే ఎన్నో ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి వెబ్‌సైట్ డెవలప్ చేయడం చాలా ఈజీ.
పైగా ఈ మధ్య చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్లు కూడా వెబ్‌సైట్ల వైపు చూస్తున్నారు. వాళ్లకు ఓ బేసిక్ వెబ్‌సైట్ డెవలప్ చేసి మెయింటేన్ చేసినా చాలు.. డబ్బులివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వర్డ్‌ప్రెస్, స్క్వేర్ స్పేస్, సైట్123, వీబ్లీ, షాపిఫైలాంటి కాంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌తో వెబ్‌సైట్ డెవలప్ చేయొచ్చు.
అడ్వాన్స్‌డ్ వెబ్ డెవలప్‌మెంట్
సీఎంఎస్ టూల్స్ ఉపయోగించి చేసేవాళ్లు బేసిక్ డెవలపర్స్. ఇలాంటి వాళ్లు చాలా మందే ఉన్నారు. మీకు అనుభవం ఉండి, అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామింగ్ చేయగలిగితే అడ్వాన్స్‌డ్ వెబ్ డెవలపర్‌గా మారొచ్చు. దీనివల్ల మీ సంపాదన కూడా పెరుగుతుంది. పెద్ద పెద్ద బిజినెస్‌లకు అవసరమయ్యే వెబ్‌సైట్‌లను డిజైన్ చేయగలిగితే పెద్ద మొత్తంలో సంపాదించే అవకాశం ఉంటుంది.
దీనికోసం అవసరమైన అన్ని టూల్స్ , టెక్నిక్స్ తెలిసి ఉండాలి. యూజర్ ఫ్రెండ్లీగా ఉంటూ సెర్చ్ ఇంజిన్ ఫ్రెండ్లీ పేజ్‌లను తయారు చేయగలిగే డెవలపర్స్‌కు మంచి డిమాండ్ ఉంది.
అనుబంధ మార్కెటింగ్
ఇది ఎన్నో ఏళ్లుగా విజయవంతమైన ఆన్‌లైన్ బిజినెస్‌గా పేరు సంపాదించింది. అనుబంధ లేదా అఫిలియేట్ మార్కెటింగ్ అంటే.. ఓ సంస్థ తయారు చేసే ప్రోడక్ట్ మీ ద్వారా కస్టమర్‌కు చేరుతుంది. ఓ ప్రోడక్ట్‌ను తయారు చేసే సంస్థ లేదా డిస్ట్రిబ్యూటర్లతో మీరు ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ల ఉత్పత్తులను మీ వెబ్‌సైట్ లేదా బ్లాగ్ లేదా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రమోట్ చేసి కస్టమర్లకు అమ్మాల్సి ఉంటుంది.
ఇందుకుగాను సదరు కంపెనీ నుంచి కమీషన్ వస్తుంది. సింపుల్‌గా మీ ద్వారా ఓ కస్టమర్ ఓ కంపెనీ ఉత్పత్తిని కొంటే.. మీకు లాభం చేకూరుతుంది. http://www.shareasale.com/, https://www.clickbank.com/, http://www.affiliatefuture.
ఆన్‌లైన్ ట్యూషన్స్
ఆన్‌లైన్ ట్యూటోరింగ్ ఇప్పుడు వేగంగా వృద్ధి చెందుతున్న రంగం. గత ఐదేళ్లలో 40 శాతం వృద్ధి సాధించింది. మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ట్యూటోరింగ్ స్టార్టప్ ఉత్తమమైన మార్గం. మీకు పట్టు ఉన్న సబ్జెక్ట్‌పై ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పొచ్చు. మెల్లగా మీ స్టూడెంట్ బేస్‌ను పెంచుకోవాలి. ఓ యూట్యూబ్ చానెల్‌ను క్రియేట్ చేసి మీ టీచింగ్ వీడియోను అందులో పోస్ట్ చేయొచ్చు. Tutor.com, VIPKID, TutorHub.com, Smarthinking, Skooli, Vedantu లాంటి వెబ్‌సైట్లలో ఆన్‌లైన్ ట్యూషన్స్ ఆఫర్లు ఉంటాయి.
టెక్ వీడియో చానెల్
దీని ద్వారా సింపుల్‌గా ఇంట్లో కూర్చొనే రెండు చేతులా సంపాదించవచ్చు. యూట్యూబ్‌లో ప్రస్తుతం ఈ టెక్ వీడియోనే పాపులర్ టాపిక్. మీకు టెక్నాలజీపై ఆసక్తి ఉంటే చాలు. ఎప్పటికప్పుడు మార్కెట్‌లోకి వస్తున్న టెక్నాలజీ గురించి చెబుతూ వీడియోలు చేయొచ్చు.
లేదంటే కొత్తగా వచ్చే గాడ్జెట్స్ పై రీవ్యూలూ ఇవ్వొచ్చు. రోజుకో కొత్త టెక్నాలజీ వస్తున్న ఈ రోజుల్లో చెప్పడానికి బోలెడంత కంటెంట్ ఉంటుంది. ఈ టెక్ వీడియోలకు యూట్యూబ్‌లో మంచి డిమాండ్ ఉంది. యూట్యూబ్‌లో మీ సొంత టెక్ వీడియో చానెల్ స్టార్ట్ చేసి అందులో వీడియోలు పోస్ట్ చేయండి. మీరు చెప్పే విషయాలు నచ్చితే సబ్‌స్క్రైబర్స్ సంఖ్య పెరుగుతుంది. అలా మీ సంపాదనను కూడా పెంచుకోవచ్చు.
మీకు నచ్చిన స్టార్టప్ ఐడియాలు మాతో పంచుకోవాలనుకుంటే మాకు మెయిల్ చేయండి editor@dearurban.com
ఇవి కూడా చదవండి